-
-
Home » Mukhyaamshalu » telugu Viral trending Weather Telangana Andhra Pradesh national and international Breaking news 17th nov vreddy
-
BREAKING: గిగ్ వర్కర్ల బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
ABN , First Publish Date - Nov 17 , 2025 | 06:27 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Nov 17, 2025 20:38 IST
వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్..
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు
50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం
వారం, పదిరోజుల్లో వెలువడనున్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
-
Nov 17, 2025 20:22 IST
తెలంగాణ కేబినెట్ సమావేశం
నాలుగు గంటలుగా కొనసాగుతున్న కేబినెట్ భేటీ
గిగ్ వర్కర్ల బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
స్థానిక సంస్థల ఎన్నికలపై భేటీలో సుదీర్ఘ చర్చ
50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం
-
Nov 17, 2025 16:51 IST
హైదరాబాద్: బోరబండలో హిజ్రాల ఆందోళన
ఓ హిజ్రా తీరుకు నిరసనగా కొందరు హిజ్రాల ఆందోళన
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న కొందరు హిజ్రాలు
ముగ్గురు హిజ్రాలకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసిన పోలీసులు
బోరబండ సీఐతో పాటు పలువురు పోలీసులకు గాయాలు
-
Nov 17, 2025 16:51 IST
గుడ్ న్యూస్.. ఫలితాలు విడుదల..
హైదరాబాద్: ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II ఫలితాలు విడుదల
ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 1,284 పోస్టుల భర్తీ
TG MHSRB అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితా
-
Nov 17, 2025 16:51 IST
ఢిల్లీ: NIA కస్టడీకి రెడ్ ఫోర్ట్ బాంబు దాడి కేసు నిందితుడు
ఆమీర్ రషీద్ అలీ 10 రోజుల పాటు NIA కస్టడీకి అనుమతించిన పటియాలా హౌస్ కోర్టు
ఉగ్రవాద పేలుళ్ల కేసులో అమీర్ రషీద్ అలీని నిన్న అరెస్ట్ చేసిన NIA
అమీర్ రషీద్ అలీని NIA కార్యాలయానికి తరలించిన అధికారులు
-
Nov 17, 2025 16:49 IST
సౌదీ మృతులకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా..
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం
సౌదీ అరేబియా బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు... రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
మంత్రి అజరుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన... ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని సౌదీకి పంపాలని నిర్ణయం
బాధిత కుటుంబసభ్యులను ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు
డెడ్‌బాడీలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని నిర్ణయం
-
Nov 17, 2025 12:32 IST
తెలంగాణ MLAల ఫిరాయింపు కేసు 4 వారాలకు వాయిదా
4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
కోర్టు ధిక్కారంపై కేటీఆర్ పిటిషన్‌లో సుప్రీంకోర్టు నోటీసులు
ఫిరాయింపు MLAలపై చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరిన సుప్రీం
-
Nov 17, 2025 12:32 IST
ఈ నెల 9న మక్కాకి వెళ్లిన 54 మంది యాత్రికులు
ఇందులో కారులో మదీనాకు వెళ్లిన నలుగురు
మక్కాలో ఆగిపోయిన నలుగురు యాత్రికులు
ప్రమాద సమయంలో బస్సులో 46 మంది యాత్రికులు
బస్సులో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న యాత్రికుడు మహ్మద్ అబ్దుల్
ప్రమాదంలో 45 మంది యాత్రికులు మృతి
మదీనాకు 25 కి.మీ. దూరంలో ప్రమాదం
-
Nov 17, 2025 12:07 IST
సౌదీ ప్రమాదంలో అసిఫ్‌నగర్ వాసులు 16 మంది మృతి
ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా వెళ్లిన 16 మంది అసిఫ్‌నగర్ వాసులు
రహీమ్ ఉన్నీసా (60), రెహ్మా తబ్బీ (80), షెహనాజ్ బేగం (41)
గౌసియా బేగం (46), అబ్దుల్ ఖలీద్ (58), మహ్మద్ మౌలానా (64)
అబ్దుల్ షోయబ్ (24), సొహైల్ మహ్మద్ (22), మస్తాన్ మహ్మద్ (55)
పర్వీన్ బేగం (35), జకియా బేగం (47), షౌకత్ బేగం (57), పర్వీన్ బేగం (46)
జహీన్ బేగం (19), మహ్మద్ ముంజూర్ (50), మహ్మద్ అలీ (56)
-
Nov 17, 2025 12:06 IST
సౌదీ బాధితుల సహాయార్థం కేంద్రం కంట్రోల్ రూం ఏర్పాటు
కేంద్రం హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నెంబర్ 80024 40003
హెల్ప్‌లైన్ నెంబర్లు 01226 14093, 01266 14276
-
Nov 17, 2025 12:05 IST
10వ సారి బిహార్ సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణ స్వీకారం
రేపు బిహార్ NDA ఎమ్మెల్యేల సమావేశం
సీఎంగా నితీష్‌కుమార్‌ను ఎన్నుకోనున్న NDA ఎమ్మెల్యేలు
బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం పదవులు దక్కే అవకాశం
30 మందికి పైగా నితీష్‌కుమార్ క్యాబినెట్‌లో చోటు
20న సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణ స్వీకారం
-
Nov 17, 2025 11:45 IST
పాటియాలా హౌస్ కోర్టుకు ఉగ్రవాది అమీర్
కోర్టులో హాజరుపర్చనున్న NIA
పాటియాలా కోర్టు దగ్గర భద్రత పెంపు
నిన్న అమీర్‌ను అరెస్ట్ చేసినట్టు NIA ప్రకటన
ఆత్మాహుతి బాంబర్ ఉమర్‌కు సహాయకుడిగా ఉన్న అమీర్
-
Nov 17, 2025 11:45 IST
పైరసీతో సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం: సీపీ సజ్జనార్
పైరసీ చేస్తున్న ఐ-బొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేశాం: సీపీ
ఇమ్మడి రవిపై నాలుగు పైరసీ కేసులున్నాయి: సీపీ సజ్జనార్
బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసి మరింత నష్టం చేశాడు: సీపీ
బెట్టింగ్ యాప్స్‌తో ఎంతోమంది డబ్బు, ప్రాణాలు కోల్పోయారు
పైరసీతో ఇమ్మడి రవి రూ.20కోట్లు సంపాదించాడు: సీపీ
రవి దగ్గర 50లక్షల మంది సమాచారం ఉంది: సీపీ సజ్జనార్
సైట్ ఓపెన్ చేసినవారి డేటా మొత్తం రవి దగ్గర ఉంది: సీపీ
డేటాను డార్క్ వెబ్‌సైట్లకు అమ్ముకున్న ప్రమాదం: సీపీ
వెబ్‌సైట్ డిజైన్, డెవలపింగ్‌లో ఇమ్మడి రవి ఆరితేరాడు: సీపీ
ఒక సైట్ బ్లాక్ చేస్తే.. మరో సైట్ ద్వారా సినిమాలు అప్‌లోడ్: సీపీ
రవి నెట్‌వర్క్‌లో ఉన్న మిగిలినవారిని కూడా అరెస్ట్ చేస్తాం: సీపీ
-
Nov 17, 2025 10:26 IST
సౌదీ అరేబియా: మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తింపు
మల్లేపల్లిలోని ఆల్‌మీనా ట్రావెల్స్ నుంచి 16 మంది,..
మెహదీపట్నంలోని ఫ్లెజోన్ ట్రావెల్స్ నుంచి 24మంది టికెట్స్ బుకింగ్
మరో ఇద్దరు మరో ఏజెన్సీ ద్వారా మక్కా వెళ్లినట్టు గుర్తింపు
మల్లేపల్లి బజార్‌ఘాట్ నుంచి యాత్రకు వెళ్లిన 16 మంది
ప్రమాద విషయం తెలిసి ట్రావెల్ ఏజెన్సీకి చేరుకుంటున్న బంధువులు
-
Nov 17, 2025 09:41 IST
సౌదీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులకు ఆదేశం
కేంద్రం, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించిన రేవంత్
బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశం
ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, విదేశాంగశాఖ అధికారులతో మాట్లాడిన సీఎస్
హెల్ప్‌లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
కంట్రోల్ రూం నెంబర్లు: 79979 59754, 99129 19545
-
Nov 17, 2025 08:52 IST
సౌదీఅరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం
బస్సు-ట్యాంకర్ ఢీ, 42 మంది మృతి
మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు
మక్కా నుంచి మదీనా వెళ్తున్న భారతీయ యాత్రికులు
బదర్-మదీనా మధ్య ముఫరహత్ దగ్గర ఘటన
మృతుల్లో ఎక్కువమంది హైదరాబాద్ వాసులు
-
Nov 17, 2025 08:45 IST
దేశవ్యాప్తంగా పెరిగిన చలి గాలుల తీవ్రత
తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
తెలంగాణలో పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కే ఉష్ణోగ్రతలు పరిమితం
3 రోజులపాటు 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మెదక్, నిర్మల్, భూపాలపల్లి, ములుగు,..
మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో 6-10 డిగ్రీల ఉష్ణోగ్రతలు
-
Nov 17, 2025 08:32 IST
కేటీఆర్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
పార్టీ ఫిరాయింపు MLAల కేసులో గడువులోగా..
స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని కేటీఆర్ పిటిషన్
విడివిడిగా దాఖలైన 2 కేసులను విచారించనున్న సుప్రీంకోర్టు
-
Nov 17, 2025 08:31 IST
బంగ్లాదేశ్: ఢాకా సహా పలుచోట్ల మళ్లీ హింసాత్మక ఘటనలు
షేక్ హసీనాపై దాఖలైన హత్యా నేరం కేసుల్లో తీర్పు దృష్ట్యా ఆందోళనలు
బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కార్లకు నిప్పంటించిన ఆందోళనకారులు
సైన్యం, పోలీసులతో పాటు బోర్డర్ గార్డులను రంగంలోకి దింపిన యూనస్ ప్రభుత్వం
-
Nov 17, 2025 08:31 IST
ఢిల్లీ కారు పేలుడు ఘటనలో మరొకరిని అరెస్ట్ చేసిన NIA
కారు బాంబుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో అమిత్ రషీద్ అరెస్ట్
పేలుడు ఘటనలో ఆత్మాహుతి చేసుకున్న డాక్టర్ ఉమర్ నబీ
అమిర్ రషీద్ పేరుపై కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించిన NIA
కారును కొనుగోలు చేసి ఉమర్ నబీకి ఇచ్చేందుకు ఢిల్లీకి వచ్చిన అమిర్ రషీద్
ఉమర్ నబీని సూసైడ్ బాంబర్‌గా గుర్తించిన NIA
పేలుడు ఘటనలో ఇప్పటివరకు 73 మందిని విచారించిన NIA
-
Nov 17, 2025 08:31 IST
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు
నిబంధనలకు విరుద్ధంగా ఓవర్ లోడ్‌తో తిరుగుతున్న 72 వాహనాలు సీజ్
-
Nov 17, 2025 07:48 IST
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కటక్ కిలేడీ చేతివాటం
లిక్కర్ ముడుపులు కొట్టేసిన రషిత, ఇర్షాద్ గ్యాంగ్
కసిరెడ్డి గ్యాంగ్ వసూలు చేసిన సొమ్మును కొట్టేసిన ఒడిశా ప్రేమజంట
హైదరాబాద్‌లో దాచిన 6 నోట్ల కట్టల పెట్టేలు మాయం
4 నోట్ల కట్టల బాక్స్‌లతో కటక్‌కు ప్రియుడితో కలిసి రషిత పరారీ
అప్పటికే రెండు బాక్స్‌లు కాజేసిన ఇర్షాద్ మిత్రుడు
డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించి కసిరెడ్డి గ్యాంగ్ విఫలం
కొట్టేసిన డబ్బుతో ఒడిశాలో విలాసవంతమైన భవనం నిర్మించుకున్న రషిత
రషిత కొట్టేసిన డబ్బు, ఆస్తులను జప్తు చేయాలని సిట్ నిర్ణయం
-
Nov 17, 2025 07:48 IST
హైదరాబాద్: నేడు తెలంగాణ బీజేపీ నేతల సమావేశం
స్థానిక ఎన్నికలపై చర్చించనున్న టీబీజేపీ నేతలు
-
Nov 17, 2025 07:47 IST
బిహార్: నేడు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం
బిహార్ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించనున్న ఆర్జేడీ
బిహార్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ..
పాట్నాకు చేరుకోవాలని సూచించిన తేజస్వి యాదవ్
-
Nov 17, 2025 07:46 IST
బిహార్: నేడు నితీష్‌కుమార్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
17వ శాసనసభ రద్దు తీర్మానం ఆమోదించనున్న కేబినెట్
గవర్నర్‌కు రాజీనామా అందించనున్న నితీష్‌కుమార్
అనంతరం NDA భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్ష సమావేశాలు
NDA నాయకుడిని ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరనున్న NDA
-
Nov 17, 2025 07:46 IST
ఏపీ లిక్కర్ కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
చెవిరెడ్డి, వెంకటేష్ పిటిషన్లపై నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ
-
Nov 17, 2025 07:21 IST
కేరళ: తెరచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
నేటి నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనాలు
-
Nov 17, 2025 07:20 IST
బిహార్: నేడు పాట్నాలో ఆర్జేడీ నేతల సమావేశం
బిహార్ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించనున్న ఆర్జేడీ
బిహార్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ..
పాట్నాకు చేరుకోవాలని సూచించిన తేజస్వి యాదవ్
-
Nov 17, 2025 06:27 IST
నైరుతి బంగాళాతంలో అల్పపీడనం
2 రోజుల పాటు దక్షిణకోస్తా, రాయలసీమకు వర్ష సూచన
నెల్లూరు, తిరుపతి జిల్లాలకు అతిభారీ వర్ష సూచన
ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన
-
Nov 17, 2025 06:27 IST
నేడు మ.3గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ
స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
42శాతం బీసీ రిజర్వేషన్లను అమలుచేసి ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కార్
ప్రజాపాలన విజయోత్సవాల ప్రణాళికలు ఖరారు చేయనున్న కేబినెట్
డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై చర్చ
గిగ్ వర్కర్ల ముసాయిదాకు ఆమోదం తెలుపనున్న మంత్రివర్గం