Share News

EPS: నో డౌట్.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వచ్చేది మా ప్రభుత్వమే..

ABN , Publish Date - Oct 17 , 2025 | 11:37 AM

వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కలిగించినా అన్నాడీఎంకే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ధీమా వ్యక్తం చేశారు.

EPS: నో డౌట్.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వచ్చేది మా ప్రభుత్వమే..

- మాజీసీఎ ఈపీఎస్‌ ధీమా

చెన్నై: వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కలిగించినా అన్నాడీఎంకే(AIADMK) విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆయన ఓ ప్రకటన చేస్తూ పార్టీ శ్రేణులంతా అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించాలని, బూత్‌ కమిటీ ఇన్‌ఛార్జులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.


1972 అక్టోబరు 17న ఎంజీఆర్‌ అన్నాడీఎంకే పార్టీని స్థాపించారని, అప్పట్లో రాష్ట్రంలోని డీఎంకే(DMK) అవినీతి పాలన అంతమొందించి స్వల్పకాలంలోనే అధికారంలోకి వచ్చారని తెలిపారు. జయలలిత హాయంలోనూ పార్టీ బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు. జయలలిత హయాంలో ప్రారంభించిన పథకాలకు డీఎంకే ప్రభుత్వం స్వస్తి పలికిందని ఆయన ఆరోపించారు.


nani3.2.jpg

ప్రస్తుతం అవినీతిలో కూరుకుపోయిన డీఎంకే కుటుంబపాలనను అంతమొందించేందుకు పార్టీ శ్రేణులంతా ఐకమత్యంగా పోరాడాలని ఈపీఎస్‌ పిలుపునిచ్చారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తుందని, ప్రజలకు సుపరిపాలను అందించడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంభావన పథకానికి టీటీడీ నిధులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత

Read Latest Telangana News and National News

Updated Date - Oct 17 , 2025 | 11:37 AM