Siddaramaiah: సిద్ధరామయ్యకూ 'శీష్ మహల్' సెగలు
ABN , Publish Date - Feb 28 , 2025 | 03:34 PM
కర్ణాటక ముఖ్యమంత్రి తన అధికార నివాసాన్ని 'శీష్ మహల్' తరహాలో పునరుద్ధరించుకునేందుకు భారీగా ఖర్చు చేస్కు్న్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓవైపు ప్రజాపనుల కోసం నిధులు లేవంటూ సొంత పనులకు భారీ ఖర్చులు ఎందుకంటూ నిలదీస్తు్న్నాయి.

బెంగళూరు: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 'సీఎం బంగ్లా' వివాదం ముదరడం, దానిని 'శేష్ మహల్' (అద్దాల మేడ)గా అభివర్ణిస్తూ బీజేపీ విరుచుకుపడటం 'ఆప్' విజయావకాశాలను గండికొట్టింది. తాజాగా ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తన అధికార నివాసాన్ని 'శీష్ మహల్' తరహాలో పునరుద్ధరించుకునేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓవైపు ప్రజాపనుల కోసం నిధులు లేవంటూ సొంత పనులకు భారీ ఖర్చులు ఎందుకంటూ నిలదీస్తు్న్నాయి.
Avalanche: ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. చిక్కుకున్న 57 మంది కార్మికులు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార నివాసం 'కావేరీ' పునరుద్ధరణకు రూ.2.6 కోట్లను రాష్ట్ర ప్రజాపనుల శాఖ అంచనా వేసింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి జీవో వెలువడింది. బంగ్లా అప్‌గ్రేడేషన్‌లో భాగంగా రూ.1.7 కోట్లతో హెల్పర్ రూమ్‌లు, ఇతర నిర్మాణాలు చెపట్టనుండగా, రూ.89 లక్షలతో ఎలక్ట్రిక్ అప్‌గ్రెడ్, మొదలైన సదపాయాలు కల్పించనున్నారు.
తాజా పరిణామంపై బీజేపీ ఎమ్మెల్యే ఉదయ్ గరుడాచార్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నిధులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి తన సొంత పనులపై దృష్టిసారించడం ఏమిటని ఆయన నిలదీశారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన పనులను ముందు చేపట్టి ఆ తర్వాత సొంత బంగ్లా పనుల చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. కర్ణాటక ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సీఎం బంగ్లాను పునరుద్ధరిస్తారంటూ వార్తలు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వ గ్యారెంటీ పథకాలకే నిధుల కొరత ఉందని, ఇక రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమని బీజేపీ, ఇతర ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
Mamata Banerjee: నకిలీ ఓటర్లతో ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు
Ministerial orders: పార్సిళ్లకు ప్లాస్టిక్ వద్దు.. ఇడ్లీ తయారీలోనూ గుడ్డలు మాత్రమే వాడాలి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.