-
-
Home » Mukhyaamshalu » Friday 25th July 2025 Live Updates and latest Breaking News Top news and Major Events Across India siva
-

BREAKING: HCA అక్రమాల కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు
ABN , First Publish Date - Jul 25 , 2025 | 06:33 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 25, 2025 19:32 IST
హైకోర్ట్ సంచలన నిర్ణయం..
HCA పర్యవేక్షణకు జస్టిస్ నవీన్‌రావు నియామకం
రిటైర్డ్ జస్టిస్ నవీన్‌రావును నియమించిన హైకోర్టు
-
Jul 25, 2025 19:32 IST
వెలుగులోకి HCA మరో స్కామ్
కీలక ఆధారాలు సేకరించిన CID అధికారులు
సమ్మర్ క్యాంప్‌ల పేరుతో రూ.4 కోట్లు కాజేసిన HCA ప్రెసిడెంట్ జగన్మోహన్‌రావు అండ్ కో
గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సమ్మర్ క్యాంప్‌లు నిర్వహణ
ప్రతీ క్యాంప్‌లో 100 మందికి చొప్పున 2,500 మందికి పైగా క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు
-
Jul 25, 2025 19:13 IST
HCA అక్రమాల కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు
ట్రెజరర్ శ్రీనివాస్, సెక్రటరీ రాజేంద్ర యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవితకు బెయిల్
జగన్మోహన్‌రావును మరోసారి కస్టడీకి ఇవ్వాలని CID పిటిషన్
CID పిటిషన్‌ను కొట్టివేసిన మల్కాజ్‌గిరి కోర్టు
జగన్మోహన్‌రావు, సునీల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు
-
Jul 25, 2025 19:13 IST
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పొన్నం
బీజేపీ నేతలు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా బీసీ నేతకు ఇవ్వలేదు
బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు: మంత్రి పొన్నం
బీజేపీ నేతలకు సొంతంగా గెలిచి శక్తి లేదు: మంత్రి పొన్నం
బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై గెలుస్తున్నారు: మంత్రి పొన్నం
-
Jul 25, 2025 19:11 IST
తెలంగాణలో 10 జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం
భారీ వర్షాలు, వరదలపై చీఫ్ సెక్రటరీ సమీక్ష
స్పెషల్ ఆఫీసర్లుగా సీనియర్ ఐఏఎస్‌లకు బాధ్యతలు
హైదరాబాద్- ఇలంబర్తి, ఉమ్మడి ఆదిలాబాద్- హరికిరణ్
ఉమ్మడి కరీంనగర్- సర్పరాజ్ అహ్మద్
ఉమ్మడి నల్లగొండ- అనితా రామచంద్రన్
ఉమ్మడి రంగారెడ్డి- డి. దివ్య
ఉమ్మడి మహబూబ్‌నగర్- జి. రవి
ఉమ్మడి వరంగల్- కె.శశాంక, ఉమ్మడి మెదక్- ఏ.శరత్
ఉమ్మడి ఖమ్మం- సురేంద్రమోహన్
-
Jul 25, 2025 18:01 IST
రేపు బీఆర్ఎస్, జాగృతి పోటాపోటీ కార్యక్రమాలు
రేపు కేటీఆర్ ముఖ్య అతిథిగా BRS విద్యార్థి విభాగం రాష్ట్రస్థాయి సదస్సు
కవిత ఆధ్వర్యంలో రేపు తెలంగాణ జాగృతి ‘‘లీడర్’’ శిక్షణ ప్రారంభం
నాచారంలో VNR కన్వెన్షన్‌లో సమావేశానికి BRS ఏర్పాట్లు
BRSV సమావేశంలో ప్రధాన వక్తలుగా పాల్గొననున్న కేటీఆర్, హరీష్‌రావు
-
Jul 25, 2025 18:01 IST
ఎంపీ మిథున్‌రెడ్డికి జైల్లో సౌకర్యాలపై జైళ్ల శాఖ పిటిషన్‌పై విచారణ
మిథున్‌రెడ్డికి అటెండర్ సౌకర్యం కల్పించలేమని జైళ్ల శాఖ పిటిషన్
ఇంటి భోజనం అనుమతించలేమని తేల్చిచెప్పిన జైళ్ల శాఖ
కౌంటర్ దాఖలు చేయాలని మిథున్‌రెడ్డికి ACB కోర్టు ఆదేశం
విజయవాడ: తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా
-
Jul 25, 2025 16:18 IST
MLC అనంతబాబుకు ఏపీ హైకోర్టులో దక్కని ఊరట
కేసు పునర్విచారణ చేయాలని రాజమండ్రి కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
హైకోర్టు స్టేకు నిరాకరించడంతో పునర్విచారణకు తొలగిన అడ్డంకులు
డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన MLA అనంతబాబు
-
Jul 25, 2025 15:31 IST
కార్పొరేట్ ఇండియాలో OBCలు ఎక్కడున్నారు?: రాహుల్‌గాంధీ
అదానీ OBCనా?: రాహుల్‌గాంధీ
మీడియా రంగంలో OBCలకు స్థానం ఎక్కడుంది?: రాహుల్‌గాంధీ
అభివృద్ధిలో విద్యదే కీలకపాత్ర: రాహుల్‌గాంధీ
ఇంగ్లీషు నేర్చుకుంటే అవకాశాలు రెట్టింపు అవుతాయి: రాహుల్‌గాంధీ
బీజేపీ నేతలు మాత్రం ఇంగ్లీషును వ్యతిరేకిస్తున్నారు: రాహుల్‌గాంధీ
ప్రాంతీయ భాషలు ముఖ్యమే.. ఇంగ్లీషూ ముఖ్యమే: రాహుల్‌గాంధీ
ప్రైవేట్ సంస్థల్లోనూ రిజర్వేషన్లు తీసుకురావాలి: రాహుల్‌గాంధీ
-
Jul 25, 2025 15:31 IST
అవకాశాలు అందిపుచ్చుకునే సామర్థ్యం అందరికీ రావాలి: రాహుల్‌గాంధీ
తమ శక్తిని తెలుసుకోలేకపోవడమే కొందరి సమస్య: రాహుల్‌గాంధీ
దేశంలో దళితుల చరిత్రను అంబేద్కర్ అర్థం చేసుకున్నారు: రాహుల్‌గాంధీ
దేశ ఉత్పాదక శక్తికి OBCలు ప్రతీకలు: రాహుల్‌గాంధీ
OBCల చరిత్ర ఎక్కడుంది.. ఎవరు రాశారు?: రాహుల్‌గాంధీ
OBCల చరిత్ర రాయకపోవడం వెనుక RSS కుట్ర ఉంది: రాహుల్‌గాంధీ
OBCలు అన్నిరంగాల్లో వివక్ష ఎదుర్కొంటున్నారు: రాహుల్‌గాంధీ
-
Jul 25, 2025 15:31 IST
తెలంగాణ కులగణన దేశానికి రోల్‌మోడల్: రాహుల్‌గాంధీ
దేశవ్యాప్తంగా కులగణన చేసేవరకు విశ్రమించేది లేదు: రాహుల్‌గాంధీ
ఇది నా శపథం.. కావాలంటే ప్రియాంకా గాంధీని అడగండి: రాహుల్
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకపోవడం తప్పు
ఆ తప్పును సరిదిద్దుతున్నాం: రాహుల్‌గాంధీ
-
Jul 25, 2025 15:31 IST
మాల్దీవుల పర్యటనలో ప్రధాని మోదీ
రాజధాని మాలేలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
మోదీకి స్వాగతం పలికిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు
-
Jul 25, 2025 15:29 IST
హైదరాబాద్: GHMC కూల్చివేతలను అడ్డుకున్న ఇంటి యజమాని
తన జోలికి వస్తే అడ్డంగా నరికేస్తానంటూ టౌన్ ప్లానింగ్ అధికారులకు బెదిరింపు
రోడ్డు ఆక్రమణ చేసి ప్రహారీ నిర్మాణం చేస్తున్నట్లు ఫిర్యాదు
పరిశీలనకు వచ్చిన సర్కిల్ 18 టౌన్ ప్లానింగ్ సిబ్బంది
కారులో నుంచి కత్తి తీసి నరికేస్తా అంటూ బెదిరింపులు
బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఘటన
-
Jul 25, 2025 15:29 IST
తెలంగాణలో పీజీ లాసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
ఈనెల 26న పీజీ లాసెట్ అడ్మిషన్ల నోటిఫికేషన్
ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు
సెప్టెంబర్ 3, 4 తేదీల్లో వెబ్ ఆప్షన్లు
సెప్టెంబర్ 8న సీట్ల కేటాయింపు
సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు సెల్ప్ రిపోర్టింగ్‌కు అవకాశం
-
Jul 25, 2025 13:45 IST
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్షం భేటీ
అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో స్పీకర్ ఓం బిర్లా సమావేశం
లోక్‌సభలో ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రయత్నాలు
బిహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాల పట్టు
సోమవారం నుంచి యథావిధిగా సభా కార్యకలాపాలు
అఖిలపక్ష సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయం
-
Jul 25, 2025 12:54 IST
విశాఖ మెట్రో రైలు కుటెండర్లు పిలిచిన ప్రభుత్వం
కొద్దిసేపటి క్రితం టెండర్ షెడ్యూల్ విడుదల చేసిన అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్
విశాఖలో మూడు కారిడార్లలో 46.23 కిలోమీటర్లు మెట్రోకు టెండర్లు
11 వేల 498 కోట్ల రూపాయలతో టెండర్లు
విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34 కిలోమీటర్లు తో మొదటి కారిడార్
గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5 కిలోమీటర్లు తో రెండవ కారిడార్
తాడిచెట్ల పాలెం నుంచి చిన వాల్తేరు వరకు 7 కిలోమీటర్లు తో మూడవ కారిడార్
మొత్తం ఈ మూడు కారిడార్లలో 42 స్టేషన్లు నిర్మాణం చేయాలని పేర్కొన AMRC
మూడు ఏళ్లలో పూర్తి చేయాలని టెండర్ షెడ్యూల్
-
Jul 25, 2025 12:45 IST
విభజన హామీల్లో కేంద్రం ఎన్ని అమలు చేసింది?: షర్మిల
ఏపీ ఎంపీలంతా బీజేపీ సభ్యుల్లా వ్యవహరిస్తున్నారు: షర్మిల
బీజేపీ బిల్లులకు ఏపీ ఎంపీలు మద్దతు ఇస్తున్నారు: షర్మిల
మోదీ మెప్పు కోసం ఏపీ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు
11 ఏళ్లుగా ఏపీకి మోదీ ఏం చేశారో చెప్పాలి: షర్మిల
మోదీతో జగన్ అక్రమ పొత్తు, చంద్రబాబు బహిరంగ పొత్తు
ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదు?: షర్మిల
పోలవరం 40 మీటర్ల ఎత్తకు తగ్గించినా అడగలేరా?: షర్మిల
R&R ప్యాకేజీ తగ్గించేందుకే పోలవరం ఎత్తు కుదించారు: షర్మిల
పోలవరం ఎత్తు 45 మీ. ఉండాలని మోదీపై ఒత్తిడి తేవాలి: షర్మిల
ఏపీ రాజధాని నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకోవాలి: షర్మిల
-
Jul 25, 2025 12:43 IST
RCB స్టార్ బౌలర్ యశ్ దయాళ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, రాజస్థాన్‌లో పోక్సో కేసు నమోదు
-
Jul 25, 2025 12:20 IST
కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ పెట్టింది: కిషన్‌రెడ్డి
బీసీలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది: కిషన్‌రెడ్డి
రిజర్వేషన్లు చెల్లవని ఇప్పటికే హైకోర్టు రెండుసార్లు తీర్పు ఇచ్చింది
సర్వేల పేరుతో బీసీ జనాభాను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు
అధికారంలోకి రాగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చారు..
ఏడాదిన్నరైనా ఇప్పటికీ రిజర్వేషన్లు అమలు చేయలేదు: కిషన్‌రెడ్డి
ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది: కిషన్‌రెడ్డి
రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ రిజర్వేషన్ల డ్రామా ఆడుతోంది: కిషన్‌రెడ్డి
ముస్లింలకు లబ్ధి చేకూరేలా బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి: కిషన్‌రెడ్డి
అసదుద్దీన్‌ను సంతృప్తి పరిచేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది
బీసీ రిజర్వేషన్లు పెరిగాయా? తగ్గాయా?: కిషన్‌రెడ్డి
ముస్లిం రిజర్వేషన్లను 4 నుంచి 10 శాతానికి పెంచుతున్నారు: కిషన్‌రెడ్డి
బీసీలకు అన్యాయం చేసేలా కాంగ్రెస్ చర్యలు ఉన్నాయి: కిషన్‌రెడ్డి
-
Jul 25, 2025 12:17 IST
రాజ్యసభ సోమవారానికి వాయిదా
బిహార్‌లో ఓటర్ జాబితా సవరణపై చర్చకు విపక్షాల పట్టు
విపక్ష సభ్యల ఆందోళనల మధ్య సభ సోమవారానికి వాయిదా
-
Jul 25, 2025 11:31 IST
ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధం
ROగా రాజ్యసభ సెక్రటరీ జనరల్
AROలుగా గరీమా జైన్, విజయ్‌కుమార్
ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల
-
Jul 25, 2025 11:14 IST
ఢిల్లీ: లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా
విపక్ష సభ్యుల ఆందోళనల నడుమ లోక్‌సభ వాయిదా
-
Jul 25, 2025 11:08 IST
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు పిటిషన్లు కొట్టివేసిన సుప్రీంకోర్టు
తీర్పు వెల్లడించిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం
ఆర్టికల్ 170(3) ప్రకారం ఏపీ విభజన చట్టంలో..
సెక్షన్ 26కి పరిమితి ఉందని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తీర్పు
2026 జనాభా లెక్కల తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది: సుప్రీంకోర్టు
ఏపీ, తెలంగాణ పునర్విభజన నోటిఫికేషన్ నుంచి మినహాయింపులో..
ఎలాంటి వివక్ష లేదని, రాజ్యాంగ ఉల్లంఘన కాదన్న సుప్రీం ధర్మాసనం
-
Jul 25, 2025 11:08 IST
ఢిల్లీ: DMK రాజ్యసభ సభ్యుడిగా కమల్‌హాసన్ ప్రమాణస్వీకారం
తమిళంలో ప్రమాణస్వీకారం చేసిన నటుడు కమల్‌హాసన్
-
Jul 25, 2025 10:46 IST
OMC కేసులో IAS శ్రీలక్ష్మి పిటిషన్ డిస్మిస్ చేసిన తెలంగాణ హైకోర్టు
OMC కేసులో శ్రీలక్ష్మి నిందితురాలేనని తెలంగాణ హైకోర్టు తీర్పు
శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన తెలంగాణ హైకోర్టు
సీబీఐ, ప్రతివాదుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న టీజీ హైకోర్టు
శ్రీలక్ష్మి వ్యవహారంలో టీజీ హైకోర్టు తీర్పుతో సీబీఐ కోర్టులో జరగనున్న ట్రయల్
-
Jul 25, 2025 10:32 IST
హైదరాబాద్: చిలుకూరు మృగవని పార్క్‌లో చిరుత సంచారం
అటవీశాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు గుర్తింపు
ఇప్పటికే జింకలపార్క్‌లో రెండు బోన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు
-
Jul 25, 2025 07:49 IST
సీఎం రేవంత్ అధ్యక్షతన సా.4 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దగ్గర పెండింగ్‌లో ఉన్న..
బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ భవిష్యత్ కార్యాచరణపై చర్చ
గిగ్ వర్కర్లు, గోశాల పాలసీలు సహా..
కులగణనపై నిపుణుల కమిటీ నివేదికకు ఆమోదం తెలపనున్న కేబినెట్
ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లకు అవసరమైన పోస్టుల మంజూరు..
రేషన్ కార్డుల జారీ మార్గదర్శకాలపై చర్చించనున్న తెలంగాణ కేబినెట్
-
Jul 25, 2025 07:48 IST
నెల్లూరు: నేడు పోలీస్ విచారణకు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
కోవూరు పీఎస్‌లో ప్రసన్నకుమార్‌రెడ్డిని ప్రశ్నించనున్న పోలీసులు
టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణ
ఇప్పటికే ప్రసన్నకుమార్‌రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరణ
రేపు విచారణకు రావాలని మాజీమంత్రి అనిల్‌కుమార్‌కు ఇప్పటికే నోటీసులు
-
Jul 25, 2025 07:45 IST
విజయవాడ, విశాఖ మెట్రో రైల్‌కు నేడు టెండర్లు
మెట్రో ప్రాజెక్టులో 40 శాతం పనులకు టెండర్లు
రూ.21,616 కోట్లతో విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు టెండర్లు
రూ.10,118 కోట్లతో విజయవాడ మెట్రో రైల్ టెండర్లు
రూ.11,498 కోట్లతో విశాఖ మెట్రో రైల్ టెండర్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50-50 భాగస్వామ్యంతో..
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణాలు
విశాఖ మెట్రో రైల్‌కు VMRDA నుంచి ప్రభుత్వ వాటా రూ.4,101 కోట్లు
విజయవాడ మెట్రోకు CRDA నుంచి ప్రభుత్వ వాటా రూ.3,497 కోట్లు
-
Jul 25, 2025 07:07 IST
మాంచెస్టర్ టెస్ట్: రెండోరోజు ముగిసిన ఆట
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్: 225/2
క్రీజులో ఓలీ పోప్ 20, జోరూట్ 11 పరుగులు
133 పరుగుల వెనుకంజలో ఇంగ్లండ్
భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 358 ఆలౌట్
-
Jul 25, 2025 07:06 IST
తెలంగాణ సర్కార్, సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ ప్రశంసలు
ఎక్స్‌లో షేర్ చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
త్యాగాలకు ప్రతీక సోనియా... తెలంగాణ సాధన కలను సాకారం చేశారు
సోనియా ప్రశంసా పత్రం విజయానికి సంతృప్తి శిఖరం: సీఎం రేవంత్ రెడ్డి
-
Jul 25, 2025 07:02 IST
నేడు కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటన
లింగంపేట్‌లో దళిత ఆత్మగౌరవ గర్జనకు హాజరు
అనంతరం దళిత నేత సాయిలు కుటుంబానికి పరామర్శ
సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఓ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు
-
Jul 25, 2025 07:02 IST
నేడు IAS శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు
గతంలో శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన CBI
OMC కేసులో శ్రీలక్ష్మి పాత్ర తేల్చాలని సుప్రీం ఆదేశం
సుప్రీం ఆదేశంతో విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు
నేడు తీర్పు వెల్లడించనున్న తెలంగాణ హైకోర్టు
-
Jul 25, 2025 06:37 IST
నేడు ఐదోరోజు పార్లమెంట్ సమావేశాలు
గత నాలుగు రోజులుగా పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన
బిహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చకు విపక్షాల పట్టు
-
Jul 25, 2025 06:36 IST
నేడు హైదరాబాద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
రేపు రాత్రి సింగపూర్ బయల్దేరనున్న చంద్రబాబు
6 రోజులపాటు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీలు
బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో పరిశ్రమలు తెచ్చేందుకు 6 రోజుల పర్యటన
-
Jul 25, 2025 06:33 IST
తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్,..
భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు వర్ష సూచన
రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వర్ష సూచన
-
Jul 25, 2025 06:33 IST
బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం
ఈనెల 27వరకు కోస్తాంధ్రలో భారీ వర్షాలు
నేడు మన్యం, అల్లూరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం,..
అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు
తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు
మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచన
-
Jul 25, 2025 06:33 IST
ఢిల్లీ: నేడు తల్కతోరా స్టేడియంలో కాంగ్రెస్ ఓబీసీ సమావేశం
సదస్సుకు హాజరుకావాలని సీఎం, బీసీ మంత్రులకు ఆహ్వానం