Amit Shah: ప్రజాసమస్యలపై పోరాడండి.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించండి
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:24 PM
ప్రజలకోసం పోరాటం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పార్టీ నాయకులకు సూచించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూరుకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను పలువురు సీనియర్ నేతలు భేటీ అయ్యారు.

- పార్టీ నాయకులకు కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు
బెంగళూరు: ప్రజలకోసం పోరాటం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పార్టీ నాయకులకు సూచించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూరుకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah)ను పలువురు సీనియర్ నేతలు భేటీ అయ్యారు. మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై(Former CM Basavaraj Bommai), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్షనేత అశోక్ తదితరులు కలిశారు. ఇదే విషయమై విజయేంద్ర మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరిగాయని, పోరాటాలను రెట్టింపు చేయాలని అమిత్ షా సూచించారన్నారు.
మైనారిటీలకు హౌసింగ్‌లో 10 నుంచి 15శాతానికి ఇళ్ల నిర్మాణానికి వాటా పెంచిన విషయం ప్రస్తావించారన్నారు. సబ్ కా సాథ్ సబ్ వికాస్‌లా ఉండాలని, దేశంలో హిందువులు, మైనారిటీలకు సమానంగా కాకుండా ప్రత్యేకంగా కేటాయింపులపై పోరాటం ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కిసాన్ సమ్మాన్ ద్వారా కులమతాలతో సంబంధం లేకుండా ఇస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారన్నారు.
సీఎం సిద్దరామయ్య ప్రజానేతగా కాకుండా తుగ్లక్ దర్బార్ నడుపుతున్నారని విజయేంద్ర మండిపడ్డారు. జేడీఎ్‌సతో సమన్వయంగా ముందుకు పోతామన్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఆర్సీబీ విజయోత్సవాలవేళ తొక్కిసలాటలో 11మంది మృతి చెందితే, ప్రస్తుతం కొత్త నిబంధనలతో చట్టం అంటూ ప్రజలను దారి తప్పిస్తున్నారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News