BJP Thamilisai: విజయం తర్వాతే.. సంకీర్ణ ప్రభుత్వంపై నిర్ణయం
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:11 PM
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వంపై అమిత్ షా, ఎడప్పాడి పళనిస్వామి కలిసి నిర్ణయం తీసుకుంటారని బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందర్‌రాజన్ తెలిపారు. స్థానికంగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం వచ్చిన తమిళిసై మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ నిధులు వెచ్చించి‘ఉంగళుడన్ స్టాలిన్’ పేరుతో డీఎంకే ఎన్నికల ప్రచారం చేపట్టిందని ఆరోపించారు.

- బీజేపీ సీనియర్ నేత తమిళిసై
వేలూరు(చెన్నై): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం సంకీర్ణ ప్రభుత్వంపై అమిత్ షా, ఎడప్పాడి పళనిస్వామి కలిసి నిర్ణయం తీసుకుంటారని బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందర్‌రాజన్(Thamilisai Soundararajan) తెలిపారు. స్థానికంగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం వచ్చిన తమిళిసై మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ నిధులు వెచ్చించి‘ఉంగళుడన్ స్టాలిన్’ పేరుతో డీఎంకే ఎన్నికల ప్రచారం చేపట్టిందని ఆరోపించారు. నాలుగేళ్లలో చేయని పనులు 45 రోజుల్లో చేస్తున్నట్లు ప్రచార ఆర్భాటంలో తెలుపుతున్నారన్నారు.
ఉంగళుడన్ స్టాలిన్ కార్యక్రమంలో అవినీతి జరుగుతోందన్నారు. సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ప్రజల నుంచి లంచాలు ఆశిస్తున్నారని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంగై కొండ చోళవందాన్ రావడం గౌరవంగా భావిస్తున్నామన్నారు ప్రధాని పర్యటన బీజేపీ శ్రేణులకు మరింత ఉత్తేజం అందిస్తుందన్నారు. సీమాన్, విజయ్ తదితరులు కూటమిలోకి రావాలని పళనిస్వామి ఆశిస్తున్నారని, బీజేపీ-అన్నాడీఎంకే కూటమిలో ఎలాంటి భేధాభిప్రాయాలు లేవన్నారు.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ఆమె తెలిపారు. డీఎంకే కూటమిలో తిరుమావళవన్, కార్తీ చిదంబరం, సెల్వపెరుందగై, కమ్యూనిస్ట్ నేతలు తమకు ఎన్ని సీట్లు ఇస్తారు అని బెదిరిస్తున్నారన్నారు. గ్రూప్-4 పరీక్షల్లో అవతవకలు జరిగాయని అన్నాడీఎంకేలాగే బీజేపీ కూడా అభిప్రాయ పడుతుందన్నారు. ఉప రాష్ట్రపతి రాజీనామాపై అభిప్రాయం తెలియజేయడం లేదని, రాష్ట్రానికి చెందిన వారు ఉప రాష్ట్రపతిగా రావాలని కోరుకుంటున్న తరుణంలో, ఈ రేసులో తాను లేనని తమిళిసై తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
2 నెలల్లో ఓఆర్‌ఆర్ ఆర్థిక ప్రతిపాదనలు
Read Latest Telangana News and National News