Share News

Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు కలకలం.. న్యూయార్క్ వెళ్తుండగా..

ABN , Publish Date - Mar 10 , 2025 | 02:19 PM

Air India Flight : ముంబై నుండి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు రావడంతో కలకలం చెలరేగింది. బోయింగ్ 777-300 ER విమానంలో 19 మంది సిబ్బంది సహా 322 మంది ప్రయాణీకులు ఉన్నారు. విమానం గాల్లో ఉండగానే..

Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు కలకలం.. న్యూయార్క్ వెళ్తుండగా..
Air India Flight Bomb Threat

Air India Flight Bomb Threat : ముంబై నుండి 320 మంది ప్రయాణీకులతో న్యూయార్క్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో సోమవారం ఉదయం బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. గాల్లో ఉండగానే బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అప్పటికప్పుడే తిరిగి వెనక్కి పయనమయ్యారు.బాంబు అమర్చినట్లు సమాచారం అందగానే విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. విమాన సిబ్బంది, ప్రయాణీకులు క్షేమంగా ముంబైలో ల్యాండ్ అయినట్లు సమాచారం. బాంబు బెదిరింపులపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.


విమానం టాయిలెట్‌లో బాంబు బెదిరింపు నోట్..

"ఈరోజు మార్చి 10 2025న ముంబై నుంచి న్యూయార్క్ (JFK) వెళుతున్న AI119 విమానంలో దారి మధ్యలో భద్రతా ముప్పు ఉన్నట్లు గుర్తించాం.ప్రోటోకాల్‌ పూర్తయ్యాక విమానంలో ఉన్న వారందరి భద్రత దృష్ట్యా విమానం ముంబైకి తిరిగి వచ్చింది" అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ మీడియా ప్రకారం, విమానంలోని టాయిలెట్‌లో కనుగొన్న నోట్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చిందని తెలుస్తోంది.బోయింగ్ 777-300 ER విమానంలో 19 మంది సిబ్బందితో సహా 322 మంది ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి.భద్రతా సంస్థలు చేపట్టిన తనిఖీలు, దర్యాపుకు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.


స్థానిక సమయం ప్రకారం ఉదయం 10:25 గంటలకు విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. మార్చి 11న ఉదయం 5 గంటలకు ఈ విమానాన్ని తిరిగి నడపేలా షెడ్యూల్ చేశారు. అప్పటి వరకు ప్రయాణీకులందరికీ హోటల్ వసతి,భోజనం, ఇతర సహాయం మేమే అందిస్తామని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ అంతరాయం వల్ల ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యాన్ని తగ్గించడానికి మా సహోద్యోగులు కృషి చేస్తున్నారు.ఎప్పటిలాగే,ఎయిర్ ఇండియా ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది"అని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి పేర్కొన్నారు.


Read Also : భారత్‌తో పోలిస్తే దుబాయ్‌ బంగారం ధర ఎందుకు తక్కువంటే..

Railway Ticket Transfer: మీ రైల్వే టికెట్‌ మీ ఫ్యామిలీకి ఇలా ట్రాన్స్‎ఫర్ ..స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

Parliament Budget Session: నేటి నుంచే పార్లమెంటు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం..

Updated Date - Mar 10 , 2025 | 02:23 PM