Share News

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ నూస్.. అద్దె ఇంటికి వెళ్తున్న స్టార్ హీరో..

ABN , Publish Date - Feb 27 , 2025 | 10:21 AM

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ‘మన్నత్’ని విడిచి వెళ్ళిపోతున్నారు. తనకు ఎంతో ఇష్టమైన సొంతింటిని విడిచి అద్దె ఇంటికి వెళ్లనున్నారు. అసలు ఏం జరిగింది? షారుఖ్ ఎందుకు మన్నత్‌ను విడిచి వెళ్లిపోతున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ నూస్.. అద్దె ఇంటికి వెళ్తున్న స్టార్ హీరో..
Shah Rukh Khan

Shah Rukh Khan: ‘మన్నత్’ అంటే చాలా మందికి తెలియదు. కానీ, మన్నత్ అంటే ప్రతి షారుఖ్ ఫ్యాన్ కి, ముంబైలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతకీ మన్నత్ అంటే ఏంటో అనుకుంటున్నారా? బాలీవుడ్ బాద్‌షా, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నివసించే ఇంటి పేరు. షారుఖ్ ఫ్యాన్స్ ఎవరైనా ముంబై వస్తే కచ్చితంగా మన్నత్ ఇంటి ముందు ఫొటో దిగి వెళ్తారు. ముంబైలో అది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది. ఆ ఇంటి ముందు ఎప్పుడూ జనాలు, ఫ్యాన్స్ ఉంటూనే ఉంటారు తన అభిమానులకు షారుఖ్ తన ఇల్లు మన్నత్ నుంచే అభివాదం చేస్తూ ఉంటాడు. మన్నత్ అని తన ఇంటి పేరుని డైమండ్స్ నేమ్ బోర్డుతో చేయించి గతంలో బిల్డింగ్ బయట పెట్టాడు.

అయితే, గత రెండు దశాబ్దాలుగా షారుఖ్ మన్నత్ కి ఫ్యాన్స్ కి ఉన్న బంధం కొన్ని రోజులకు బ్రేక్ పడనుంది. ఎందుకంటే మన్నత్ రీ ఇన్నోవేషన్ కోసం షారుఖ్ తన ఫ్యామిలీతో కలిసి కొన్ని నెలల పాటు ఆ ఇంటిని ఖాళీ చేసి అద్దె ఇంటికి వెళ్లనున్నారంట. ఈ మేరకు బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మన్నత్ ఎప్పుడో 1914లో కట్టారు. ఆ ఇల్లు బాగా నచ్చడంతో 2001లో షారుఖ్ దానిని కొనుక్కొని మన్నత్‌గా పేరు మార్చి అందులో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.


నెలకు రూ. 24 లక్షల అద్దె

ఈ రెండు దశాబ్దాలుగా షారుఖ్‌కి మన్నత్‌కి ఫ్యాన్స్‌కి మంచి అనుబంధం ఏర్పడింది. ఇల్లు కట్టి చాన్నాళ్లు అవ్వడం, రీ ఇన్నోవేషన్ చేయించి కూడా 20 ఏళ్ళు అవుతుండటంతో ఆ ఇంటిని షారుఖ్ మరింత కొత్తగా రీ ఇన్నోవేట్ చేయిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కొన్ని నెలల పాటు ఫ్యామిలీతో కలిసి ముంబైలోని లగ్జరీ ఏరియా బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుతున్నాడని సమాచారం. ఆ అపార్ట్మెంట్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీది అని తెలుస్తుంది. ఆ అపార్ట్మెంట్ రెంట్ కోసం షారుఖ్ నెలకు రూ. 24 లక్షలు చెల్లిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీంతో హీరో షారుఖ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇదివరకులా షారుఖ్ తమకు అభివాదం చేయలేడని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Also Read:

ఆసక్తిరేకెత్తిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'ది ఐ' ట్రైలర్

ఆయన పక్కన లేకపోతే... అందుకే అలా చేశా..

Updated Date - Feb 27 , 2025 | 10:34 AM