Share News

Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:06 PM

దేశంలో ప్రజా రవాణాను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మొట్టమొదటి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Hyperloop project

దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ముంబై- అహ్మదాబాద్ నగరాల మధ్య సిద్ధమవుతోంది. దీనికోసం ట్రాక్ పనులు కూడా జరుగుతున్నాయి. మరోవైపు దేశంలో మొట్టమొదటి హైపర్‌లూప్ (Hyperloop) ట్రాక్ కూడా రెడీ అయింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) అధికారికంగా వెల్లడించారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో భారతీయ రైల్వే, ఈ హైపర్‌లూప్ ట్రాక్‌ను 422 మీటర్ల మేరకు సిద్ధం చేసినట్లు తెలిపారు. అంటే మీరు ఢిల్లీ నుంచి జైపూర్ వరకు దాదాపు 300 కి.మీ. దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చన్నారు. హైపర్‌లూప్ ట్రాక్‌లో గరిష్ట వేగం గంటకు 600-1200 కి.మీ. కావడం విశేషం.


హైపర్‌లూప్ ట్రాక్ అంటే ఏంటి..

భారతదేశంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే హైపర్ లూప్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. హైపర్‌లూప్ ప్రాజెక్టులో ఓ రైలును ప్రత్యేకంగా రూపొందించిన ట్యూబ్‌లో నడిపిస్తారు. అది కూడా అధిక వేగంతో నడుస్తుంది. ఇది ప్రజా రవాణాను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఇప్పుడు దేశంలో మొట్టమొదటి హైపర్‌లూప్ రైలు ట్రాక్ సిద్ధమైనందున, త్వరలో దానిపై ట్రయల్ రన్స్ ప్రారంభమవుతాయి. దేశంలో వాక్యూమ్ ట్యూబ్ ఆధారిత హైపర్‌లూప్ రైలు ప్రయాణం మొదలవుతున్న నేపథ్యంలో, ఇది దేశంలో ఐదో వేగవంతమైన రవాణా విధానం కానుంది.


బుల్లెట్ ట్రైన్ ప్రయాణం ఎప్పుడు..

హైపర్‌లూప్‌లో రైలు ప్రయాణ వేగం గంటకు 600-1200 కి.మీ. వరకు ఉంటుంది. నివేదికల ప్రకారం ఇండియన్ హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను గంటకు 600 కిలోమీటర్ల వేగంతో పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా 300 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. మరోవైపు దేశంలో ఇప్పటికే బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. గత సంవత్సరం ఏప్రిల్ 2024లో రైల్వే మంత్రి సమాచారం ఇస్తూ, భారత రైల్వేలు 2026 నాటికి దేశంలో మొదటి బుల్లెట్ రైలును నడుపుతాయన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మొదలయ్యే హై స్పీడ్ బుల్లెట్ రైలు వేగం గంటకు 320 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలా చూసినా కూడా హైపర్‌లూప్ ద్వారా ఈ ప్రయాణ దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Maha Kumbh Mela: శివరాత్రికి ముందే మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 25 , 2025 | 04:43 PM