Army Jawan Killed: పూంచ్‌లో ల్యాండ్‌మైన్ పేలి అగ్నివీర్ మృతి
ABN , Publish Date - Jul 25 , 2025 | 06:33 PM
పూంచ్ జిల్లాలో ఎల్ఓసీ వెంబడి మందుపాతర పేలి ఆర్మీ జవాను శుక్రవారం నాడు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

పూంచ్: జమ్మూకాశ్మీర్ (Jammu and Kashmir)లోని పూంచ్ జిల్లాలో ఎల్ఓసీ వెంబడి మందుపాతర పేలడంతో ఆర్మీ జవాను(Agniveer) శుక్రవారం నాడు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
'కృష్ణ ఘాటి బ్రిగేడ్ జనరల్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తుండగా మందుపాతర పేలి సెవెన్ జాట్ రెజిమెంట్‌కు చెందిన అగ్నివీర్ లలిత్ కుమార్ వీరమరణం పొందారు. ఆయన కుటుంబసభ్యులకు అండగా నిలుస్తాం' అని వైట్ నైట్ కార్ప్స్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ మిలటరీ చర్యలకు దిగుతూ ఎల్ఓసీ వెంబడి పెద్దఎత్తున క్రాస్-బోర్డర్ షెల్లింగ్ జరిపింది. గత నెలలో రాజౌరి జిల్లా ఎల్ఓసీ సమీపంలోని ఫార్వార్డ్ ఏరియాలో అనుమానాస్పద కదలికలు గుర్తించడంతో ఆర్మీ కాల్పులు జరిపింది. పూంచ్, సాంబ, కథువా జిల్లాలతో సహా డజనుకు పైగా ఏరియాల్లో గాలింపు చర్యలు చేపట్టింది.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో 32 గంటలు చర్చ: కేంద్ర మంత్రి
అప్పుడు తప్పు చేశా, ఇప్పుడు సరిదిద్దుకుంటున్నా: రాహుల్ గాంధీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి