-
-
Home » Mukhyaamshalu » Monday 28th July 2025 Live Updates and latest Breaking News Parliament Updates TRENDING news and Major Events Across India Siva
-

LIVE Updates: దివ్య దేశ్‌ముఖ్‌కు నారా భువనేశ్వరి శుభాకాంక్షలు
ABN , First Publish Date - Jul 28 , 2025 | 10:09 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 28, 2025 21:26 IST
బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించాం: మంత్రి పొన్నం
విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల బిల్లు ఆమోదించి గవర్నర్‌కు పంపాం: పొన్నం
ఈనెల 14న బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపించాం: పొన్నం
ఆర్డినెన్స్‌పై గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం: మంత్రి పొన్నం
బీసీ రిజర్వేషన్లపై ఇండియా కూటమి మద్దతు కోరతాం: మంత్రి పొన్నం
ఎన్నికలు ఆలస్యమైతే స్థానిక సంస్థల నిధులకు ఇబ్బంది: మంత్రి పొన్నం
ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో నిరసనలు చేపడతాం: మంత్రి పొన్నం
న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చేశాం: మంత్రి పొన్నం
బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు సహకరించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
-
Jul 28, 2025 20:25 IST
ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం
5 గంటలపాటు సాగిన తెలంగాణ కేబినెట్ భేటీ
బీసీ రిజర్వేషన్ల అంశంపై కేబినెట్‌లో చర్చ
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతిని కలవాలని నిర్ణయం
త్వరలో ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయం
జీవో 33, హైకోర్టు జడ్జిమెంట్‌పై కేబినెట్‌లో చర్చ
వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఛార్జీల పెంపుపై చర్చ
-
Jul 28, 2025 20:24 IST
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ
జీవో 33, హైకోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్‌పై కేబినెట్‌లో చర్చ
వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఛార్జీల పెంపుపై చర్చ
హైకోర్టు తీర్పు, భవిష్యత్ కార్యాచరణపై ఏజీతో చర్చించాలని..
మంత్రి దామోదరకు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో కేబినెట్ నుంచి ఏజీ వద్దకు బయల్దేరిన దామోదర రాజనర్సింహ
-
Jul 28, 2025 20:01 IST
నంద్యాల: శ్రీశైలం జలాశయానికి భారీ వరద
ఇన్ ఫ్లో 2,42,724, ఔట్ ఫ్లో 1,75,156 క్యూసెక్కులు
4 రేడియల్ క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీరు విడుదల
కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
-
Jul 28, 2025 20:01 IST
అమరావతి: దివ్య దేశ్‌ముఖ్‌కు నారా భువనేశ్వరి శుభాకాంక్షలు
మహిళల చెస్ ప్రపంచకప్ గెలుచుకున్న దివ్య దేశ్‌ముఖ్‌కు అభినందనలు
మీ ధైర్యం, ప్రతిభ, ప్రశాంతత దేశానికి స్ఫూర్తినిచ్చాయి: నారా భువనేశ్వరి
భారత చెస్ భవిష్యత్ ప్రకాశవంతంగా అభివృద్ధి చెందుతోంది: భువనేశ్వరి
-
Jul 28, 2025 20:01 IST
గుంటూరు: పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు CID నోటీసులు
రేషన్ మాఫియా చేతిలో హత్యకు గురైన భర్నబాసు కేసులో విచారణ
వైసీపీ ప్రభుత్వంలో హత్యకు గురైన పొన్నూరుకు చెందిన భర్నబాసు
రేపు CID కార్యాలయంలో విచారణకు రావాలని కిలారి రోశయ్యకు నోటీసులు
-
Jul 28, 2025 18:21 IST
బనకచర్లపై అధికారులు, పరివాహక రాష్ట్రాలను సంప్రదిస్తున్నామన్న కేంద్రం
బనకచర్ల సాంకేతిక, ఆర్థిక అంచనాకు తగిన ప్రక్రియ అనుసరిస్తామన్న కేంద్రం
రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర జలశక్తి శాఖ
రాజ్యసభలో కేంద్ర సహాయ మంత్రి రాజ్‌భూషన్ చౌదరి లిఖితపూర్వక సమాధానం
కాంగ్రెస్ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నకు జల్‌శక్తి శాఖ సమాధానం
బనకచర్ల ప్రాజెక్టును ఇంకా చేపట్టలేదని ఏపీ ప్రభుత్వం తెలిపిందన్న కేంద్రం
ప్రిఫీజబిలిటీ రిపోర్టును సీడబ్ల్యూసీకి ఏపీ ప్రభుత్వం అందజేసిందన్న కేంద్రం
బనకచర్లపై అభ్యంతరాలు చెబుతూ తెలంగాణ లేఖ రాసిందన్న కేంద్రం
బనకచర్లపై అధికారులు, పరివాహక రాష్ట్రాలతో చర్చిస్తున్నామన్న కేంద్రం
-
Jul 28, 2025 17:54 IST
HCA కేసు CBIకి అప్పగించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ
సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ 3 వారాలకు వాయిదా
HCAలో చోటుచేసుకున్న ఆర్థిక అక్రమాలపై CBI విచారణ జరిపించాలని పిటిషన్
HCA బాధ్యతలను BCCIకి అప్పగిస్తూ ఆదేశాలివ్వాలని కోరిన పిటిషనర్
ఈనెల 19న నిర్వహించిన వార్షిక సమావేశం చెల్లదని ప్రకటించాలని పిటిషన్
HCA బాధ్యతలను విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావుకు అప్పగిస్తూ గత విచారణ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
మధ్యంతర ఉత్తర్వులు మూడువారాల వరకు కొనసాగింపు
మూడువారాల తర్వాత మరోసారి విచారణ జరుపనున్న న్యాయస్థానం
-
Jul 28, 2025 17:54 IST
MBBS సీట్ల స్థానికతపై తెలంగాణ హైకోర్టు తాత్కాలిక తీర్పు
కాళోజీ వర్సిటీ దరఖాస్తుదారులను స్థానికులుగా పరిగణించాలని ఆదేశం
సుమారు 100 మంది అభ్యర్థులకు తాత్కాలిక ఊరట
తుది తీర్పు వచ్చేవరకు రిజిస్ట్రేషన్లలో చేర్చాలని ఉత్తర్వులు
ఈనెల 30తో రిజిస్ట్రేషన్లు ముగియనుండటంతో హైకోర్టు కీలక తీర్పు
-
Jul 28, 2025 17:48 IST
ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్ సదస్సు, పాల్గొన్న సీఎం చంద్రబాబు
వచ్చే నవంబర్‌లో విశాఖలో పెట్టబడుల సదస్సుకు సన్నాహకంగా సింగపూర్‌లో ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్ సదస్సు
ఏపీలో కొత్త పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై పారిశ్రామికవేత్తలకు వివరించిన సీఎం చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఆటోమొబైల్స్ తదితర రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్
విశాఖలో పెట్టుబడుల సదస్సుకు హాజరుకావాలని సింగపూర్ దిగ్గజ కంపెనీల ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానం
-
Jul 28, 2025 17:29 IST
హైదరాబాద్: గోల్కొండ ఏరియాలో చిరుత కలకలం
గోల్కొండ ఇబ్రహీంబాగ్ మిలిటరీ ఏరియాలో చిరుత సంచారం
చిరుత రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు
లంగర్‌హౌస్-నార్సింగి రోడ్డుపై చిరుత సంచారంతో భయాందోళనలో స్థానికులు
తారామతి వెనుకభాగం మూసీ వైపు చిరుత వెళ్లినట్లు గుర్తింపు
కొద్దిరోజులుగా మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో చిరుత సంచారం
-
Jul 28, 2025 16:59 IST
అమరావతి: సా.5 గంటలకు గవర్నర్‌ను కలవనున్న జగన్
లిక్కర్ స్కాం వేగవంతం కావడంతో వైసీపీ అధిష్టానంలో కదలిక
మిథున్‌రెడ్డి అరెస్టు తర్వాత జగన్ సహా వైసీపీ నేతల్లో ఆందోళన
భారతి సిమెంట్స్ ఆఫీస్‌లో తనిఖీలతో ఉలిక్కపడ్డ జగన్ అండ్ కో
బెంగళూరులో న్యాయ, ఆర్థిక నిపుణులతో జగన్ మంతనాలు
తనను టార్గెట్ చేశారను గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు చేసే అవకాశం
-
Jul 28, 2025 16:59 IST
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెన్షన్ పెంపు హామీ ఏమైంది?: మందకృష్ణ మాదిగ
ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచారు: మందకృష్ణ
రుణమాఫీ చేసిన రూ.20 వేలకోట్లు పెన్షన్‌దారులవే: మందకృష్ణ మాదిగ
పెన్షన్ల పెంపుపై BRS మాట్లాడకపోవడం బాధాకరం: మందకృష్ణ మాదిగ
-
Jul 28, 2025 16:59 IST
ఢిల్లీ: కేంద్రమంత్రి గడ్కరీకి బండి సంజయ్ పలు విజ్ఞప్తులు
తెలంగాణకు CRIF నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
కరీంనగర్-జగిత్యాల రోడ్ విస్తరణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి
కమిటీ నివేదిక వచ్చాక పనులు ప్రారంభిస్తామని గడ్కరీ హామీ
త్వరలోనే CRIF నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్న గడ్కరీ
-
Jul 28, 2025 16:59 IST
కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి
1050 మెగావాట్ల సామర్థ్యంతో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు
సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుచేయనున్న JSW నియో ఎనర్జీ సంస్థ
తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, జలవనరులు పరిశ్రమలు, ట్రాన్స్‌కో అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
-
Jul 28, 2025 16:58 IST
ఏపీలో 3 MPTC, 2 ZPTC, 2 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలకు నోటిఫికేషన్
రామకుప్పం, కారంపూడి, విడవలూరు MPTC ఎన్నికలు
పులివెందుల, ఒంటిమిట్ట ZPTC స్థానాలకు ఎన్నిక
కొండపూడి, కడియపులంక సర్పంచ్ ఎన్నికలు
ఈనెల 28న ఎన్నికల నోటిఫికేషన్ జారీ
జలై 30 నుంచి ఆగస్టు ఒకటి దాకా నామినేషన్ల స్వీకరణ
ఆగస్టు 12న MPTC, ZPTC ఎన్నికలు
ఆగస్టు 14న MPTC, ZPTC ఎన్నికల ఫలితాలు
ఆగస్టు 10న సర్పంచ్ ఎన్నికలు.. అదేరోజున ఫలితాలు
-
Jul 28, 2025 16:01 IST
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్
ఫైనల్‌లో కోనేరు హంపిపై దివ్య దేశ్‌ముఖ్ గెలుపు
ఫిడే ప్రపంచకప్ ఫైనల్ టై బ్రేకర్‌లో కోనేరు హంపిపై దివ్య విజయం
ఫైనల్‌లో రెండుసార్లు డ్రాగా ముగిసిన తర్వాత టై బ్రేకర్‌లో దివ్య గెలుపు
-
Jul 28, 2025 14:17 IST
ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో చర్చ ప్రారంభించిన రాజ్‌నాథ్ సింగ్
పహల్గామ్ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు: రాజ్‌నాథ్
భారత సైన్యం సత్తాకు ఆపరేషన్ సిందూర్ నిదర్శనం: రాజ్‌నాథ్
ఆపరేషన్ సిందూర్‌లో సైన్యం పాత్ర వెలకట్టలేనిది: రాజ్‌నాథ్
ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి మన సత్తా చాటాం: రాజ్‌నాథ్
పాక్ ఉగ్ర స్థావరాలపై వ్యూహాత్మకంగా దాడి చేశాం: రాజ్‌నాథ్
7 ఉగ్ర శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది
కేవలం 22 నిమిషాల్లోనే ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం
ఆపరేషన్ సిందూర్‌లో 100కి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం
పాక్‌లో సామాన్యులకు ఇబ్బంది లేకుండా దాడులు చేశాం
సిందూర్ అనేది వీరత్వం, శౌర్యానికి ప్రతీక.
-
Jul 28, 2025 13:26 IST
జమ్మూకశ్మీర్: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్
హిర్వాన్-లిద్వాస్ ప్రాంతంలో ఎదురుకాల్పులు
బలగాల కాల్పుల్లో ముగ్గురు పహల్గామ్ ఉగ్రవాదులు హతం
కాల్పుల్లో ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా హతం
పహల్గామ్ ఉగ్రవాదులే లక్ష్యంగా 'ఆపరేషన్ మహదేవ్'
ఒక్కో ఉగ్రవాదిపై రూ.20లక్షల రివార్డు
-
Jul 28, 2025 13:16 IST
లోక్‌సభ మ.2గంటలకు వాయిదా
ఉదయం నుంచి 3సార్లు వాయిదా పడ్డ లోక్‌సభ
బిహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాల పట్టు
SIRను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
స్పీకర్ పోడియం వద్ద విపక్ష సభ్యుల నిరసన
విపక్షాల నిరసనలతో సభను వాయిదా వేసిన స్పీకర్
-
Jul 28, 2025 10:30 IST
గబ్బిలాలతో చిల్లీ చికెన్..!
తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలం.
గబ్బిలాలను వేటాడుతున్న సెల్వం, కమల్ అరెస్ట్.
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు గబ్బిలాల మాంసం సప్లై.
గబ్బిలాలతో చిల్లీ చికెన్ చేసి హోటల్స్‌కు సరఫరా.
డానిష్‌పేట అటవీ ప్రాంతంలో తుపాకులతో గబ్బిలాల వేట.
సేలం జిల్లా ఓమలూరులో నిందితులు ఇద్దరు అరెస్ట్.
-
Jul 28, 2025 10:22 IST
భూపాలపల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
ముకునూరు, నీలంపల్లి, బూరుగూడెంతో పాటు సర్వాయిపేట గ్రామాల్లో వెలసిన పోస్టర్లు.
మావోయిస్టు అగ్రనేతలు కాలంచెల్లిన సిద్ధాంతాలువీడి జనజీవన విధానంలో కలవాలంటూ పోస్టర్లు.
మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలని మావోయిస్టు ఆత్మపరిరక్షణ-ప్రజాఫ్రంట్ పోస్టర్లు.
-
Jul 28, 2025 10:09 IST
హైదరాబాద్: కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.
నిన్న స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ గుర్తింపు.
టోల్ ఫీజు తప్పించుకునేందుకు స్టిక్కర్ పెట్టుకున్నట్టు గుర్తింపు.
ఎంపీ స్టిక్కర్ ఫేక్ అంటున్న ఎక్సైజ్ అధికారులు.
కారు అశోక్‌కుమార్‌కు చెందినదిగా గుర్తించిన ఎక్సైజ్ అధికారులు.
ఇప్పటికే అశోక్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు.