Bengaluru News: 20 రోజుల్లో మూడుసార్లు ఆపరేషన్.. అయినా..
ABN , Publish Date - Nov 26 , 2025 | 01:12 PM
ఎనిమిది సంవత్సరాల బాలుడికి 20 రోజుల్లో మూడుసార్లు ఆపరేషన్ చేశారు. అయినా... ఫలితం లేకపోయింది. బాలుడు కన్నుమూయడంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- అయినా ఫలితం శూన్యం ఫ చికిత్స ఫలించక బాలుడి మృతి
- వైద్యుల నిర్లక్ష్యమే కారణమని విమ్స్ ముందు బంధువుల ఆందోళన
బళ్లారి(బెంగళూరు): విమ్స్ ఆస్పత్రిలో చికిత్స ఫలించక బాలుడు మృతిచెందడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బళ్లారి(Ballari) నగర సమీపంలోని ఆంద్రాలు గ్రామానికి చెందిన రవి , శాంతదంపతుల కుమారుడు అరుణ్(8) తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ 20 రోజుల క్రితం విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అపెండిసైటీస్ ఉందని అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని సూచించారు.
ఆపరేషన్ చేసిన రెండు రోజుల తర్వాత బాలుడిని డిశ్చార్జ్ చేశారు. తర్వాత బాలుడి ఆరోగ్యం క్షీణించడంతో 20రోజుల వ్యవధిలో మూడు సార్లు శస్త్రచికిత్స చేశారు. అయినా అనారోగ్యంతో సోమవారం బాలుడు ఇంట్లో మృతి చెందాడు. వైద్యులు సరిగా ఆపరేషన్ చేయకపోవడంతోనే బాలుడు మృతి చెందాడని బంధువులు సోమవారం ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు.
అపెండిక్స్ పగిలిపోయింది: వైద్యులు
అయితే అరుణ్‌ను మెదటిసారి ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడే అతని అపెండిక్స్ చీలిపోయి చీముతో నిండిపోయిందని అందుకే బాలుడు మృతిచెందాడని వైద్యులు పేర్కొంటున్నారు. తీవ్రమైన సెప్టిక్ షాక్ కారణంగా ఇలా జరిగిందని పీడియాట్రిక్ సర్జరీ విభాగ వైద్యులు అంటున్నారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని విమ్స్ డైరెక్టర్ గంగాధర్‌గౌడ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు
మావోయిస్టుల కస్టడీ పిటిషన్ వెనక్కి
Read Latest Telangana News and National News