Share News

Team India OverHaul: టీమిండియాలో భారీ మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతోందా..

ABN , Publish Date - Jul 28 , 2025 | 11:38 AM

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ తరువాత టీమిండియాలో భారీ మార్పులు చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

Team India OverHaul: టీమిండియాలో భారీ మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతోందా..
BCCI overhaul after England Tests

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ తరువాత టీమిండియాలో భారీ మార్పులకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం సేఫ్‌గానే ఉన్నప్పటికీ బౌలింగ్‌ విషయంపై బీసీసీఐ దృష్టి సారించే అవకాశం ఉంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ డస్కాటే‌ విషయంలో ఉత్కంఠ మొదలైంది. ఈ ఇద్దరినీ గంభీర్ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. వీరిరువురూ ఈ టోర్నీలో ఆశించిన మేర ఫలితాలు రాబట్టలేకపోయారు. అయితే, టీమ్ సంధి దశలో ఉన్న సమయంలో హెడ్ కోచ్ విషయంలో ఎలాంటి మార్పులు చేయొద్దన్న అభిప్రాయంతో బీసీసీఐ ఉన్నట్టు జాతీయ మీడియా కథనాల్లో తేలింది.

ఇటీవల డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ ఇవ్వకపోవడం, అన్షుల్ కాంబోజ్ రంగంలోకి దించడం విమర్శలకు తావిచ్చాయి. ఈ నిర్ణయాలపై పరిశీలకులు, ఫ్యాన్స్ కూడా పెదవి విరిచారు.


ఇక చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌, ఈస్ట్ జోన్ ప్రతినిధి శివ్ సుందర్ దాస్‌పై కూడా బీసీసీఐ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. కుల్దీప్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్‌కు ప్లేయర్లకు మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్టు సమాచారం. అయితే, భారత్‌కు అండగా నిలిచే ఒక్క పేసర్‌ను కూడా తీర్చిదిద్దలేకపోయినందుకు మోర్కెల్‌పై బీసీసీఐ అసంతృప్తితో ఉందట. ఇంగ్లండ్‌తో టెస్టు అనంతరం బీసీసీఐ సమీక్షకు దిగినా ఆసియా కప్ తరువాతే భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.


ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టును డ్రాగా ముగించిన టీమిండియా సిరీస్ పై ఆశలు సజీవంగానే ఉంచుకుంది. దీంతో, తదుపరి జరగనున్న ఐదో టెస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా లైనప్‌లో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గాయం బారిన పడ్డ రిషభ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్, జస్ప్రిత్ బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్ స్థానంలో ప్రసిద్ధ కృష్ణ, కుల్దీప్ యాదవ్‌కు ఈ మ్యాచ్‌లో స్థానం దక్కే అవకాశాలు మెండుగా ఉంది.

ఇవి కూడా చదవండి..

ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 11:46 AM