Seven people passedaway: ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి
ABN , Publish Date - Jul 24 , 2025 | 04:54 PM
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

సిమ్లా, జులై 24: హిమాచల్‌ప్రదేశ్ మాండీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ(గురువారం) ప్రమాదవశాత్తూ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు.. మాండీ నుంచి సర్కాఘాట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారని.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారన్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా పోలీస్ ఉన్నతాధికారి వివరించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు అన్వేషిస్తున్నామన్నారు. ఇక ఏడాది కాలంగా హిమాచల్‌ప్రదేశ్‌లో పలు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కొండ ప్రాంతాలు, ఇరుకైన రహదార్లు, వంకరటింకర రోడ్లు కావడం వల్లే తరచూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా మండి, కులు, చంబా వంటి పర్వత ప్రాంత జిల్లాల్లో ఈ ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‌లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News