AAP MLAs Suspended: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో రభస.. 12 మంది ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ABN , Publish Date - Feb 25 , 2025 | 11:59 AM
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాగానే అధికార పక్షాన్ని విమర్శిస్తూ ఆప్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఎల్జీ ప్రసంగానికి అడ్డుపడుతున్నారంటూ అధికార పక్షం ఆప్ ప్రతిపక్ష నేత ఆతిషీతో సహా 12 మంది ఎమ్మెల్యేలపై ఒక రోజు పాటు సస్పెన్షన్ వేటు వేసింది.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు (New Delhi) నేడు రణరంగాన్ని తలపించాయి. లికర్ కుంభకోణానికి సంబంధించి కాగ్ నివేదికపై అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆప్ నేతల మధ్య నిరసనలు మిన్నంటాయి. చివరకు ఆప్ ప్రతిపక్ష నేత ఆతిషీతో పాటు 12 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది.
శాసనసభలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే ఆప్ ఎమ్మెల్యేలు నిరసనకు తెరతీశారు. ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలతో తమ నిరసన తెలియజేశారు. అయితే, ఈ నిరసనల మధ్యే ఎల్టీ వీకే సక్సేనా ప్రసంగం ప్రారంభించారు. ప్రసంగం కొనసాగుతున్నా ఆప్ ఎమ్మెల్యేల నిరసన కొనసాగింది. ఆప్ సభ్యులు శాంతించాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు.
Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. పరిస్థితి ఎలా ఉందంటే..
అయితే, ఆప్ ఎమ్మెల్యేలు మాత్రం తమ నిరసనలు, నినాదాలను కొనసాగించారు. పలుమార్లు ఎల్జీ ప్రసంగానికి అడ్డుతగిలారు. ఈ నేపథ్యంలో ఆప్ ఎమ్మెల్యే చేతుల్లోని ప్లకార్డులు తీసుకోవాలని స్పీకర్ మార్షల్స్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేలను బయటకు కూడా పంపించారు. చివరకు 12 మంది ఎమ్మెల్యేలపై ఒక రోజు పాటు సస్పె్న్షన్ వేటు పడింది.
మరోవైపు, ప్రతిపక్ష ఆప్ నేత ఆతిషీ బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. బీఆర్ అంబేడ్కర్ ఫొటోను తొలగించి ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో చేర్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ ఫొటోలను యథాస్థానంలో పెట్టే వరకూ తమ నిరసన కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
Yogi Adityanath: కుంభమేళాను విమర్శించేవారు రాబందులు, పందులు యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్య
ఇదిలా ఉంటే.. ఆప్ హయాంలో ఖర్చులకు సంబంధించి మొత్తం 14 కాగ్ నివేదికలు అసెంబ్లీలో చర్చకు రాలేదని బీజేపీ కొన్నాళ్లుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో దాదాపు సగం నివేదికలో 500 రోజుల క్రితానివని బీజేపీ చెబుతోంది. ఈ నివేదికలు సభ ముందుకు వచ్చాక ఆప్ అసలు స్వరూపం బయటపడుతుందని చెబుతోంది. ఇక తొలి విడతగా ఆప్ లిక్కర్ విధానం, ఢిల్లీలో వాయుకాలుష్యానికి సంబంధించిన రెండు మూడు కాగ్ నివేదికలు అసెంబ్లీలో అధికార బీజేపీ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.