Washington: డోజ్‌కు 21 మంది రాజీనామా
ABN , Publish Date - Feb 27 , 2025 | 06:19 AM
అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ట్రంప్, మస్క్ ద్వయం రూపొందించిన డోజ్‌కు సొంత ఉద్యోగుల నుంచే వ్యతిరేకత ఎదురైంది.

వాషింగ్టన్, ఫిబ్రవరి 26: అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ట్రంప్, మస్క్ ద్వయం రూపొందించిన డోజ్‌కు సొంత ఉద్యోగుల నుంచే వ్యతిరేకత ఎదురైంది. అత్యంత కీలకమైన ప్రజా సేవల వ్యవస్థ నాశనంలో, ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులో తాము భాగం కాలేమంటూ 21 మంది డోజ్ ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ‘‘మీరు గతవారం చేసిన పనేమిటో ఐదు పాయింట్లలో తెలపండి. చెప్పకపోతే మీరు రాజీనామా చేసినట్టే భావిస్తాం’’ అంటూ మస్క్ ఇటీవలే 20 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు ఈమెయిళ్లు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. డోజ్ ఉద్యోగులు 21 మంది రాజీనామా చేశారు. ప్రభుత్వ వ్యవస్థల ప్రక్షాళన పేరుతో డోజ్ కోసం మస్క్ తీసుకుంటున్నవారెవరికీ ఎలాంటి నైపుణ్యాలూ లేవని.. వారంతా ఆయన రాజకీయ సిద్ధాంతాలతో ఏకీభవించేవారు మాత్రమేనని వారు విమర్శించారు.