Letter to CM: మావోయిస్టులతో చర్చలకు ముగ్గురు పేర్లు ప్రతిపాదన
ABN , Publish Date - Apr 26 , 2025 | 09:32 AM
Letter to CM: ఆపరేషన్ కగార్ పేరిట మవోయిస్టులను కేంద్రం ఏరివేస్తోంది. దీంతో పలువురు మావోయిస్టులు ఇప్పటికే ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. అలాగే పలు ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్నాయి. దీంతో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.

ఛత్తీస్‌గఢ్, ఏప్రిల్ 25: దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం మోదీ సర్కార్ పక్కా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అందులోభాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టింది. దీంతో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకొంటున్నాయి. దాంతో మావోయిస్టులు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అలాంటి వేళ భారత్ బచావో సంస్థ స్పందించింది. ఆపరేషన్ కగార్ నిలిపి వేసి.. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారత్ బచావో డిమాండ్ చేసింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయికి భారత్ బచావో శనివారం బహిరంగ లేఖ రాసింది.
ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి, మావోయిస్టుల మధ్య జరిగే శాంతి చర్చలకు భారత్ బచావో సంధానకర్తగా వ్యవహరిస్తుందని ఆ లేఖలో ఆ సంస్థ స్పష్టం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వంతో మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు కోసం ముగ్గురు పేర్లును ఆ సంస్థ ప్రతిపాదించింది. ప్రొఫెసర్ జగన్మోహన్ సింగ్, ప్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి పేర్లను పేర్కొంది. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ మేనల్లుడు ప్రొఫెసర్ జగన్మోహన్ సింగ్. 2004లో ఏపీ ప్రభుత్వానికి, మవోయిస్టులకు మధ్య సంధానకర్తగా వ్యవహరించిన ప్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మనోరంజన్ మోహంతి పేరును ప్రతిపాదించారు.
తమ ప్రతిపాదనకు స్పందించి ఈ ముగ్గురు పౌర హక్కుల ప్రతినిధులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలని ఆ లేఖలో పేర్కొంది. మావోయిస్టులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చర్చకు చొరవ తీసుకోవాలని భారత్ బచావో వైస్ చైర్మన్ డాక్టర్ ఎం.ఎఫ్ గోపినాథ్ ఈ సందర్భంగా విజ్జప్తి చేశారు. ఈ సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గాదె ఇన్నయ్య, నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా బంజార్ల రమేష్ బాబు ఉన్నారు.
2026, మార్చి మాసాాంతానికి దేశంలో మావోయిస్టులు ఉండకూడదనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకొంది. అందులోభాగంగా మావోయిస్టులు లోంగిపోయి.. దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలంటూ కేంద్రం ఇప్పటికే వారికి పిలుపు నిచ్చింది. మావోయిస్టులు లొంగిపోతే వారిని అన్ని విధాల ఆదుకొంటామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, బిహార్, మహారాష్ట్రతోపాటు జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో లొంగిపోయారు.
ఇక ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం వారి ప్రాబల్యం బాగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టాయి. దీంతో వరుసగా పలు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. దాంతో మవోయిస్టులకు భారీగా దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో చర్చకు సిద్ధమని మావోయిస్టులు ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ దీనిపై కేంద్రం వైపు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకుండా ఉంది.
ఇవి కూడా చదవండి..
India Vs Pakistan: సరిహద్దు వద్ద పాక్ మళ్లీ కాల్పులు..
Pahalgam Terror Attack: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం