Share News

Operatin Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో 32 గంటలు చర్చ: కేంద్ర మంత్రి

ABN , Publish Date - Jul 25 , 2025 | 05:29 PM

ఆపరేషన్ సిందూర్‌పై లోకసభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటల చొప్పున చర్చకు సమయం కేటాయించినట్టు కిరణ్ రిజిజు తెలిపారు.

Operatin Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో 32 గంటలు చర్చ: కేంద్ర మంత్రి
Kiran Rijiju

న్యూఢిల్లీ: 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)పై పార్లమెంటులో సోమ, మంగళవారాల్లో 32 గంటలపాటు ప్రత్యేక చర్చ జరుపనున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) శుక్రవారం తెలిపారు. సోమవారం లోక్‌సభలో చర్చ అనంతరం మంగళవారం రాజ్యసభలో చర్చ ఉంటుందని చెప్పారు. లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటల చొప్పున చర్చకు సమయం కేటాయించినట్టు వివరించారు.


'పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో సోమవారం ప్రత్యేక చర్చకు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. విపక్షాలు పలు అంశాలు లేవెనెత్తాలని కోరుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌పై చర్చను చేపట్టేందుకు మేము అంగీకరించాం' అని రిజిజు తెలిపారు.


చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్టు విపక్షాలకు చెప్పామని, అయితే మొదటి రోజు నుంచీ విపక్షాలు పార్లమెంటు లోపల, వెలుపల ఆందోళన చేపట్టాయని రిజిజు అన్నారు. మొదటి వారంలో కేవలం ఒకే బిల్లు ఆమోదించామని, సభను సజావుగా సాగేలా చూడాలని విపక్షాలను కోరినట్టు చెప్పారు. నిబంధనల ప్రకారం వారు ఏ అంశాన్నైనా లేవనెత్తొచ్చని, పార్లమెంటు పనిచేయకపోతే దేశానికి నష్టం జరుగుతుందని అన్నారు.


ఇవి కూడా చదవండి..

అప్పుడు తప్పు చేశా, ఇప్పుడు సరిదిద్దుకుంటున్నా: రాహుల్ గాంధీ

భారత్ 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి: సీడీఎస్ అనిల్ చౌహాన్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 06:23 PM