Bangladesh Plane Crash: స్కూలుపై కూలిన విమానం
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:29 AM
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం కూలి, 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 171 మంది గాయపడ్డారు...

పైలట్ సహా 20 మంది దుర్మరణం.. వారిలో అత్యధికులు విద్యార్థులు
171 మందికి గాయాలు
బంగ్లాదేశ్‌లో దుర్ఘటన
ఢాకా, జూలై 21: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం కూలి, 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 171 మంది గాయపడ్డారు. బంగ్లాదేశ్ సైన్యానికి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పీఆర్) కథనం ప్రకారం.. బంగ్లాదేశ్ వాయుసేనకు చెందిన ఎఫ్-7బీజీఐ శిక్షణ విమానం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఢాకా ఎయిర్ బేస్ నుంచి గాల్లోకి ఎగిరింది. కాసేపట్లోనే ఆ విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తి.. 1.08 గంటల సమయంలో సమీపంలోని మూడంతస్తుల మైల్స్ స్టోన్ స్కూల్‌పై పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో ఒక పైలట్ ఉన్నారు. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు.. మైల్స్ స్టోన్ బడిలోని ఇద్దరు ఉపాధ్యాయులు, 17 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరో 171 మందికి గాయాలయ్యాయి. సాంకేతిక కారణాలతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఐఎ్‌సపీఆర్ వివరించింది. ‘‘ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో పైలట్.. లెఫ్టినెంట్ మహమ్మద్ తౌఖీర్ ఇస్లాం ఉన్నారు. సాంకేతిక లోపంపై ఆయన ఏటీసీకి సమాచారం అందించారు. నిజానికి ఆ విమానం జనసమ్మర్థత అధికంగా ఉండే ప్రాంతంలో పడేది. కానీ, పైలట్ సమయస్ఫూర్తితో ఉత్తర ఢాకా వైపు మళ్లించారు’’ అని ఐఎ్‌సపీఆర్ వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News