-
-
Home » Mukhyaamshalu » Live Updates and Breaking News Monday 21th July 2025 Top news and Major Events Across India kjr
-

Breaking News: వైసీపీ నేత రమేష్‌రెడ్డి అరెస్ట్
ABN , First Publish Date - Jul 21 , 2025 | 05:51 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 21, 2025 21:40 IST
ధన్‌ఖడ్ రాజీనామా..
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా
అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ పంపిన ధన్‌ఖడ్
-
Jul 21, 2025 20:34 IST
పవర్ స్టార్ సినిమా టికెట్ రేట్లు పెంపు..
తెలంగాణలో 'హరిహర వీరమల్లు' సినిమా టికెట్ల ధరల పెంపు
ఎల్లుండి 'హరిహర వీరమల్లు' ప్రీమియర్ షోకు అనుమతి
ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600గా నిర్ణయం
మల్టీప్లెక్స్ టికెట్ ధర రూ.200 వరకు పెంపు
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150 వరకు పెంపు
-
Jul 21, 2025 20:34 IST
వైసీపీ నేత అరెస్ట్..
అన్నమయ్య: వైసీపీ నేత రమేష్‌రెడ్డి అరెస్ట్
మంత్రి రాంప్రసాద్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్
-
Jul 21, 2025 17:24 IST
బెట్టింగ్ యాప్స్ కేసులో ED దర్యాప్తు ముమ్మరం
నటులు రానా, ప్రకాష్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మికి ED నోటీసులు
బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలని నోటీసులు
ఈనెల 23న రానా, 30న ప్రకాష్‌రాజ్‌ను ప్రశ్నించనున్న ED
ఆగస్టు 6న విచారణకు హాజరుకావాలని విజయ్ దేవరకొండకు నోటీసులు
ఆగస్టు 13న మంచు లక్ష్మిని ప్రశ్నించనున్న ED
-
Jul 21, 2025 17:18 IST
నిర్మల్: పెంబిలో బాలికల పాఠశాలలో దారుణం
పసుపు బియ్యం తిని 13మంది బాలికలకు అస్వస్థత
తన డబ్బులు పోయాయని మిగతా బాలికలను అడిగిన మరో బాలిక
తమకు తెలియదనడంతో పసుపు బియ్యం, వేపాకు తినిపించిన బాలిక
-
Jul 21, 2025 16:24 IST
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
రెండురోజులపాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్‌రెడ్డి
బీసీ రిజర్వేషన్లపై మద్దతు కూడగడుతున్న సీఎం రేవంత్
ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం రేవంత్‌రెడ్డి
ఇప్పటికే బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతికి పంపిన రేవంత్ సర్కార్
-
Jul 21, 2025 16:24 IST
లోక్ సభ వాయిదా..
లోక్‌సభ రేపటికి వాయిదా
విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా
-
Jul 21, 2025 16:00 IST
రూ.3,500 కోట్లతో దేశంలో అతిపెద్ద కుంభకోణంగా ఏపీ లిక్కర్ స్కాం
కోర్టు చెప్పినా గతంలో డిజిటల్ పేమెంట్స్ లేకుండా మద్యం అమ్మకాలు
వైసీపీ హయాంలో దోపిడీకి, కమీషన్లకు అనువుగా నిర్ణయాలు అమలు
నెలకు రూ.60 కోట్లు చొప్పున లంచాలు, వాటాలు, కమీషన్లు
ఏపీ లిక్కర్ ముడుపులు పంచుకోవడానికి 7 రహస్య ప్రాంతాల్లో డెన్‌లు
సిట్ దర్యాప్తులో అడ్రస్‌లతో పాటు డెన్‌ల ఆచూకీ గుర్తింపు
డెన్ 1: నిర్మితి ల్యాండ్ మార్క్ అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెం.302 బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12
డెన్ 2: శ్రీనివాసం అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెంబర్ C3, ఫిల్మ్‌నగర్
డెన్ 3: ఉమా హిల్ క్రైస్ట్ అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెంబర్ 402, జూబ్లీహిల్స్
డెన్ 4: పడాల్స్ హౌస్, డోర్ నెంబర్ 3-3-111/98, నలంద నగర్, హైదర్‌గూడ
డెన్ 5: NCC అర్బన్ 1 అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెంబర్ 1603, 8th బ్లాక్, నార్సింగి
డెన్ 6: ఓటుస్కేర్ అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెంబర్స్ 103, 601, నానక్‌రామ్‌గూడ
డెన్ 7: ల్యాండ్‌మార్క్ అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెం. 312, నవోదయ కాలనీ, గుంటూరు
-
Jul 21, 2025 16:00 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
443 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
122 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Jul 21, 2025 16:00 IST
లిక్కర్ స్కాంపై ఆచితూచి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
లిక్కర్ కేసు గురించి నేను చెప్పేదేమీ లేదు: పవన్ కల్యాణ్
కోర్టు పరిధిలో ఉన్న అంశంపై స్పందించలేను: పవన్ కల్యాణ్
జగన్‌పై కక్ష సాధింపులకు పాల్పడడం లేదు: పవన్ కల్యాణ్
-
Jul 21, 2025 15:56 IST
ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ పరికరాల ఉత్పత్తికి ఏపీ అనుకూలం
రాయలసీమలో ఇప్పటికే మౌలిక సదుపాయాలు: సీఎం చంద్రబాబు
'మేడ్ ఇన్ ఇండియా' లక్ష్యాలు నెరవేరేలా నూతన పాలసీ: చంద్రబాబు
ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్స్ పాలసీ 4.oపై సీఎం చంద్రబాబు సమీక్ష
-
Jul 21, 2025 15:56 IST
953 స్కూళ్లు ఎంపిక.. ఎందుకంటే..
ఏపీలో పీఎంశ్రీ పథకం కింద 953 స్కూళ్లు ఎంపిక: ఎంపీ కేశినేని చిన్ని
ఎన్టీఆర్ జిల్లాలో 29 స్కూళ్లు ఎంపిక: విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
ఛాలెంజింగ్ మెథడ్‌లో ఏడు దశల్లో 935 స్కూళ్లు ఎంపిక: కేశినేని చిన్ని
-
Jul 21, 2025 15:09 IST
పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం..
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావం
ఏపీలో వచ్చే 4 రోజులపాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం
ఈ నెల 24న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
-
Jul 21, 2025 15:08 IST
టెస్టు క్రికెట్ అంశంలో ICC కీలక నిర్ణయం
12ఏళ్ల నుంచి నిర్వహించని ఛాంపియన్స్ లీగ్ పునరుద్ధరణకు నిర్ణయం
సింగపూర్‌లో ICC చైర్మన్ జైషా అధ్యక్షతన సమావేశం
హాజరైన BCCI, ECB, క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులు
టూటైర్ టెస్టు ఫార్మాట్ అమలుపై IC కమిటీ
టెస్టు క్రికెట్‌లో కొత్త నిర్ణయాలు 2027-29 సీజన్ నుంచే అమలు: ICC
-
Jul 21, 2025 15:08 IST
ప్రతిపక్ష ఎంపీల నోటీసు..
జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీల నోటీసు
రాజ్యసభకు నోటీసు ఇచ్చిన 63 మంది ప్రతిపక్ష ఎంపీలు
ఢిల్లీలో తన అధికార నివాసంలో కాలిపోయిన..
నోట్లకట్టలు బయటపడిన కేసులో చిక్కుకున్న జస్టిస్ వర్మ
-
Jul 21, 2025 15:06 IST
ఢాకాలో కూలిన బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ విమానం
ఢాకాలో మైల్‌స్టోన్ కాలేజీపై కుప్పకూలిన శిక్షణ విమానం
ప్రమాదంలో విమాన పైలట్ లెఫ్టినెంట్ టౌకిర్ మృతి
మరో 10మందికి పైగా మృతిచెందినట్లు సమాచారం
భారీగా చెలరేగిన మంటలు, కొనసాగుతోన్న సహాయక చర్యలు
-
Jul 21, 2025 13:39 IST
విజయవాడ ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్
పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఫాలో అయ్యేందుకు...
టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్ వేసిన మిథున్ రెడ్డి
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న నేపథ్యంలో...
సమావేశాలను ఫాలో అవ్వాలని తెలిపిన మిథున్ రెడ్డి
-
Jul 21, 2025 13:26 IST
భారత టెస్టు జట్టుకు గాయాల బెడద
గాయంతో ఇంగ్లండ్‌తో సిరీస్ మొత్తానికి దూరమైన నితీష్ కుమార్‌రెడ్డి
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌కు గాయంతో అర్షదీప్ దూరం
భారత జట్టుతో చేరిన 24 ఏళ్ళ అన్షుల్ కంభోజ్
ఆకాష్ దీప్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత ఇవ్వని బీసీసీఐ
-
Jul 21, 2025 13:24 IST
తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత
చెన్నై అపోలో ఆస్పత్రికి స్టాలిన్ తరలింపు
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు
-
Jul 21, 2025 12:53 IST
అమరావతి: ఏపీ డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు కీలక బాధ్యతలు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు
ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ విజయానంద్
-
Jul 21, 2025 12:51 IST
పల్నాడు: జగన్ రెంటపాళ్ళ పర్యటన కేసు
నిబంధనలు ఉల్లంఘించి జగన్ టూర్‌లో పాల్గొన్న వైసీపీ నేతలు
ఆంక్షలు ఉల్లంఘించిన నేతలపై సత్తెనపల్లి పీఎస్‌లో కేసులు
వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేసిన పోలీసులు
సత్తెనపల్లి రూరల్ పీఎస్‌లో విచారణకు హాజరైన విడదల రజిని, అంబటి
-
Jul 21, 2025 12:34 IST
పార్లమెంట్‌లో నన్ను మాట్లాడనివ్వడం లేదు: రాహుల్ గాంధీ
సభలో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు: రాహుల్‌గాంధీ
సభలో విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి: రాహుల్ గాంధీ
ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు సిద్ధమా?: ప్రియాంక గాంధీ
చర్చకు సిద్ధంగా ఉంటే మాకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు?: ప్రియాంక
-
Jul 21, 2025 12:23 IST
లోక్‌సభలో గందరగోళం
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు విపక్షాలు పట్టు
విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ వాయిదా వేసిన స్పీకర్
లోక్‌సభ మ.2 గంటల వరకు వాయిదా
-
Jul 21, 2025 12:12 IST
నంద్యాల: పోలీసుల అదుపులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడు
పోలీసుల అదుపులో వైసీపీ బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి
పలు కేసుల్లో డోన్ డిఎస్పీ ఆఫీసు లో కాటసాని ఓబుల్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులు.
-
Jul 21, 2025 11:41 IST
అంతర్జాతీయ వేదికపై కోనేరు హంపి మరింత ప్రకాశించాలి: చంద్రబాబు
ఫిడె మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కు చేరిన...
మొదటి భారత మహిళగా కోనేరు హంపి అరుదైన రికార్డు: చంద్రబాబు
హంపి విజయం హర్షణీయం.. అందరికీ స్ఫూర్తివంతం: చంద్రబాబు
చెస్‌బోర్డుపై మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా: చంద్రబాబు
-
Jul 21, 2025 11:23 IST
అజ్ఞాతంలోకి మాజీ మంత్రి పేర్ని నాని
ఇటీవల పామర్రులో రప్పా రప్పా అని చెప్పడంకాదు... రాత్రికి రాత్రి చేసేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని
దీనిపై వివిధ పోలీస్టేషన్ లో నానిపై కేసులు నమోదు
ముందస్తు బెయిల్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన పేర్ని నాని
ఈనెల 22న ఈ పిటిషన్ పై విచారణ చేస్తామన్న హైకోర్టు
హైకోర్టులో ముందస్తు రక్షణ దక్కక పోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన పేర్ని నాని
ఆయనకోసం గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బృందాలు
ఈనెల 22న హైకోర్టు విచారణ తరువాత పేర్ని నాని వెలుగులోకి వస్తారంటున్న వైసీపీ నేతలు
-
Jul 21, 2025 11:10 IST
విశాఖపట్నంలో ఘరానా మోసం
అధిక వడ్డీ ఆశ చూపి రూ.100 కోట్ల మోసం
బోర్డు తిప్పేసిన మ్యాక్స్ సంస్థ, పరారీలో శివభాగ్యరావు
స్నేహ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో..
ప్రభుత్వ ఉద్యోగుల నుంచి 12 శాతం వడ్డీ హామీతో డిపాజిట్లు సేకరణ
2,500 మంది నుంచి రూ.100 కోట్లు సేకరించిన రిటైర్డ్ IRS శివభాగ్యరావు
మ్యాక్స్ సంస్థపై దువ్వాడ పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు
-
Jul 21, 2025 11:08 IST
కూటమి పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడినపడింది: హోంమంత్రి
ఇప్పుడు రాయలసీమకు కూడా పెట్టుబడులు వస్తున్నాయి: అనిత
గతంలో వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది: అనిత
గతంలో కియా పరిశ్రమల ప్రతినిధులను వైసీపీ నేతలు బెదిరించారు
ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలి కదా: హోంమంత్రి
కోర్టుకు సరైన ఆధారాలు ఇస్తే రిమాండ్‌కు ఇవ్వరు కదా
ఆధారాలు ఉంటేనే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు: హోంమంత్రి
ప్రొసీజర్ యథావిధిగా సాగుతోంది: హోంమంత్రి అనిత
రెండురోజుల్లో గండికోట ఘటనలో నిజాలు బయటకు వస్తాయి: అనిత
అందరూ సామాజిక స్పృహతో వ్యవహరించడం అవసరం: హోంమంత్రి
మూవీస్‌లోనూ ఇటీవల కొంత క్రైమ్ ఎక్కువగా కనిపిస్తుంది: అనిత
-
Jul 21, 2025 11:07 IST
నక్సల్స్ ముక్తి భారత్ దిశగా పనిచేస్తున్నాం: ప్రధాని మోడీ
నక్సలిజాన్ని అంతం చేయడమే మా లక్ష్యం: ప్రధాని మోడీ
వందలాది జిల్లాలు నక్సలిజం నుంచి విముక్తి పొందాయి: మోడీ
అపరేషన్ సిందూర్‌లో మన దేశ సైనికుల సత్తా చూశాం: ప్రధాని
దేశ్వవ్యాప్తంగా బాగా వర్షాలు పడుతున్నాయి: ప్రధాని మోడీ
వర్షాల వల్ల రైతులకు ఎంతో లాభదాయకం: ప్రధాని మోడీ
రైతుల జీవితాలు, ఆర్థిక వ్యవస్థ వర్షాలపై ఆధారపడ్డాయి: మోడీ
-
Jul 21, 2025 10:45 IST
రాజమండ్రి సెంట్రల్ జైలులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
మద్యం కేసులో సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మిథున్ రెడ్డి
జైలులో స్నేహ బ్లాక్‌లో మిథున్ రెడ్డిని ఉంచిన జైలు అధికారులు
రిమాండ్ ఖైదీగా నెంబర్ 4196 మిథున్ రెడ్డికి కేటాయింపు
-
Jul 21, 2025 10:44 IST
ముంబై ట్రైన్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు
మొత్తం 12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు
విచారణ సమయంలోనే ఒకరు మృతి..
జైలు నుంచి విడుదల కానున్న మిగతా 12 మంది నిందితులు
నేర నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న హైకోర్టు
2006లో సంచలనం సృష్టించిన ముంబై ట్రైన్ల వరుస పేలుళ్లు
ముంబై ట్రైన్ పేలుళ్లలో 189 మంది మృతి
-
Jul 21, 2025 10:29 IST
తిరుపతి: తుడాలో నిధుల గోల్‌మాల్‌పై విజిలెన్స్ నివేదిక
చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి అవినీతిపై 4300 పేజీలతో విజిలెన్స్ నివేదిక
ప్రభుత్వ ఆదేశాలతో కేసు నమోదుకు రంగం సిద్ధం
-
Jul 21, 2025 10:10 IST
కాకినాడ: మెడికవర్ హాస్పిటల్ నుంచి...
ముద్రగడను హైదరాబాద్‌కు తరలిస్తున్న కుటుంబసభ్యులు
మధురపూడి ఎయిర్‌పోర్ట్ నుంచి ఎయిర్‌బస్సులో...
హైదరాబాద్‌కు ముద్రగడను తరలించేందుకు ఏర్పాట్లు
ఆసుపత్రి నుంచి కిర్లంపూడి వెళ్లి తర్వాత మధురపూడికి వెళ్లే అవకాశం
-
Jul 21, 2025 09:27 IST
జార్ఖండ్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం హేమంత్ సోరేన్ లేఖ
యాంటీ నక్సల్ ఆపరేషన్ బకాయిలు మాఫీ చేయాలని హేమంత్ సోరేన్ లేఖ
CRPF మోహరింపునకు జార్ఖండ్ వాటా రూ.13,300 కోట్ల బకాయిలు మాఫీకి వినతి
-
Jul 21, 2025 09:25 IST
స.హ.చట్టం కమిషన్‌లో బీసీలు, ఎస్టీలకు చోటు లేదా?: కవిత
ఇప్పటికే నియమించిన చీఫ్ కమిషనర్, నలుగురు కమిషనర్లలో...
ఒక్కరు కూడా ఎస్టీ, బీసీలు లేరు: ఎమ్మెల్సీ కవిత
మరో ముగ్గురు కమిషనర్ల నియామకాల ప్రతిపాదనల్లోనూ...
బీసీలు, ఎస్టీలకు అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది: ఎమ్మెల్సీ కవిత
పెండింగ్‌లో ఉన్న కమిషనర్ల పోస్టులను...
బీసీలు, ఎస్టీలతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం: కవిత
-
Jul 21, 2025 09:23 IST
మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు!
మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వాలని మాజీ మంత్రి నారాయణ స్వామికి సిట్ నోటీసులు
నేడు సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని సూచన
అనారోగ్యం, వ్యక్తిగత కారణాల వల్ల నేడు రాలేక పోతున్నట్లు సిట్ అధికారులకు సమాచారం పంపిన నారాయణ స్వామి
వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణ స్వామి
ఆయన ప్రమేయం లేకుండానే నాడు నూతన మద్యం పాలసీని రూపొందించి అమలు చేసిన వైసీపీ కీలక నేతలు
-
Jul 21, 2025 09:18 IST
ఛత్తీస్‌గఢ్: మావోయిస్ట్ ఆపరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న...
భద్రతా బలగాల సోషల్ మీడియా ఖాతాలు తొలగింపు
బస్తర్ డివిజన్‌లోని 7 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో అంక్షలు అమలు
గోప్యత, భద్రతా సమస్యల దృష్ట్యా పారా మిలటరీ బలగాలు...
సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అధికారుల ఆదేశాలు
ప్రతి ఆపరేషన్ తర్వాత భద్రతా బలగాల ఫోన్లు తనిఖీలు నిర్వహణ
భద్రత బలగాల మొబైల్స్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, రికార్డింగ్‌పై నిషేధం
కీలక ఆపరేషన్ డాటా సోషల్ మీడియా ద్వారా లీక్ అవడం వల్ల నిర్ణయం
-
Jul 21, 2025 09:09 IST
హైకోర్టుకు మిథున్ రెడ్డి.. బెయిల్ కోసం పిటిషన్
మిథున్ రెడ్డికి బెయిల్ కోరుతూ ఇవాళ పిటిషన్ వేయనున్న న్యాయవాదులు
పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కోరే అవకాశం
నిన్న రిమాండ్ సందర్భంలో తనకు ECGలో తేడా ఉందని చెప్పిన మిథున్ రెడ్డి
-
Jul 21, 2025 09:08 IST
అమరావతి: మిథున్ రెడ్డి కస్టడీ కోరుతూ ఇవాళ పిటిషన్ వేయనున్న సిట్
వారంరోజుల కస్టడీ కోరుతూ ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్
మద్యం స్కామ్ కేసులో అరెస్టయిన ఎంపీ మిథున్ రెడ్డి
హైకోర్టులో ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా...
మిథున్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందన్న సిట్ అధికారులు
ఇదే అంశాన్ని తమ తీర్పులో స్పష్టం చేసిన హైకోర్టు
-
Jul 21, 2025 08:39 IST
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీం ఏం చెప్పబోతోంది?
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై నేడు సుప్రీంలో విచారణ
అవినాష్ తో పాటు పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు
తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన సీబిఐ , సునీత
జస్టిస్ ఎం ఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు నేడు విచారణ
-
Jul 21, 2025 08:11 IST
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
రాహుల్‌తో భేటీ.. అనంతరం ప్రధాని మోడీతో భేటీ..
రిజర్వేషన్ల పెంపు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ప్రధాని మోడీతో చర్చ!
స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అంతర్గత విషయాలపై అధిష్టానంతో చర్చించనున్న సీఎం..
రెండు, మూడు రోజులు హస్తిన పర్యటనలో సీఎం ఉండనున్నట్లు సమాచారం...
-
Jul 21, 2025 07:49 IST
హైదరాబాద్: నేడు కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట సీఎం కీలక వీడియో కాన్ఫరెన్స్
స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సీఎం సూచనలు చేసే అవకాశం
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వాటి స్టేటస్‌పై సమీక్ష
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం దిశా నిర్దేశం
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఎలాంటి ఆటంకం లేకుండా...
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ కొనసాగింపుపై సూచనలు
-
Jul 21, 2025 07:44 IST
ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
11.15 గంటలకు సచివాలయానికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు
11.30 గంటలకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ పాలసీపై సమీక్ష.
12.15 గంటలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై సమీక్ష.
సాయంత్రం 06.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు.
-
Jul 21, 2025 06:54 IST
ఇవాళ ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారి హస్తినకు రామచందర్ రావు.
జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాతో భేటీ.
కేంద్ర మంత్రి బండి సంజయ్ , ఎంపీ ఈటెల రాజేందర్ ల మధ్య వివాదంపై అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్న రామచందర్.
ఇప్పటికే ఢిల్లీ పెద్దల దృష్టికి చేరిన ఇద్దరు నేతల మధ్య వివాదం.
వీటితో పాటు రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీ నిర్మాణం తాజా రాజకీయ పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వనున్న స్టేట్ ప్రెసిడెంట్.
-
Jul 21, 2025 06:15 IST
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
ఆగస్టు 21 వరకు కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాలు
8 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు
పహల్గామ్ దాడి, ట్రంప్ మధ్యవర్తిత్వంపై చర్చకు విపక్షాల పట్టు
ఆపరేషన్ సింధూర్‌పై చర్చకు సిద్ధమన్న కేంద్రం
-
Jul 21, 2025 05:51 IST
దేశంలో వరుస భూకంపాలు..
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వోర్‌లో భూకంపం
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదు
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం
సుబన్‌సిరి ఎగువ ప్రాంతంలో భూప్రకంపనలు
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4గా నమోదు
అలాస్కాలో భూకంపం, తీవ్రత 6.2గా నమోదు
తజికిస్థాన్‌లో భూకంపం
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదు