-
-
Home » Mukhyaamshalu » Live Updates Breaking News monday 14th July 2025 Major Events and Top news Across India kjr
-

Flash News: తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
ABN , First Publish Date - Jul 14 , 2025 | 10:11 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 14, 2025 21:24 IST
లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం
ఉత్కంఠ పోరులో పోరాడి ఓడిన భారత్
చివరి వరకు పోరాడిన రవీంద్ర జడేజా
5 టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఇంగ్లండ్
-
Jul 14, 2025 21:09 IST
హాఫ్ సెంచరీ చేసిన జడేజా..
లార్డ్స్ టెస్టులో రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ
151 బంతుల్లో 53 పరుగులు చేసిన జడేజా
కెరీర్‌లో 26వ హాఫ్ సెంచరీ చేసిన జడేజా
-
Jul 14, 2025 21:08 IST
మంత్రి అచ్చెన్న ఆదేశాలు.. ఎందుకంటే..
అమరావతి: పొగాకు కొనుగోళ్లలో వేగం పెంచాలని మంత్రి అచ్చెన్న ఆదేశం
పొగాకు కొనుగోలు కేంద్రాలను పెంచాలని మార్క్‌ఫెడ్ అధికారులకు సూచన
20 క్వింటాళ్ల వరకు పొగాకు ఉన్న రైతుల దగ్గర వెంటనే కొనుగోలుకు ఆదేశం
అవసరమైతే ప్రైవేట్ గోడౌన్స్ అద్దెకు తీసుకోవాలన్న మంత్రి అచ్చెన్న
-
Jul 14, 2025 18:41 IST
తెలంగాణకు కొత్త సీజే..
తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
కొలీజియం సిఫార్సును ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అపరేష్ కుమార్
-
Jul 14, 2025 17:39 IST
రేషన్ కార్డు అంటే పేదవారి ఆత్మగౌరవం.. గుర్తింపు: సీఎం రేవంత్
పేదల ఆకలి తీర్చే ఆయుధమే రేషన్ కార్డు: సీఎం రేవంత్
కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లే నల్గొండ జిల్లాకు నీళ్లు: సీఎం రేవంత్
మూడు అడుగులు ఉన్న స్థానిక నేత ఎగిరెగిరి పడుతున్నారు: రేవంత్
పదేళ్లు అవకాశం ఇచ్చినా తుంగతుర్తికి నీళ్లు ఎందుకు తేలేదు: రేవంత్
తుంగతుర్తికి నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు: రేవంత్
దొర ముందు చేతులు కట్టుకుని గ్లాస్‌లో సోడా పోయడమే నీకు తెలుసు: రేవంత్
సొంత మండలానికి ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీస్‌లు, పీఎస్ తెచ్చుకోలేదు: రేవంత్
పోరాట యోధులను అందించిన గడ్డ నల్గొండ: సీఎం రేవంత్
-
Jul 14, 2025 17:39 IST
సూర్యాపేట: తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన సీఎం రేవంత్
పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
రూ.34.20 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించిన రేవంత్
తెలంగాణలో కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డుల పంపిణీ
కొత్త రేషన్ కార్డులతో 11.3 లక్షల మందికి లబ్ధి
తెలంగాణలో 95.56 లక్షలకు చేరిన మొత్తం రేషన్ కార్డులు
-
Jul 14, 2025 14:22 IST
గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు..
మూడు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు
హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా
-
Jul 14, 2025 13:27 IST
భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రత
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రత నమోదైంది.
తనింబర్ దీవుల ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
అయితే, సునామీ హచ్చరికలు జారీ చేయలేనట్లుగా తెలుస్తోంది.
-
Jul 14, 2025 12:55 IST
బి.సరోజాదేవి మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం
సరోజాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలి
ప్రముఖ నటి శ్రీమతి బి.సరోజాదేవి కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
1955 నుంచి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లో నటించి చిత్ర సీమపై తనదైన ముద్రను వేశారు.
భూకైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, శకుంతల, దానవీర శూర కర్ణ, ఆత్మబలం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
సరోజా దేవి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
-
Jul 14, 2025 12:45 IST
ఆర్మీ జవాన్ మురళి అనుమానాస్పద మృతి
కనగానపల్లి మండలం శివపురం కొట్టాల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్
చత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో ఆర్మీలో ఏడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న జవాన్ మురళి
నిన్న రాత్రి రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో తుపాకీతో ఫైర్ చేసుకుని ఆత్మహత్య
కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చిన ఆర్మీ అధికారులు
-
Jul 14, 2025 12:09 IST
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
ఏపీలో ఏఐప్లస్ క్యాంపస్‌ను అనౌన్స్ చేసిన ఆదిత్య బిర్లా ఛైర్మన్ కుమర్ మంగళం బిర్లా, బిట్స్ చాన్సలర్‌లకు ధన్యవాదాలు
ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఏపీలో ఏర్పాటు చేస్తోంది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ క్యాంపస్
డేటాసైన్స్, రోబోటిక్స్ , సైబర్ ఫిజికల్ సిష్టమ్స్ వంటి కోర్సులను ఈ క్యాంపస్ అందిస్తుంది
అంటూ ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
-
Jul 14, 2025 12:00 IST
కూలీల మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం
అన్నమయ్య జిల్లా రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద వాహనం బోల్తా పడిన దుర్ఘటనలో తొమ్మిది మంది కూలీలు దుర్మరణం పాలయ్యారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను.
మృతుల కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
వీరంతా మామిడి కోతకు సంబంధించిన కూలీలని అధికారుల ద్వారా సమాచారం వచ్చింది.
క్షతగాత్రులకి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా యంత్రాంగానికి సూచించాను.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది.
-
Jul 14, 2025 11:34 IST
కొంపల్లి డ్రగ్స్ కేసుపై నేడు ఆరుగురు నిందితులను కస్టడీకి తీసుకోనున్న ఈగల్ టీం..
మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యాతో సహా ఆరుగురు నిందితులను విచారించనున్న ఈగల్ టీం
ఈ కేసులో 6 మంది రిమాండ్ కాగా 19 మంది కన్జ్యూమర్లపై కేసు నమోదు చేసిన ఈగల్ టీం..
పబ్బులలో ప్రత్యేక లాంజ్‌లను ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ తీసుకుంటున్న కన్జ్యూమర్స్..
వీఐపీ లాంజ్‌లను బుక్ చేసుకుంటున్న కన్జ్యూమర్స్
రెగ్యులర్‌గా వెళ్లే కన్జ్యూమర్స్‌తో పాటు..
ఎవరూ లాంజ్‌లను బుక్ చేసుకుంటున్నారు.. అనే దానిపై ప్రశ్నించనున్న ఈగల్ అధికారులు
మరోవైపు కొంపల్లి డ్రగ్స్ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేసిన ఈగల్ టీమ్
మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యకు డ్రగ్స్ సరఫరా చేసిన హర్ష తో పాటు మరొకరిని అరెస్ట్ చేసిన ఈగల్ అధికారులు
ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసిన అధికారులు
-
Jul 14, 2025 10:30 IST
స్టాక్ బ్రోకింగ్ పేరిట మహిళా వ్యాపారికి సైబర్ నేరగాళ్ల టోకరా
వ్యాపారి నుండి 3.2 కోట్ల రూపాయల మోసం చేసిన సైబర్ నేరగాళ్లు
గాంధీ నగర్‌లో ఎస్బిఐ కాలనీకి చెందిన మహిళ వ్యాపారి
మే 28న వాట్సప్‌లో ఓ లింకును షేర్ చేసిన సైబర్ నేరగాళ్లు
లింక్ ఓపెన్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిన మహిళా వ్యాపారి
-
Jul 14, 2025 10:15 IST
ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో ఈ రోజు (సోమవారం) రంగం కార్యక్రమం ఘనంగా జరిగింది.
బోనాలు పండుగ తర్వాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు. ఈ యేడాది కూడా వర్షాలు బాగా కురుస్తాయని చెప్పారు.
తాను కోపంగా లేనని.. తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకుంటారు అంటూ స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
-
Jul 14, 2025 10:15 IST
ప్రముఖ సీనియర్ నటి బీ సరోజా దేవి కన్నుమూశారు.
ఆమె గత కొంతకాలంగావృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
బెంగళూరు, యశవంతపురలోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
87 ఏళ్ల వయసులో సోమవారం కన్నుమూశారు.