President: రాష్ట్రపతిని వేర్వేరుగా కలిసిన మోదీ, అమిత్‌షా
ABN , Publish Date - Aug 03 , 2025 | 09:43 PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి ఆదివారం సమావేశమైనట్టు రాష్ట్రపతి భవన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది. ఆ తర్వాత కొద్ది గంటలకు మళ్లీ రాష్ట్రపతి భవన్ మరో ట్వీట్‌లో హోం మంత్రి అమిత్‌షా రాష్ట్రపతిని కలుసుకున్నట్టు వెల్లడించింది.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఒకరి తర్వాత మరొకరు రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం నాడు సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. అయితే, అగ్రనేతలిద్దరూ రాష్ట్రపతితో సమావేశం కావడానికి కారణమేమిటనేది తెలియలేదు. పీఎంవో కానీ, హోం శాఖ కార్యాలయం నుంచి గానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి ఆదివారం సమావేశమైనట్టు రాష్ట్రపతి భవన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది. ఆ తర్వాత కొద్ది గంటలకే మళ్లీ రాష్ట్రపతి భవన్ మరో ట్వీట్‌లో హోం మంత్రి అమిత్‌షా రాష్ట్రపతిని కలుసుకున్నట్టు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల యూకే, మాల్దీవుల్లో పర్యటనకు వెళ్లి వచ్చిన అనంతరం రాష్ట్రపతితో సమావేశం కావడం ఇదే మొదటిసారి.
బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై చర్చకు విపక్షాలు పట్టుబడుతుడటం, దీంతో పార్లమెంటు సమావేశాల్లో ప్రతిష్ఠంభన తలెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రపతిని ప్రధాని, హోంమంత్రి కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్‌పై ఉభయసభల్లోనూ చర్చ జరగ్గా, ఆగస్టు 12వ తేదీతో వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి.
ఇవి కూడా చదవండి..
చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్
తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి