Share News

Tahawwur Rana: తహవ్వుర్ రాణాకు మరో 12 రోజుల ఎన్ఐఏ కస్టడీ

ABN , Publish Date - Apr 28 , 2025 | 06:09 PM

ఎన్ఐఏ తరఫున సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ కోర్టుకు హాజరుకాగా, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి న్యాయవాది పీయూష్ సచ్‌దేవ కోర్టుకు హాజరై తమ వాదనలు వినిపించారు.

Tahawwur Rana: తహవ్వుర్ రాణాకు మరో 12 రోజుల ఎన్ఐఏ కస్టడీ

న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడి (26/11 Mumbai Attack) నిందితుడు తహవ్వుర్ రాణా (Tahawwur Rana) ఎన్ఐఏ (NIA) కస్టడీని పాటియాలా హౌస్ కోర్టు మరో 12 రోజులు పొడిగించింది. దీనికి ముందు 18 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఆ గడువు సోమవారంనాడు ముగియడంతో అతనిని భారీ భద్రత మధ్య ముఖానికి మాస్క్ వేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా రాణాను మరో 12 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఎన్ఐఏ కోరింది.

Asaduddin Owaisi: మీ తల్లిని చంపిందెవరో గుర్తులేదా? బిలావల్‌పై ఒవైసీ నిప్పులు


ఎన్ఐఏ తరఫున సీనియర్ అడ్వకేట్ దయన్ కృష్ణన్, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్ కోర్టుకు హాజరుకాగా, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి న్యాయవాది పీయూష్ సచ్‌దేవ కోర్టుకు హాజరై తమ వాదనలు వినిపించారు.


లాయర్‌ను కలుసుకునేందుకు అనుమతి

కోర్టు గత రిమాండ్ ఆర్డర్‌లో రాణాకు ప్రతి 24 గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, రోజువిడిచి రోజు తన లాయర్‌ను కలుసుకునేందుకు అనుమతించాలని ఎన్ఐఏను ఆదేశించింది. 'సాఫ్ట్-టిప్-పెన్' ఉపయోగించుకునేందుకు రాణాకు అనుమతి ఇచ్చింది. ఎన్ఐఏ అధికారుల సమక్షంలోనే రాణా తన లాయర్‌తో మాట్లాడాల్సి ఉంటుందని తెలిపింది.


దీనికి ముందు, తన కుటుంబ సభ్యులతో ఫోనులో మాట్లాడేందుకు అనుమతించాలని రాణా చేసిన విజ్ఞప్తిని పాటియాల్ హౌస్ కోర్టు తోసిపుచ్చింది. రాణా విదేశీయుడని, తన కుటుంబంతో మాట్లాడే ప్రాథమిక హక్కు ఉందని, కస్టడీలో ఉన్న రాణా ట్రీట్‌మెంట్‌పై వారు ఆందోళన చెందుతున్నారని రాణా తరఫు న్యాయవాది పీయూష్ సచ్‌దేవ కోర్టుకు విన్నవించారు. అయితే దీనిపై ఎన్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ జరుగుతున్నందున, సున్నితమైన సమాచారాన్ని అతను వెల్లడించే అవకాశం ఉంటుందని పేర్కొంది. దీంతో రాణా పిటిషన్‌ను ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ తోసిపుచ్చారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 06:12 PM