Share News

Army Jawan Assaulted: జవాన్‌పై దాడి.. టోల్ బూత్ వద్ద సంచలన ఘటన

ABN , Publish Date - Aug 18 , 2025 | 10:33 AM

ఓ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఉద్రిక్త ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలు పణంగా పెట్టే ఆర్మీ జవాన్‌ ప్రశ్నించినందుకే కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటం చర్చనీయాంశమైంది. అసలు ఏమైందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Army Jawan Assaulted: జవాన్‌పై దాడి.. టోల్ బూత్ వద్ద సంచలన ఘటన
Army Jawan Assaulted

ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో ఓ టోల్ కేంద్రం వద్ద జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రశ్నించినందుకు ఆర్మీ జవాన్‌పై తీవ్రంగా దాడి చేశారు (Army Jawan Assaulted). కపిల్ కవాడ్, రజపుత్ రెజిమెంట్‌లో పనిచేసే జవాన్. సెలవుల కోసం ఇంటికి వచ్చిన అతను, తిరిగి శ్రీనగర్‌లోని తన పోస్ట్‌కి వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరాడు. కానీ, దారిలో భుని టోల్ బూత్ వద్ద ఊహించని ఘటన చోటుచేసుకుంది.


భారీగా ట్రాఫిక్..

కపిల్ తన కజిన్‌తో కలిసి కారులో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నాడు. భుని టోల్ బూత్ వద్ద భారీగా ట్రాఫిక్ ఉంది. ఫ్లైట్ మిస్ అవుతుందేమోనని ఆందోళన చెందిన కపిల్, తన కారు నుంచి దిగి టోల్ బూత్ సిబ్బందితో మాట్లాడాడు. అతని గ్రామం టోల్ ఫీ నుంచి మినహాయింపు పొందిన ప్రాంతంలో ఉందని చెప్పాడు. దీంతో ఈ విషయం వివాదాస్పదమైంది. చిన్న వాగ్వాదం కాస్తా పెద్ద గొడవగా మారింది. ఆ క్రమంలో ఐదుగురు టోల్ బూత్ సిబ్బంది కపిల్‌ని, అతని కజిన్‌ని దారుణంగా కొట్టారు.


పోలీసులు ఏం చేశారు?

ఈ విషయంలో కపిల్ కుటుంబం ఫిర్యాదు చేయడంతో సరూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని మీరట్ రూరల్ SP రాకేష్ కుమార్ మిశ్రా తెలిపారు. CCTV ఫుటేజ్, వీడియోలను స్కాన్ చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు రెండు టీమ్‌లు పనిచేస్తున్నాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు త్వరగా యాక్షన్ తీసుకున్నారు.


నెట్టింట వైరల్

అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో కపిల్‌ని కర్రతో కొడుతూ, అతని చేతులను వెనక్కి లాగి, ఒక పోల్‌కి కట్టేసి దాడి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక వ్యక్తి అసభ్యంగా తిట్టడం, కపిల్‌ని కొట్టడం చూస్తే ఇంత దారణమేంటని ఇది చూసిన పలువురు ప్రశ్నిస్తున్నారు. అయినా కూడా ప్రశ్నిస్తేనే ఇలా దాడి చేయడమేంటని అంటున్నారు. ఇది చూసిన నెటిజన్లు సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టే సైనికుడికి ఇలాంటి అవమానం జరగడం దురదృష్టకరమని కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 18 , 2025 | 10:43 AM