Share News

Karnataka: కశ్మీర్‌ నుంచి బెంగళూరుకు సురక్షితంగా 178మంది ప్రయాణికులు

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:38 AM

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కశ్మీర్‌లో చిక్కుకున్న 178 మంది కన్నడిగులను మంత్రి సంతోష్‌లాడ్‌ నేతృత్వంలో సురక్షితంగా శ్రీనగర్‌ నుంచి బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు

Karnataka: కశ్మీర్‌ నుంచి బెంగళూరుకు సురక్షితంగా 178మంది ప్రయాణికులు

బెంగళూరు, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): పహల్గాంలో టెర్రరిస్టుల దాడి నేపథ్యంలో కశ్మీర్‌లో చిక్కుకున్న 178 మంది కన్నడిగులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చారు. కార్మిక శాఖ మంత్రి సంతో‌ష్‌లాడ్‌ రెండురోజులపాటు కశ్మీర్‌లో ఉంటూ అధికారుల బృందంతో కలిసి కన్నడిగులను గుర్తించారు. వారందరినీ గురువారం బెంగళూరుకు తీసుకువచ్చారు. కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలలో గడిపేందుకు వెళ్లిన కన్నడిగులను మంగళవారం సాయంత్రం నుంచి గుర్తించడం ప్రారంభించారు. అందరినీ సురక్షితంగా శ్రీనగర్‌ విమానాశ్రయానికి తీసుకువచ్చి అక్కడి నుంచి బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. వారి బంధుమిత్రులు వందలాది మంది విమానాశ్రయానికి వచ్చి స్వాగతించారు.

Updated Date - Apr 25 , 2025 | 03:38 AM