Share News

Breaking News: డీఎస్సీ పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - Jun 14 , 2025 | 08:08 AM

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: డీఎస్సీ పరీక్షలు వాయిదా
Breaking News

Live News & Update

  • Jun 14, 2025 20:27 IST

    డీఎస్సీ పరీక్షలు వాయిదా

    • ఈ నెల 20, 21న జరగాల్సిన ఏపీ డీఎస్సీ నియామక పరీక్షలు వాయిదా

    • జులై 1, 2 తేదీల్లో డీఎస్సీ నియామక పరీక్షలు

    • యోగాంధ్ర కార్యక్రమం నేపథ్యంలో పరీక్షలు వాయిదా

  • Jun 14, 2025 20:27 IST

    సీఎం చంద్రబాబు సమీక్ష..

    • IVRS ప్రజాభిప్రాయ సేకరణపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

    • అవినీతిని సహించేది లేదు.. రుజువైతే చర్యలు: చంద్రబాబు

    • ఆరోపణలు వస్తే తక్షణ విచారణ: సీఎం చంద్రబాబు

    • జీరో కరెప్షన్‌ ఏపీ లక్ష్యం: సీఎం చంద్రబాబు

  • Jun 14, 2025 20:14 IST

    పరామర్శ పేరుతో రాజకీయాలు: నక్కా ఆనందబాబు

    • రైతుల పరామర్శ పేరుతో జగన్ రాజకీయాలు: నక్కా ఆనందబాబు

    • పొదిలిలో రైతుల పేరుతో జగన్‌ నానా యాగీ చేశారు: ఆనందబాబు

    • సంఘ విద్రోహ శక్తులతో రైతుల పరామర్శకు వెళ్తారా?: ఆనందబాబు

    • నిరసన తెలిపిన మహిళలపై జగన్ దాడి చేయించారు: ఆనందబాబు

    • రౌడీ రాజకీయాలు చేస్తే సహించేదిలేదు: నక్కా ఆనందబాబు

  • Jun 14, 2025 20:14 IST

    సమావేశం వాయిదా..

    • రేపు సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల సమావేశం వాయిదా

    • షూటింగ్స్‌ కారణంగా సమావేశం వాయిదా పడినట్లు వెల్లడి

    • ముఖ్యమైన సినీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో వాయిదా

  • Jun 14, 2025 18:46 IST

    నీట్‌ యూజీ ఫలితాలు విడుదల

    • నీట్‌ ఫలితాల్లో ఏపీ నుంచి 36,776 మంది అర్హత

    • నీట్‌ ఫలితాల్లో తెలంగాణ నుంచి 41,584 మంది అర్హత

    • విద్యార్థులకు email ద్వారా స్కోర్‌ కార్డులు

    • మహేష్‌కుమార్‌ (రాజస్థాన్)- ఫస్ట్‌ ర్యాంక్‌

    • ఉత్కర్ష్‌ (మధ్యప్రదేశ్‌)- సెకండ్‌ ర్యాంక్‌

    • కృషంగ్ జోషి (మహారాష్ట్ర)- మూడో ర్యాంక్‌

    • కాకర్ల జీవన్‌ సాయికుమార్‌ (తెలంగాణ)- 18వ ర్యాంక్‌

    • దర్బా కార్తీక్‌రామ్‌ (ఏపీ)- 19వ ర్యాంక్‌

    • షణ్ముఖ నిశాంత్‌ (తెలంగాణ)- 37వ ర్యాంక్‌

    • మంగారి వరుణ్‌ (తెలంగాణ)- 46వ ర్యాంక్‌

    • యండ్రపాటి షణ్ముఖ్‌ (తెలంగాణ)- 48వ ర్యాంక్‌

    • మోహిత్‌ సాయిరామ్‌ (ఏపీ)- 56వ ర్యాంక్‌

    • దేశిన సూర్యచరణ్‌ (ఏపీ)- 59వ ర్యాంక్‌

    • పొదిలపు అవినాష్‌ (ఏపీ)- 64వ ర్యాంక్‌

    • యర్రా సమీర్‌కుమార్‌ (ఏపీ)- 70వ ర్యాంక్‌

    • తుమ్మూరి శివమణిదీప్‌ (ఏపీ)- 92వ ర్యాంక్‌

    • విదిష మాఝీ (తెలంగాణ)- 95వ ర్యాంక్‌

  • Jun 14, 2025 18:45 IST

    ABN కథనానికి స్పందన

    • చిత్తూరు: మామిడి రైతుల కష్టాలపై ABN కథనానికి స్పందన

    • దామలచెరువు, పల్లూరులో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన

    • మామిడి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్న మంత్రి అచ్చెన్న

    • మామిడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అచ్చెన్న హామీ

  • Jun 14, 2025 18:45 IST

    విశాఖ: CITU ఆఫీస్‌లో అఖిలపక్ష కార్మికసంఘాల సమావేశం

    • స్టీల్‌ప్లాంట్‌ విక్రయం జరగదని ప్రధాని ప్రకటన చేయాలి: CITU JAC

    • 4 వేలమంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి: CITU JAC

    • స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల దీక్షా శిబిరంపై పోలీస్‌ నిర్బంధం ఆపాలి: CITU

  • Jun 14, 2025 18:45 IST

    గతంలో 42 లక్షల మందికే 'అమ్మఒడి' ఇచ్చారు: మంత్రి నిమ్మల

    • 'తల్లికి వందనం' అమలుతో ఇంటింటా పండుగ వాతావరణం: నిమ్మల

    • కూటమి ప్రభుత్వం 67.27 లక్షలమందికి 'తల్లికి వందనం' ఇస్తోంది: నిమ్మల

    • ఈ నెలలోనే 'అన్నదాత సుఖీభవ' పథకం అమలు: మంత్రి నిమ్మల

    • అన్ని ప్రాంతాలు, వర్గాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: నిమ్మల

  • Jun 14, 2025 18:30 IST

    విమానం కూలడానికి ముందు ATCకి పైలట్‌ మెసేజ్‌

    • 5 సెకన్లలో 6 పదాలతో ATCకి పైలట్‌ సబర్వాల్‌ మెసేజ్‌

    • మే డే.. మే డే.. మే డే అంటూ కెప్టెన్‌ సబర్వాల్‌ మెసేజ్‌

    • నో పవర్‌.. నో థ్రస్ట్‌.. గోయింగ్‌ డౌన్‌ అంటూ మెసేజ్‌

    • ATCలో రికార్డయిన కెప్టెన్‌ సబర్వాల్‌ ఆఖరి మాటలు

  • Jun 14, 2025 18:30 IST

    అమరావతిలో మరోసారి మహిళలు, రైతుల ఆందోళనలు

    • జర్నలిస్టు కృష్ణంరాజు, వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలపై నిరసన

    • రాజధాని అమరావతి వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు, రైతులు

    • 'సాక్షి'ని మూసివేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించిన రైతులు

    • సాక్షి మీడియా, జగన్‌రెడ్డి, భారతికి వ్యతిరేకంగా నినాదాలు

    • జగన్, భారతి, సజ్జల, కృష్ణంరాజు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

    • క్షమాపణలు చెప్పేవరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టీకరణ

  • Jun 14, 2025 17:22 IST

    వరల్డ్‌ టెస్ట్‌ క్రికెట్‌ ఛాంపియన్‌ దక్షిణాఫ్రికా

    • వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ విజేత దక్షిణాఫ్రికా

    • ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం

    • ఆస్ట్రేలియా 212 & 207, దక్షిణాఫ్రికా 138 & 282/5

    • 1998 తర్వాత తొలిసారి ICC ట్రోఫీ గెలిచిన దక్షిణాఫ్రికా

    • అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన మార్‌క్రమ్‌(136)

    • బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌ బవుమా(66)

    • WTC విజేత దక్షిణాఫ్రికాకు రూ.30.80 కోట్ల ప్రైజ్ మనీ

    • రన్నరప్‌ ఆస్ట్రేలియాకు రూ.17.94 కోట్ల ప్రైజ్‌ మనీ

  • Jun 14, 2025 17:07 IST

    జగన్ ఆటలు సాగవు: అనిత

    • చంద్రబాబు సీఎంగా ఉన్నంత వరకూ జగన్ ఆటలు సాగవు: అనిత

    • జగన్ కుట్రలు రాష్ట్రంలో సాగనివ్వం: మంత్రి అనిత

    • మహిళల్ని అడ్డం పెట్టుకుని జగన్‌ రాజకీయాలు: అనిత

    • జగన్ పులివెందులకు మాత్రమే ఎమ్మెల్యే: అనిత

    • కొమ్మినేని నిర్దోషి అని సుప్రీంకోర్టు నిర్ధారించలేదు: అనిత

    • కొమ్మినేనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది

    • జగన్ రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడు: మంత్రి అనిత

  • Jun 14, 2025 15:25 IST

    రోదసి యాత్ర వాయిదా..

    • సాంకేతిక సమస్యలతో పలుసార్లు శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా

    • సాంకేతిక సమస్యలతో శుభాంశు శుక్లా రోదసి యాత్ర వాయిదా

    • యాక్సియం-4 మిషన్‌ను సంయుక్తంగా చేపట్టిన ఇస్రో, నాసా, ఈఎస్‌ఏ

  • Jun 14, 2025 13:27 IST

    హైదరాబాద్‌: సినీ నటి కల్పికపై మరో కేసునమోదు

    • సైబరాబాద్‌ క్రైమ్‌ పీఎస్‌లో కల్పికపై ఫిర్యాదు చేసిన కీర్తన

    • ఇన్‌స్టాలో అసభ్యంగా దూషించిందంటూ ఫిర్యాదు

  • Jun 14, 2025 13:27 IST

    ప్రకాశం: పొదిలి దాడి కేసులో 15 మంది అరెస్ట్‌

    • అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల ఘటనలో...

    • జగన్‌ క్షమాపణలు చెప్పాలని స్థానిక మహిళల నిరసన

    • మహిళలపై చెప్పులు, రాళ్లతో వైసీపీ మూకల దాడి

    • వైసీపీ దాడిలో పలువురు పోలీసులు, మహిళలకు గాయాలు

    • సీసీ ఫుటేజ్‌ ఆధారంగా 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

    • దాడి కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

    • వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి నోటీసులు

  • Jun 14, 2025 13:26 IST

    కాళేశ్వరం ఈఈ శ్రీధర్‌ వ్యవహారంలో కీలక విషయాలు

    • ఇరిగేషన్‌ చీఫ్‌ ఆఫీస్‌లో రిపోర్ట్‌ చేయాలని..

    • గతేడాది జూన్‌ 27న శ్రీధర్‌కు రాహుల్‌ బొజ్జా ఆదేశం

    • అధికారుల ఆదేశాలను పక్కన పెట్టిన ఈఈ శ్రీధర్‌

    • బదిలీ అయిన తర్వాత కూడా..

    • ఏడాదిపాటు చొప్పదండిలోనే ఈఈగా పనిచేసిన శ్రీధర్‌

    • ENC అనిల్‌ ఆదేశాలతో శ్రీధర్‌ పనిచేసినట్టు అనుమానం

    • ENC అనిల్‌, శ్రీధర్‌ సంబంధాలపై ఏసీబీ ఆరా

    • కస్టడీలో ఉన్న శ్రీధర్‌ను విచారించనున్న ఏసీబీ అధికారులు

    • కాళేశ్వరం ఈఈ శ్రీధర్‌ను కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్‌

    • శ్రీధర్‌ను వారం రోజుల కస్టడీకి కోరిన ఏసీబీ అధికారులు

  • Jun 14, 2025 09:12 IST

    అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 274కు చేరిన మృతులు

    • సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్‌పై కేసు నమోదు

    • BRS హయాంలో BJP నేతల ఫోన్‌ ట్యాప్‌ చేసినట్టు సిట్‌ గుర్తింపు

  • Jun 14, 2025 09:08 IST

    ఫోన్ టాపింగ్ కేసులో నేడు సిట్ విచారణకు హాజరుకానున్న ప్రభాకర్ రావు

    • ప్రభాకర్ రావుని ఇప్పటికే రెండుసార్లు సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్

    • నేడు ప్రభాకర్ రావు ప్రణీత్ రావు ను కలిపి విచారణ చేయనున్న సిట్

    • హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసి మూసిలో పడి వేసిన మాజీ డి.ఎస్.పి ప్రణీతరావు

    • నేడు కీలకం కానున్న విచారణ.

    • సిట్ అధికారులకు సహకరించని ప్రభాకర్ రావు.

  • Jun 14, 2025 09:08 IST

    హైదరాబాద్‌: గచ్చిబౌలి AIG ఆస్పత్రికి కేసీఆర్‌

    • కొంతకాలంగా జలుబుతో బాధపడుతున్న కేసీఆర్‌

    • వైద్య పరీక్షల తర్వాత నందీనగర్‌ నివాసానికి కేసీఆర్‌

  • Jun 14, 2025 08:28 IST

    నేడు తెలంగాణలో గద్దర్‌ అవార్డుల ప్రదానం

    • హైటెక్స్‌లో గద్దర్‌ పురస్కారాల ప్రదానం కార్యక్రమం

    • 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందజేత

    • 2024కు అన్ని విభాగాలకూ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులు అందజేత

  • Jun 14, 2025 08:08 IST

    ‘తొలి అడుగు’ విజయయాత్ర

    CM Chandrababu Naidu

    • అమరావతి: ఈ నెల 23 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికీ ‘తొలి అడుగు’ విజయయాత్ర

    • పార్టీ సంస్థాగత కమిటీలు త్వరగా పూర్తి చేయండి.

    • పార్టీ కోసం పని చేసేవారికి చోటు కల్పించాలని నాయకులకు చంద్రబాబు దిశా నిర్దేశం.

    • జూలైలో పార్టీ నేతలు, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణా శిభిరాలు.

    • ఎమ్మెల్యేలు రోజూ పార్టీకి కొంత సమయం కేటాయించాలి.

    • 21 తేదీన లక్ష చోట్ల నిర్వహించే యోగా డే సన్నాహక కార్యక్రమంలో పాల్గొనండి.

    • తల్లికి వందనం నిధులు విడుదలతో సర్వత్రా సంతృప్తి.

    • వచ్చే వారమే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తాం.

    • ఒకే నెలలో రెండు సూపర్ - 6 పథకాలు అమలు చేసి చూపిస్తున్నాం.

    • టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

    పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..