Punjab: విజిలెన్స్ చర్యను నిలదీసిన ఎమ్మెల్యేపై ఐదేళ్ల సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:00 PM
అకాలీదళ్ సీనియర్ నేత బిక్రమ్ మజిథియాపై విజిలెన్స్ కేసు వ్యవహారంలో ఆప్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విజయ్ ప్రతాప్ బహిరంగ విమర్శలు చేసిన క్రమంలో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దాడుల సమయంలో మజిథియా భార్య విలిజెన్స్ టీమ్‌తో గొడవ పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో విజయ్ ప్రతాప్ పోస్ట్ చేశారు.

అమృత్‌సర్: మాజీ ఐపీఎస్ అధికారి, అమృత్‌సర్ నార్త్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్‌పై ఆప్ ఆద్మీ పార్టీ (AAP) కీలక క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఐదేళ్ల పాటు సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే కారణంగా పార్టీ పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
విజిలెన్స్ చర్యలను ప్రశ్నించినందుకే
అకాలీదళ్ సీనియర్ నేత బిక్రమ్ మజిథియాపై విజిలెన్స్ కేసు వ్యవహారంలో ఆప్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విజయ్ ప్రతాప్ బహిరంగ విమర్శలు చేసిన క్రమంలో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దాడుల సమయంలో మజిథియా భార్య విలిజెన్స్ టీమ్‌తో గొడవ పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో విజయ్ ప్రతాప్ పోస్ట్ చేశారు. విజిలెన్స్ ఆపరేషన్ తీరుపై విమర్శలు గుప్పించారు. 'మజిథియా జైలులో ఉన్నారు. ఆయనపై ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టలేదు. ఆయనను ప్రశ్నించడం కూడా జరగలేదు. ఆయన బెయిల్ పొందేందుకు అనుమతించాలి' అని అన్నారు. మజిథియా నివాసంపై తెల్లవారుజామున దాడులు జరగడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. రాజకీయ వేత్త అయినా, నటుడయినా, డబ్బున్న వాడు, పేదవాడు, మిత్రుడు, శత్రువు ఇలా ఎవరైనా కావచ్చు... ప్రతి కుటుంబానికి ఒక గౌరవం అంటూ ఉంటుంది. ఉదయమే ఇంంటిలోకి చొరబడం తప్పు, అనైతికం..అని ఆయన తన ట్వీట్‌లో ఖండించారు.
కాగా, ఆప్ మాత్రం ఈ చర్యను సమర్ధించింది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన విషయంలో కఠిన చర్యలకు పార్టీ కట్టుబడి ఉందని, ఇది సైద్ధాంతికమైన కట్టుబాటు అని తెలిపింది. ఈ పోరాటానికి పార్టీలో ఎవరూ ఆటంకాలు కలిగించేందుకు వీళ్లేదని తెలిపారు.
మరోవైపు, ఎవరు అధికారంలోకి వచ్చినా రాజకీయ కారణాలతో పోలీసులను, విజిలెన్స్ శాఖలను దుర్వినియోగం చేస్తున్నారని విజయ్ ప్రతాప్ ఆరోపించారు. సొంత ప్రయోజనాలకే ఆయా విభాగాలను వాడుకుంటున్నారనేది నిజమని, ఇందువల్ల ఎవరూ ప్రయోజనం పొందలేరని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై ఆప్ చర్యలకు దిగింది. తద్వారా పార్టీలో అసమ్మతిని ప్రోత్సహించేది లేదని, ముఖ్యంగా పంజాబ్‌లో డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అంశ చాలా కీలకమని, పార్టీ విధానమే శిరోధార్యమని సంకేతాలు పంపింది.
ఇవి కూడా చదవండి..
పూరీ రథయాత్ర దుర్ఘటన.. ప్రభుత్వంపై మాజీ సీఎం విమర్శలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి