Deputy CM Shivakumar: తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం.. నీ సలహాతో ప్రాజెక్టు ఆపలేం...
ABN , Publish Date - Oct 29 , 2025 | 01:26 PM
కొంతకాలంగా సొరంగ మార్గంతోపాటు పలు అంశాలపై విమర్శలు చేసుకున్న డీసీఎం డీకే శివకుమార్, ఎంపీ తేజస్విసూర్య భేటీ అయ్యారు. డీసీఎం నివాసానికి వచ్చిన ఎంపీ పలు అంశాలపై చర్చలు జరిపారు.
- టన్నెల్ రోడ్డు పనులపై ఎంపీ తేజస్వికి తేల్చి చెప్పిన డీసీఎం డీకే
బెంగళూరు: కొంతకాలంగా సొరంగ మార్గంతోపాటు పలు అంశాలపై విమర్శలు చేసుకున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Deputy CM Shivakumar), ఎంపీ తేజస్విసూర్య భేటీ అయ్యారు. మంగళవారం డిప్యూటీ సీఎం నివాసానికి వచ్చిన ఎంపీ పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు అభివృద్ధికి సంబంధించి పలు ప్రతిపాదనలను తేజస్వి సూచించారని, వాటిని పరిశీలిస్తామని చెప్పారు.
ప్రధానంగా లాల్‌బాగ్‌లో టన్నెల్ రోడ్డు నిర్మించొద్దని తేజస్వి సూచించారని తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే బహిరంగం చేశానని, ఎట్టి పరిస్థితిల్లోనూ లాల్‌బాగ్ మీదుగా సొరంగ మార్గం ఉండదని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం ఏం చేయాలని కోరినందుకు సొరంగమార్గమే వద్దని తేజస్విసూర్య తెలిపారన్నారు.

అందుకు నీ సలహాతో ప్రాజెక్టును ఆపివేయలేమని తేల్చి చెప్పానని డిప్యూటీ సీఎం అన్నారు. అవుటర్ రింగ్‌రోడ్డులు పెంచాలని, సబర్బన్ రైళ్లు రావాలని తెలిపారని గుర్తు చేశారు. అందుకు కేంద్రంలో రైల్వేశాఖ సహాయమంత్రి సోమణ్ణతో చర్చిద్దామని తీర్మానించామన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సూచించానన్నారు. ఎంపీలతో ప్రధానమంత్రిని కలుద్దామన్నారని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News