Share News

Breaking News: ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతం

ABN , First Publish Date - May 18 , 2025 | 11:08 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతం
Flash News

Live News & Update

  • May 18, 2025 20:17 IST

    అగ్నిప్రమాదం.. విచారణకు ఆదేశం..

    • గుల్జార్‌హౌజ్‌ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్‌ విచారణకు ఆదేశం

    • ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశం

    • భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలి: సీఎం రేవంత్‌

    • మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: సీఎం రేవంత్‌

    • సహాయక చర్యల గురించి ఎప్పటికప్పుడు ఫోన్‌ ద్వారా తెలుసుకున్నా: రేవంత్‌

  • May 18, 2025 19:47 IST

    టర్కీతో తెగతెంపులు..

    • టర్కీ యూనివర్సిటీలతో ఒప్పందాలు రద్దు చేసుకున్న ఐఐటీ బాంబే

    • ఒప్పందాలు నిలిపివేస్తున్నామని 'ఎక్స్'లో పోస్ట్ చేసిన ఐఐటీ బాంబే

    • జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామని ప్రకటన

    • ఇటీవల 23 వర్సిటీలతో ఒప్పందాలు రద్దు చేసుకున్న చండీగఢ్‌ వర్సిటీ

    • టర్కీ, అజర్‌బైజాన్‌లోని 23 యూనివర్సిటీలతో ఒప్పందాలు రద్దు

  • May 18, 2025 19:47 IST

    సచివాలయానికి మిస్‌వరల్డ్ సుందరీమణులు

    • హైదరాబాద్: సచివాలయానికి మిస్‌వరల్డ్ సుందరీమణులు

    • సచివాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఫొటో సెషన్

    • సచివాలయం నిర్మాణం, తదితర అంశాలపై డ్రోన్‌ షో

    • సచివాలయాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుందరీమణులు

    • తెలంగాణ జరూర్ ఆనా అంటూ నినదించిన మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లు

  • May 18, 2025 19:47 IST

    విశాఖ బీచ్ రోడ్డులో తిరంగా ర్యాలీ

    • వైఎంసీఏ నుంచి కాళీమాత ఆలయం వరకు ర్యాలీ

    • పాల్గొన్న కేంద్రమంత్రి శ్రీనివాస్‌వర్మ, మాజీ సైనికాధికారులు

    • 250 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్న విశాఖవాసులు

  • May 18, 2025 18:47 IST

    ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతం

    • పాక్‌లో లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతం

    • పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో సైఫుల్లా ఖలీద్‌పై కాల్పులు

    • ఫేక్ ఐడీతో నేపాల్‌లో తలదాచుకున్న సైఫుల్లా ఖలీద్

    • ఇటీవల సింధ్ ప్రావిన్స్‌కు మకాం మార్చిన ఖలీద్

    • భారత్‌లో మూడు దాడులకు సూత్రధారిగా సైఫుల్లా ఖలీద్

    • నాగ్‌పూర్, రాంపూర్, బెంగళూరు దాడుల్లో ఖలీద్ హస్తం

    • 2006లో RSS కార్యాలయంపై దాడి ఘటనలో ఖలీద్ సూత్రధారి

    • ఆపరేషన్ సిందూర్ తర్వాత సైఫుల్లాకు భద్రత కల్పించిన పాక్

    • సైఫుల్లా ఖలీద్‌ను కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు

  • May 18, 2025 17:13 IST

    తెలుగు రాష్ట్రాల సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం

    • జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్‌కు నిర్ణయం

    • అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమన్న ఎగ్జిబిటర్లు

    • పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తీర్మానం

    • నిర్మాతలకు లేఖ రాయాలని సినీ ఎగ్జిబిటర్ల తీర్మానం

    • పర్సంటేజ్‌కు ఒప్పుకోకుంటే థియేటర్లు బంద్ చేస్తామన్న ఎగ్జిబిటర్లు

  • May 18, 2025 16:39 IST

    మద్యం ధరలు పెంపు..

    • తెలంగాణలో మద్యం ధరలు పెంపు

    • వైన్ షాపులకు సర్క్యులర్ జారీ చేసిన ఎక్సైజ్‌శాఖ

    • క్వార్టర్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20 పెంపు

    • ఫుల్‌ బాటిల్‌పై రూ.40 పెంపు

  • May 18, 2025 16:05 IST

    నందిగం సురేశ్ అరెస్టు

    • మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్టు

    • అదుపులోకి తీసుకున్న తుళ్లూరు పోలీసులు

    • టీడీపీ కార్యకర్త రాజుపై నందిగం సురేశ్ దాడి

    • తుళ్లూరు పీఎస్‌ ఎదుట నందిగం సురేశ్ భార్య ఆందోళన

    • నందిగం సురేష్‌పై పీఎస్‌లో ఫిర్యాదు చేసిన లక్ష్మి

    • తన భర్త రాజుపై దాడి చేశారంటూ ఫిర్యాదు

  • May 18, 2025 15:11 IST

    గుల్జార్‌హౌస్‌ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా..

    • హైదరాబాద్: గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదం దురదృష్టకరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    • ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది: డిప్యూటీ సీఎం భట్టి

    • మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం: డిప్యూటీ సీఎం భట్టి

    • ఘటనపై ఎప్పటికప్పుడు సీఎం వివరాలు తెలుసుకున్నారు: డిప్యూటీ సీఎం భట్టి

    • షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగింది: డిప్యూటీ సీఎం భట్టి

    • పొగ పీల్చడంతో అస్వస్థతకు గురై 17 మంది మృతిచెందారు: డిప్యూటీ సీఎం భట్టి

    • మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: డిప్యూటీ సీఎం భట్టి

    • అగ్నిప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

  • May 18, 2025 15:05 IST

    పోస్టుమార్టం పూర్తి

    • చార్మినార్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 17 మంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

    • మృతదేహాలను బంధువులకు అప్పగించిన వైద్యులు, అధికారులు

  • May 18, 2025 15:02 IST

    పోస్టుమార్టం పూర్తి..

    • ఉస్మానియా మార్చురీలో 10 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

    • మృతదేహాలను అత్తాపూర్ సన్‌రైజ్ విల్లాస్‌కు తరలింపు

  • May 18, 2025 15:01 IST

    సీఎం రేవంత్ రెడ్డికి ఖర్గే ఫోన్..

    • సీఎం రేవంత్‌రెడ్డికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫోన్

    • అగ్నిప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్న ఖర్గే

    • సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్టు ఖర్గేకు తెలిపిన సీఎం

    • మంత్రులు ఘటనాస్థలికి వెళ్లారన్న సీఎం రేవంత్‌రెడ్డి

  • May 18, 2025 15:01 IST

    అగ్నిప్రమాదంపై డీజీ నాగిరెడ్డి..

    • జీ+2 భవనంలో అగ్నిప్రమాదం జరిగింది: ABNతో ఫైర్ డీజీ నాగిరెడ్డి

    • ఘటనాస్థలికి ఫైర్ సిబ్బంది ఆలస్యంగా వచ్చారన్నది అవాస్తవం

    • సమాచారం అందిన వెంటనే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు

    • 2గంటల పాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు: నాగిరెడ్డి

    • అపస్మారక స్థితిలో ఉన్న 17 మందిని ఆస్పత్రికి తరలించారు

    • చికిత్స పొందుతూ 17 మంది మృతి చెందారు: ABNతో ఫైర్ డీజీ నాగిరెడ్డి

    • భవనానికి ఎగ్జిట్, ఎంట్రీ ఒకటే ఉండటంతో కష్టమైంది: ఫైర్ డీజీ నాగిరెడ్డి

  • May 18, 2025 15:00 IST

    ఎమ్మెల్యే హరీష్ రావు దిగ్భ్రాంతి..

    • గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు దిగ్భ్రాంతి

    • ప్రమాదంలో 11మంది మృతిచెందడం బాధాకరం: హరీష్‌రావు

    • వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా: హరీష్‌రావు

    • ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైంది: హరీష్‌రావు

    • వేసవిలో ముందస్తు వ్యూహం అనుసరించకపోవడం నిర్లక్ష్యమే: హరీష్‌రావు

    • ప్రభుత్వ అలసత్వానికి సామాన్యులు బలవుతున్నారు: హరీష్‌రావు

    • ఇప్పటికైనా అగ్నిమాపకశాఖ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించాలి: హరీష్‌రావు

    • మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: హరీష్‌రావు

  • May 18, 2025 14:58 IST

    ఉస్మానియా వద్ద ఆందోళన..

    • ఉస్మానియా మార్చురీ దగ్గర మృతుల కుటుంబసభ్యుల ఆందోళన

    • సకాలంలో ఫైర్ ఇంజన్లు రాలేదని ఆందోళనకారులు నిరసన

    • వచ్చిన ఫైర్ ఇంజిన్‌లోనూ సరిపడా నీళ్లు, ఆక్సిజన్ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో వాగ్వాదం

    • మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీ అనిల్‌కుమార్

    • బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి, ఎంపీ హామీ

    • మంత్రి, ఎంపీ భరోసాతో శాంతించిన మృతుల కుటుంబసభ్యులు

  • May 18, 2025 13:44 IST

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్.

    • గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్న ఖర్గే.

    • ఘటన వివరాలను ఖర్గేకు వివరించిన సీఎం.

    • ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఖర్గేకు తెలిపిన సీఎం.

    • మంత్రులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఖర్గేకు వివరించిన సీఎం.

  • May 18, 2025 13:08 IST

    ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన..

  • May 18, 2025 13:06 IST

    గుల్జర్‌హౌస్ అగ్నిప్రమాదం కలచివేసింది: పవన్‌కల్యాణ్‌

    • ప్రమాదంలో 17 మంది మరణం బాధాకరం.

    • బాధిత కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి.

  • May 18, 2025 12:58 IST

    గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదం దిగ్ర్భాంతికి గురిచేసింది: నారా లోకేష్‌

    • చిన్నారులు, మహిళలు సహా పలువురి మరణం బాధాకరం.

    • బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.

  • May 18, 2025 12:54 IST

    హైదరాబాద్‌: చార్మినార్‌ అగ్నిప్రమాదంపై అగ్నిమాపకశాఖ ప్రకటన

    • ఉ.6:16 గంటలకు చార్మినార్, గుల్జార్‌హౌస్‌ చౌరస్తాలోని.. జీ+2 భవనంలో మంటలు చెలరేగాయి.

    • సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకున్నాం.

    • కింది అంతస్తులో మంటలు చెలరేగి పైఅంతస్తులకు వ్యాపించాయి.

    • ఫైర్‌ సిబ్బంది, రెస్క్యూ ఆపరేషన్ ఏకకాలంలో నిర్వహణ.

    • మొదటి అంతస్తులోని 17 మందిని కాపాడి ఆస్పత్రికి తరలించాం.

  • May 18, 2025 12:54 IST

    మీర్‌చౌక్‌ భారీ అగ్నిప్రమాదంలో 17కి చేరిన మృతుల సంఖ్య.

    • మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు.

    • ఒకటిన్నర ఏండ్లు ఒకరు.. ఏడేళ్లు ఒకరు.

    • నాలుగు ఏళ్ల లోపు పిల్లలు ఆరుగురు.

    • మృతుల్లో నలుగురు అరవై ఏళ్ళ నుంచి డెబ్బై ఐదేళ్ల ఏళ్ల వయస్సు వారు.

    • మృతుల్లో ఐదుగురు ముప్పై నుంచి నలభై ఏళ్ల లోపు వయస్సు వారు.

  • May 18, 2025 11:33 IST

    తెలంగాణ పోలీసుల సంచలన ఆపరేషన్

    • తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఆపరేషన్.

    • హైదరాబాద్‌లో పెలుళ్లకు కుట్ర.

    • ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కౌంటర్ ఇంటెలిజెన్స్.

    • సిరాజ్, సమీర్ కలిసి బ్లాస్టర్‌కి ప్లాన్

    • హైదరాబాద్‌లో బ్లాస్టర్‌లు చేసేందుకు ప్లాన్ చేసిన వ్యక్తులను పట్టుకున్న తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్.

    • విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్‌లను పట్టుకున్న పోలీసులు.

    • విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్.

    • సిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్‌కు ప్లాన్.

    • సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్‌కు అదేశాలు ఇచ్చిన ఐసిస్ మాడ్యుల్.

  • May 18, 2025 11:08 IST

    తిరుమలలో మహిళా భక్తుల మధ్య ఘర్షణ

    • నారాయణగిరి షెడ్‌లో జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.

    • సర్వదర్శనం కోసం వేచి ఉన్న మహిళా భక్తుల మధ్య వివాదం.

    • భద్రతా, టీటీడీ సిబ్బంది అక్కడ లేకపోవడంతో పెద్దదైన గొడవ.

    • మహిళా భక్తులు గొడవ పడుతున్నా చోద్యం చూసిన ఇతర భక్తులు.