Share News

EPS: అన్నాడీఎంకే కులమతాలకు అతీతం..

ABN , Publish Date - Aug 02 , 2025 | 10:25 AM

అన్నాడీకేకు కులమతాల పట్టింపులేదని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించాలన్నదే తమ పార్టీ లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో చేపట్టిన తన ప్రచార యాత్రలో భాగంగా ఈపీఎస్‌ శుక్రవారం తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి నియోజకవర్గంలో పర్యటించారు.

EPS: అన్నాడీఎంకే కులమతాలకు అతీతం..

- మాజీసీఎం ఈపీఎస్‌

చెన్నై: అన్నాడీకేకు కులమతాల పట్టింపులేదని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం అందించాలన్నదే తమ పార్టీ లక్ష్యమని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో చేపట్టిన తన ప్రచార యాత్రలో భాగంగా ఈపీఎస్‌ శుక్రవారం తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా సెన్బగవళ్ళి అమ్మవారిని దర్శించుకున్నారు.


అనంతరం కోవిల్‌పట్టి ప్రాంతంలోని ఓ కల్యాణమండపంలో ఆయన క్రైస్తవ, ముస్లిం మత గురువులు, అగ్గిపెట్టె పరిశ్రమల యజమానులు, వేరుశనగ మిఠాయి ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సంఘాల తరుఫున మాట్లాడిన ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. అనంతరం ఈపీఎస్‌ మాట్లాడుతూ, చిన్నా, మధ్య తరహా పరిశ్రమల సంఖ్య పెరిగితేనే నాణ్యమైన ఉత్పత్తితో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ఇందుకోసం మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం, తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చర్యలు చేపట్టినట్లు తెలిపారు.


city1.3.jpg

కులమతాలకు అతీతంగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే గతంలో అధికారంలో ఉన్న సమయంలో రంజాన్‌ మాసంలో ఇఫ్తార్‌ గంజికి అవసరమైన బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు, హజ్‌ యాత్రకు నిధులు అందజేశామని, మైనారిటీల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మొక్కజొన్న, పత్తి, అగ్గిపెట్టెలు, వేరుశనగ మిఠాయి పరిశ్రమల అభివృద్ధికి అన్నాడీఎంకే అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మాజీమంత్రులు కడంబూరు రాజు, ఉదయ్‌కుమార్‌, డాక్టర్‌ విజయ్‌భాస్కర్‌, దళవాయి సుందరం తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే

సైబర్‌ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!

Read Latest Telangana News and National News

Updated Date - Aug 02 , 2025 | 10:25 AM