Share News

Plane Crash: సూడాన్‌లో కూలిన సైనిక విమానం

ABN , Publish Date - Feb 27 , 2025 | 06:06 AM

మంగళవారం ఖార్తూమ్‌ ప్రావిన్స్‌ ఆమ్‌దూర్‌మన్‌లోని వాడీ సాయిద్నా ఎయిర్‌ బేస్‌ నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికి జనావాసాల మీద కుప్పకూలింది.

Plane Crash: సూడాన్‌లో కూలిన సైనిక విమానం

  • సైనిక ఉన్నతాధికారులు సహా 46 మంది మృతి

కైరో, ఫిబ్రవరి 26: సూడాన్‌లో ఓ సైనిక విమానం కుప్పకూలి 46 మంది మృతి చెందారు. మంగళవారం ఖార్తూమ్‌ ప్రావిన్స్‌ ఆమ్‌దూర్‌మన్‌లోని వాడీ సాయిద్నా ఎయిర్‌ బేస్‌ నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికి జనావాసాల మీద కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 19 మంది సైనికులు సహా మొత్తంగా 46 మంది మృతి చెందారు. వీరిలో ఓ సీనియర్‌ కమాండర్‌తో పాటు సైనిక ఉన్నతాధికారులు, సైనికులు, పిల్లలు, పలువురు పౌరులు ఉన్నారు. మరో 10 మందికిపైగా పౌరులు గాయపడినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సూడాన్‌పై పట్టు కోసం సైన్యం, పారా మిలటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఇటీవల తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రమాదానికి ఆర్పీఎ్‌ఫకు సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

Updated Date - Feb 27 , 2025 | 06:07 AM