Prashant Kishor: ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల గుర్తు కేటాయించిన ఈసీ
ABN , Publish Date - Jun 25 , 2025 | 09:08 PM
ప్రశాంత్ కిషోర్ పార్టీ స్థాపించడానికి ముందు రెండేళ్లపాటు మహాత్మాగాంధీ సత్యాగ్రహం చేపట్టిన చంపరాన్ నుంచి రాష్ట్రంలో సుమారు 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు గత నెలలో ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) 'జన్ సురాజ్' (Jan Suraj) పార్టీకి ఎన్నికల గుర్తును ఎలక్షన్ కమిషన్ (EC) కేటాయించింది. ఎన్నికల గుర్తుగా 'స్కూల్ బ్యాగ్' (School bag)ను కేటాయించింది. ఈ గుర్తుపైనే రాష్ట్రంలోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జన్ సురాజ్ పార్టీ పోటీ చేయనుంది. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. సంస్కరణలు, సమ్మిళిత అభివృద్ధి ద్వారా సామాజిక ఉద్ధరణ సాధించాలనే పార్టీ లక్ష్యానికి అనుగుణంగా పార్టీ గుర్తు ఉందని తెలిపారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరుతెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ 2024 అక్టోబర్ 2న 'జనసురాజ్' పార్టీని ప్రారంభించినట్టు ప్రకటించారు. పార్టీ స్థాపించిన 8 నెలల తర్వాత ఈసీ ఎన్నికల గుర్తును కేటాయించింది. ప్రశాంత్ కిషోర్ పార్టీ స్థాపించడానికి ముందు రెండేళ్ల పాటు మహాత్మాగాంధీ సత్యాగ్రహం చేపట్టిన చంపరాన్ నుంచి రాష్ట్రంలో సుమారు 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. పార్టీ తొలి జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు గత నెలలో ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
బిహార్ ఎన్నికలు ఎప్పుడంటే..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్‌లో జరగాల్సి ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్-నవంబర్ 2020లో జరిగాయి. ఎన్నికల అనంతరం నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 2022 ఆగస్టులో నితీష్ సారథ్యంలోని జేడీయూ ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుని, ఆర్జేడీ సారథ్యంలోని మహాఘట్ బంధన్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, 2024 జనవరిలో మహాఘట్ బంధన్‌కు నితీష్ కుమార్ ఉద్వాసన చెప్పి తిరిగి ఎన్డీయేతో చేతులు కలిపారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో తిరిగి నితీష్ సీఎంగా పగ్గాలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
రెక్కలు మీవి, ఎగరడానికి పర్మిషన్ అడక్కండి.. ఖర్గే వ్యాఖ్యలపై శశిథరూర్
సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు
For National News And Telugu News