Share News

Breaking News: AP EAPCET ఫలితాలు విడుదల

ABN , First Publish Date - Jun 08 , 2025 | 08:29 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: AP EAPCET ఫలితాలు విడుదల
Breaking News

Live News & Update

  • Jun 08, 2025 21:11 IST

    మసూలా బీచ్ ఫెస్టివల్.. నేటితో..

    • మచిలీపట్నం: నేటితో ముగియనున్న మసూలా బీచ్ ఫెస్టివల్

    • పర్యాటకులతో కిటకిటలాడుతున్న మంగినపూడి బీచ్

    • 4 రోజులుగా మసూలా బీచ్ ఫెస్టివల్‌కు పోటెత్తిన పర్యాటకులు

    • మంత్రి కొల్లు రవీంద్ర సారథ్యంలో విజయవంతంగా ఫెస్టివల్

  • Jun 08, 2025 21:11 IST

    ఇంటర్ విద్యార్థిని హత్య.. పోలీసులు ఏం చెప్పారంటే..

    • అనంతపురం: ఇంటర్‌ విద్యార్థిని తన్మయి హత్యపై పోలీసుల వివరణ

    • విద్యార్థిని అదృశ్యమైనట్లు ఈనెల 4న ఫిర్యాదు వచ్చింది: పోలీసులు

    • ఈనెల 3న యువకుడితో విద్యార్థిని వెళ్లినట్లు గుర్తించాం: పోలీసులు

    • అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం: పోలీసులు

    • విద్యార్థినికి ముగ్గురు యువకులతో పరిచయం ఉన్నట్లు సమాచారం

    • మరో ఇద్దరి కోసం గాలిస్తున్నాం: అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు

    • విద్యార్థిని తలపై బీర్‌ బాటిల్‌తో కొట్టి హత్య చేశారు: పోలీసులు

  • Jun 08, 2025 21:11 IST

    నూతన నియామకాలు..

    • విశాఖ KGH సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ ఐ.వాణి నియామకం

    • అనంతపురం మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపల్‌గా KVV సత్యనారాయణ

    • టీటీడీ డీఎఫ్‌ఓగా డి.ఫణికుమార్‌ నాయుడు నియామకం

    • ఒంగోలు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా ఎస్‌.మాణిక్యరావు

    • కడప జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా KSS వెంకటేశ్వరరావు

    • విజయవాడ SMC ప్రిన్సిపల్‌గా ఎ.ఏడుకొండలరావు

    • ఒంగోలు GMC ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ పి.అశోక్‌కుమార్

  • Jun 08, 2025 21:08 IST

    MLA మల్‌రెడ్డి ఇంటికి మహేష్‌గౌడ్‌, మంత్రి పొన్నం

    • కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో మల్‌రెడ్డి అసంతృప్తి

    • మల్‌రెడ్డి రంగారెడ్డిని బుజ్జగించిన మహేష్‌గౌడ్‌, పొన్నం

    • సామాజిక సమతుల్యత పాటిస్తూ కేబినెట్‌ విస్తరణ: మహేష్‌గౌడ్‌

    • మరో 3 బెర్త్‌లు ఖాళీ ఉన్నాయి: టీపీసీసీ చీఫ్‌ మహేష్‌గౌడ్‌

    • మల్‌రెడ్డి రంగారెడ్డికి వాస్తవాలు వివరించాం: మహేష్‌గౌడ్‌

    • మల్‌రెడ్డి రంగారెడ్డి ఆవేదన సమంజసమే: మహేష్‌గౌడ్‌

    • భవిష్యత్‌లో న్యాయం జరిగేలా చూస్తాం: మహేష్‌గౌడ్‌

  • Jun 08, 2025 18:05 IST

    AP EAPCET ఫలితాలు విడుదల

    • ఇంజినీరింగ్‌ విభాగంలో 1.89 లక్షల మంది ఉత్తీర్ణత

    • అగ్రి, ఫార్మసీ విభాగంలో 67,761 మంది ఉత్తీర్ణత

    • ఇంజినీరింగ్‌ విభాగంలో మొదటి ర్యాంక్‌- అనిరుధ్‌ రెడ్డి(హైదరాబాద్‌)

    • ఇంజినీరింగ్‌ విభాగంలో రెండో ర్యాంక్‌- భానుచరణ్‌ రెడ్డి(శ్రీకాళహస్తి)

    • ఇంజినీరింగ్‌ విభాగంలో మూడో ర్యాంక్‌- యశ్వంత్‌(పాలకొల్లు)

    • అగ్రి, ఫార్మా విభాగంలో మొదటి ర్యాంక్‌- వెంకట నాగసాయి(పెనమలూరు)

    • అగ్రి, ఫార్మా విభాగంలో రెండో ర్యాంక్‌- షన్ముఖ నిశాంత్‌(చందానగర్‌, రంగారెడ్డి)

    • అగ్రి, ఫార్మా విభాగంలో మూడో ర్యాంక్‌- వినయ్‌ మల్లేష్‌ (ఆలమూరు, కోనసీమ)

    • ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    • https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx

  • Jun 08, 2025 16:57 IST

    అనుచిత వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్ సీరియస్..

    • అమరావతిపై వ్యాఖ్యలతో మహిళలను అవమానించారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • రాజధానిపై కుట్రలు చేసేవారిపై చర్యలు తప్పవు: పవన్‌

    • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: పవన్‌కల్యాణ్‌

    • జర్నలిస్ట్ ముసుగులో అనుచిత వ్యాఖ్యలు దారుణం: పవన్‌కల్యాణ్‌

    • వ్యాఖ్యలపై ప్రజలు, అధికారులు విశ్లేషించాలి: పవన్‌కల్యాణ్‌

    • సాక్షి ఛానల్‌ కూడా ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది: పవన్‌

    • కుల ముద్రలు వేసి మహిళలను అవమానిస్తున్నారు: పవన్‌

  • Jun 08, 2025 15:41 IST

    తెలుగు మహిళల ఆందోళన..

    • కృష్ణా: గుడివాడలో తెలుగు మహిళల ఆందోళన

    • సాక్షి దినపత్రిక ప్రతులను దగ్ధం చేసిన మహిళలు

    • మహిళలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలపై నిరసన

    • మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు

  • Jun 08, 2025 11:53 IST

    జూబ్లీహిల్స్: మాగంటి గోపీనాథ్ నివాసానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

    • గోపీనాథ్ పార్థివదేహానికి నివాళులర్పించిన కేసీఆర్

    • గోపీనాథ్ కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్

  • Jun 08, 2025 11:49 IST

    కేబినెట్ విస్తరణపై ఎక్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పోస్ట్

    • వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌, వాకిటి శ్రీహరికి అభినందనలు.

    • అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న.. రామచంద్రునాయక్‌కు అభినందనలు.

  • Jun 08, 2025 11:36 IST

    అమరావతి: జర్నలిస్టు కృష్ణంరాజుపై రాజధాని రైతులు ఆగ్రహం

    • సాక్షి చానల్‌లో కృష్ణంరాజు నీచంగా మాట్లాడారు: రాజధాని రైతులు

    • అసభ్యవ్యాఖ్యలను సాక్షి యాజమాన్యం కనీసం ఖండించలేదు

    • సాక్షి యాజమాన్యం, కొమ్మినేని, కృష్ణంరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశాం

    • ఇవాళ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేస్తాం: రాజధాని రైతులు

    • ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి: రాజధాని రైతులు

  • Jun 08, 2025 11:36 IST

    కాసేపట్లో తెలంగాణ కేబినెట్ విస్తరణ

    • మంత్రులుగా ప్రమాణం చేయనున్న..

    • గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి

    • రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

    • ఇప్పటికే రాజ్‌భవన్‌కు చేరుకున్న వాకిటి శ్రీహరి

  • Jun 08, 2025 08:32 IST

    ఏఐజీ ఆస్పత్రి నుంచి గోపీనాథ్‌ పార్థివదేహం తరలింపు

    • మాదాపూర్‌లోని నివాసానికి భౌతికకాయం తరలింపు

  • Jun 08, 2025 08:32 IST

    హైదరాబాద్: ఏఐజీ ఆస్పత్రికి కేటీఆర్, హరీష్‌రావు

    • మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు పరామర్శ

  • Jun 08, 2025 08:31 IST

    మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ విస్తరణ

    • మధ్యాహ్నం కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం.

    • కాసేపట్లో రాజ్‌భవన్‌కు కొత్త మంత్రుల జాబితా.

    • కేబినెట్‌లో కొత్తగా ముగ్గురికి చోటు.

    • గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారు.

    • రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు.

  • Jun 08, 2025 08:31 IST

    మాగంటి గోపీనాథ్ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

    • మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరం.

    • గోపీనాథ్ రాజకీయ ప్రయాణం టీడీపీతో ప్రారంభమైంది.

    • గోపీనాథ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

  • Jun 08, 2025 08:30 IST

    మాగంటి గోపీనాథ్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం

    • సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు

    • సంతాపం తెలిపిన కేసీఆర్, కిషన్‌రెడ్డి, మహేష్‌గౌడ్, తుమ్మల

    • సంతాపం తెలిపిన కేటీఆర్, హరీష్‌రావు, కవిత, రావుల

  • Jun 08, 2025 08:30 IST

    మాగంటి గోపీనాథ్ మృతిపట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

    • మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు.

    • గోపీనాథ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.

  • Jun 08, 2025 08:30 IST

    • మాగంటి గోపీనాథ్ మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

    • గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం

  • Jun 08, 2025 08:29 IST

    జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత

    • ఉ.5:45కు తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్

    • ఈనెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన మాగంటి

    • టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం

    • మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్

    • 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్

    • 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక

    • పలు సినిమాలకు నిర్మాతగా పనిచేసిన మాగంటి గోపీనాథ్

    maganti-gopinadh.jpg