Assembly bypoll results: అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఎంసీ విజయకేతనం
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:56 PM
ఉప ఎన్నికల్లో టీఎంసీ 55 శాతం ఓటింగ్ షేర్ పొందగా, బీజేపీ 28 శాతం, కాంగ్రెస్ 15 శాతం ఓటింగ్ షేర్ పొందాయి. కలీగంజ్ సీటు తిరిగి గెలుచుకుంటామని టీఎంసీ మొదట్నించీ ధీమాతో ఉండగా, ఈ నియోజకవర్గంలో 48 శాతం మైనారిటీ ఓట్లు ఉండటంతో బీజేపీ ప్రధానంగా హిందూ ఓట్లుపైనే ఫోకస్ చేసింది.

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) మరోసారి సత్తా చాటుకుంది. ఎన్నికలు జరిగిన కలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అలిఫా అహ్మద్ 50,049 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఆమెకు 1,02,759 ఓట్లు పోలయ్యాయి. ఆమె సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత ఆశిష్ ఘోష్‌కు 52,710 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కబిలుద్దీన్ షేక్ 28,348 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
ఉప ఎన్నికల్లో టీఎంసీ 55 శాతం ఓటింగ్ షేర్ పొందగా, బీజేపీ 28 శాతం, కాంగ్రెస్ 15 శాతం ఓటింగ్ షేర్ పొందాయి. కలీగంజ్ సీటు తిరిగి గెలుచుకుంటామని టీఎంసీ మొదట్నించీ ధీమాతో ఉండగా, ఈ నియోజకవర్గంలో 48 శాతం మైనారిటీ ఓట్లు ఉండటంతో బీజేపీ ప్రధానంగా హిందూ ఓట్లపైనే ఫోకస్ చేసి ప్రచారం సాగించింది. ఇటీవల కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను ప్రధానంగా ప్రస్తావించింది. టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలపై విమర్శలు గుప్పించింది.
గెలుపుపై మమత స్పందన
కలీగంజ్‌లో టీఎంసీ అభ్యర్థి గెలుపొందడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు టీఎంసీ అభ్యర్థిని గెలిపించారని, వారందరికీ తాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. ఈ విజయాన్ని బెంగాల్‌కు, బెంగాల్ ప్రజలకు అంకితమిస్తు్న్నానని అన్నారు. కలీగంజ్ సిటింగ్ టీఎంసీ ఎమ్మెల్యే నసిరుద్దీన్ అహ్మద్ గత ఫిబ్రవరిలో కన్నుమూయడంతో ఆయను కుమార్తె అలిఫా అహ్మద్‌కు ఉప ఎన్నికల్లో టీఎంసీ టిక్కెట్ ఇచ్చింది. గత గురువారంనాడు ఎన్నికలు జరుగగా, 69.85 శాతం పోలింగ్ జరిగింది.
ఇవి కూడా చదవండి..
గుజరాత్‌లో బీజేపీ, ఆప్‌కు చెరో సీటు, కేరళలో కాంగ్రెస్ గెలుపు
6 రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ
For National News And Telugu News