Share News

TVK: కామన్‌ సింబల్‌పై విజయ్‌ దృష్టి

ABN , Publish Date - May 23 , 2025 | 10:58 AM

మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. సినీ నటుడు విజయ్‌ ఏర్పాటుచేసిన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులంతా ఒకే గుర్తు (కామన్‌ ఎలక్షన్‌ సింబల్‌) దక్కించుకునేలా ఆ పార్టీ అధినేత విజయ్‌ దృష్టిసారించారు.

TVK: కామన్‌ సింబల్‌పై విజయ్‌ దృష్టి

చెన్నై: వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) తరపున పోటీ చేసే అభ్యర్థులంతా ఒకే గుర్తు (కామన్‌ ఎలక్షన్‌ సింబల్‌) దక్కించుకునేలా ఆ పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్‌(Vijay) దృష్టిసారించారు. ఇందుకోసం ఆయన అన్ని రకాలైన చర్యలు చేపడుతున్నారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తలపడేందుకు డీఎంకే, అన్నాడీఎంకే సారథ్యంలోని ప్రధాన కూటములు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది పార్టీని స్థాపించిన విజయ్‌.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు.


ఇందులోభాగంగా రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ తమ పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలను వివరిస్తున్నారు. అదేసమయంలో ఆ పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. మరోవైపు, కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు గుర్తులు ఎంచుకునేందుకు 190 గుర్తులను ప్రకటించింది. దీంతో తమ పార్టీకి ఎలాంటి గుర్తు ఎంచుకోవాలన్న అంశంపై ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కీలక నేతలతో చర్చిస్తున్నారు. ప్రజల్లోకి సులభంగా చొచ్చుకుని వెళ్ళే సింబల్‌ ఎన్నుకోవాలని భావిస్తున్నారు.


nani2.2.jpg

మైక్‌ సింబల్‌ను ఎన్నుకుంటే, తద్వారా విజయ్‌ గళాన్ని ప్రజలకు మరింత చేరువవుతుందని చెబుతున్నారు. దీనిపై టీవీకే ప్రతినిధులు స్పందిస్తూ ఓటర్లు సులభంగా గుర్తించేలా ఎన్నికల గుర్తు ఎంపిక చేస్తున్నామని, ఆ దిశగానే తమ పార్టీ అధినేత విజయ్‌ దృష్టిసారించారని వివరించారు. విజయ్‌ సైతం కొంతమంది తనకు సన్నిహితంగా వున్న సీనియర్‌ నేతలతో, మాజీ బ్యూరోక్రాట్లతోనూ ఈ వ్యవహారంపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కామన్‌ సింబల్‌ రానిపక్షంలో అది తమ పార్టీకి నష్టం జరుగుతుందని విజయ్‌ గట్టిగా భావిస్తున్నారు.



ఈ వార్తలు కూడా చదవండి.

బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

సీఎం ఓఎస్‌డీని అంటూ మెయిల్స్‌, కాల్స్‌

Read Latest Telangana News and National News

Updated Date - May 23 , 2025 | 10:58 AM