Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Oct 29 , 2025 | 08:57 PM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాతి, పునరావాస ప్రయత్నాల్లో భాగంగా ఈ లొంగుబాట్లు చోటుచేసుకున్నట్టు బిజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
బిజాపూర్: మావోయిస్టులకు మరో గట్టి తగిలింది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని బిజాపూర్ జిల్లాలో 51 మందికి పైగా మావోయిస్టులు బుధవారంనాడు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో 9 మంది మహిళా మావోయిస్టులు ఉండగా, 20 మందిపై రూ.66 లక్షల రివార్డు కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాంతి, పునరావాస చర్యల్లో భాగంగా ఈ లొంగుబాట్లు చోటుచేసుకున్నట్టు బిజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టులు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) బెటాలియన్ 1,2,5 సభ్యులని తెలిపారు. బిజాపూర్‌లోని అటవీ ప్రాంతాలు, సరిహద్దు జిల్లాలో హింసాత్మక ఘటనల్లో పలువురికి ప్రమేయం ఉందన్నారు. ప్రశాంత జీవితం, ప్రభుత్వ పునరావాస విధానాలు నచ్చి లొంగిపోతున్నట్టు వారంతా తెలిపారని చెప్పారు.
తాజా లొంగుబాట్లతో ఈ ప్రాంతంలో మావోయిస్టు నెట్‌వర్క్ బాగా బలహీనమైందని ఎస్పీ తెలిపారు. తక్కిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. 2024 జనవరి నుంచి బిజాపూర్‌లో 650 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 196 మంది ఎన్‌కౌంటర్‌లో మరణించగా, 986 మందిని అరెస్టు చేశామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రపతితో రఫేల్ రాణి శివాంగి సింగ్.. పాక్ కట్టుకథలకు మరోసారి చెక్
సొంత కారు లేకుంటే పిల్లను ఇవ్వరన్న డీకే.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి