Bat Meat Viral: టేస్టీ చికెన్ అంటూ మోసం.. గబ్బిలాల మాంసంతో వ్యాపారం..
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:07 PM
మీరు హోటల్లో స్పెషల్ చిల్లీ చికెన్ ఆర్డర్ చేసి కోడి మాంసమని సంతోషంగా తింటున్నారా. కానీ ఓసారి తినే ముందు అది చికెన్ అవునా కాదా అని పరిశీలించండి. ఎందుకంటే ఇటీవల చిల్లీ చికెన్‌లో కోడికి బదులు గబ్బిలాల మాంసం సర్వ్ చేస్తున్నారు.

మీరు హోటల్లో ఆర్డర్ చేసిన స్పెషల్ చిల్లీ చికెన్ నిజంగా కోడి మాంసమేనా? ఈ ప్రశ్న వినగానే ఆశ్చర్యంగా అనిపించొచ్చు. చికెన్ ఆర్డర్ చేస్తే చికెన్‌నే వస్తుంది కదా అనిపిస్తుంది. కానీ తాజాగా తమిళనాడులోని(bat meat tamilnadu) సేలం జిల్లా డేనిష్ పేటలో వెలుగులోకి వచ్చిన సంఘటన గురించి తెలిస్తే మాత్రం షాకవుతారు. అక్కడ ఓ హోటల్ చిల్లీ చికెన్‌లో కోడి మాంసం స్థానంలో గబ్బిలాల మాంసం ఉపయోగించారని వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటకు రావడంతో స్థానికంగా కలకలం రేగింది.
టెస్ట్ సూపర్ అంటూ..
ఈ గబ్బిలాల మాంసం వెనక ఓ ట్విస్ట్ కూడా ఉంది. సెల్వం, కమల్‌లు తమ బిజినెస్‌ను ఎక్స్‌క్లూజివ్ నాన్-వెజ్ అని బ్రాండ్ చేశారట. మా చికెన్ రుచి ఆకాశాన్ని తాకుతుందని స్ట్రీట్ వ్యాపారులకు చెప్పి, వాళ్లను కన్విన్స్ చేశారు. స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లలో చిన్న చిన్న హోటళ్లలో ఈ స్పెషల్ చికెన్ ఘాటుగా అమ్ముడైంది. కస్టమర్లు రుచి చూసి అబ్బా ఈ చికెన్ ఏదో డిఫరెంట్‌గా ఉందని అనుకున్నారు. కానీ అది గబ్బిలం మాంసమని గుర్తు పట్టలేకపోయారు.
అనుమానం వచ్చి..
కానీ ఓ స్థానికుడికి అనుమానం వచ్చి ఈ చికెన్‌లో ఏదో తేడా ఉందని ఫిర్యాదు చేశాడు. వెంటనే అటవీ శాఖ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు. సమాచారం ప్రకారం సేలం జిల్లా డేనిష్ పేట అడవుల్లో గబ్బిలాల వేటలో ఉన్న సెల్వం, కమల్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వాళ్ల దగ్గరి నుంచి తుపాకులు, గబ్బిలాల మాంసం స్టాక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో వీరిద్దరూ
కమల్, సెల్వం ఇద్దరూ గతంలో స్ట్రీట్ ఫుడ్ బండి వ్యాపారాలు చేసిన అనుభవం ఉన్నవారే. అయితే అసలు చికెన్ ధరలు పెరగడంతో గబ్బిలాల బాట పట్టారని పోలీసుల విచారణలో తెలిసింది. వీరికి ఫుడ్‌మెనియాతో పాటు ఫ్రాడ్‌మెనియా కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.
నెట్టింట వైరల్
ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గబ్బిలాల చిల్లీ చికెన్ గురించి జోకులు, మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. చికెన్ బిర్యానీ కావాలా లేక బ్యాట్ బిర్యానీనా అని కామెంట్లు చేసుకుంటున్నారు. వీరి కారణంగా స్థానిక హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు ఇప్పుడు కస్టమర్లను ఒప్పించడానికి మా దగ్గర నీట్ చికెన్ మాత్రమే అని బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి