-
-
Home » Mukhyaamshalu » Breaking News Live Updates Saturday 05th July 2025 Top news and Major Events Across India Siva
-

Breaking News: కేటీఆర్, హరీష్‌రావు సెకండ్ బెంచ్ లీడర్లు: జగ్గారెడ్డి
ABN , First Publish Date - Jul 05 , 2025 | 12:01 PM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 05, 2025 19:36 IST
నగలు మర్చిపోయిన భక్తులు..
తిరుమల: శ్రీవారి భక్తులకు రూ.12 లక్షల విలువైన బంగారు నగలు అప్పగింత
గెస్ట్ హౌస్‌లో బంగారు నగలను మర్చిపోయిన మదురైకు చెందిన భక్తులు
భక్తులు గదిని ఖాళీ చేసిన తర్వాత శుభ్రం చేస్తూ నగలను గుర్తించిన సిబ్బంది
నగలను పద్మావతి విచారణ కార్యాలయంలో టీటీడీ అధికారులకు అందించిన సిబ్బంది
ఆ తర్వాత భక్తులకు ఫోన్ చేసి నగలను అప్పగించిన టీటీడీ అధికారులు
-
Jul 05, 2025 19:35 IST
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
కాచిగూడ, నారాయణగూడ, మలక్‌పేటలో వర్షం
దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సైదాబాద్‌లో వర్షం
సరూర్‌నగర్, చంపాపేట, బాలాపూర్, RCI మల్లాపూర్‌లో వర్షం
-
Jul 05, 2025 17:55 IST
సీఎం చంద్రబాబు సమీక్ష..
హంద్రీనీవా, పోలవరం కాలువ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
CRDA సమావేశంలో 7 అంశాలకు ఆమోదం
త్వరలో వైసీపీ ఆఫీస్‌కు టూలెట్ బోర్డు పెట్టబోతున్నారు: కొల్లు రవీంద్ర
కులగణనపై రాజకీయ పార్టీలు బేషజాలకు పోవద్దు: శ్రీధర్‌బాబు
మేడారం మాస్టర్ ప్లాన్‌లో ఆదివాసీల సంప్రదాయాలు చాటిచెప్పాలి: సీతక్క
-
Jul 05, 2025 17:55 IST
మావోయిస్టుల పేరుతో లేఖ..
మంత్రి సీతక్కను బెదిరించలేదంటూ మావోయిస్టుల పేరుతో లేఖ
మురుగునీటి సమస్యను పరిష్కరించలేదని అధికారులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం
ఓటర్ల జాబితా నుంచి చెన్నమనేని రమేష్ పేరు తొలగింపు
-
Jul 05, 2025 17:55 IST
బొగ్గు గని కూలి నలుగురు మృతి..
జార్ఖండ్: రాంగఢ్ జిల్లాలో బొగ్గు గని కూలి నలుగురు మృతి
కారు రేసింగ్ చిత్రాల్లోనూ నటిస్తా: అజిత్‌కుమార్
-
Jul 05, 2025 17:55 IST
స్పెయిన్: విమానంలో ప్రమాదం, పలువురికి గాయాలు
విమానంలో ఫైర్ అలర్ట్‌తో భయాందోళనకు గురైన ప్రయాణికులు
ఆగి ఉన్న విమానం నుంచి కిందకి దూకిన ప్రయాణికులు
18 మంది ప్రయాణికులకు గాయాలు
స్పెయిన్‌లో పల్మాదే మాలొర్కా ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
-
Jul 05, 2025 17:38 IST
ఢిల్లీలో ఓ ఇంట్లో అనుమానాస్పదస్థితిలో ముగ్గురు మృతి
దక్షిణాపురి ప్రాంతంలోని ఓ ఇంట్లో 3 మృతదేహాలు
ఊపిరాడక ముగ్గురు చనిపోయినట్లు పోలీసుల గుర్తింపు
ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా ఉన్న ఏసీలు, గ్యాస్ సిలిండర్లు
ముగ్గురు యువకులు ఏసీ మెకానిక్‌లుగా పనిచేస్తున్నట్లు గుర్తింపు
-
Jul 05, 2025 17:38 IST
ఓటర్ల జాబితా నుంచి చెన్నమనేని రమేష్ పేరు తొలగింపు
పేరు తొలగిస్తూ చెన్నమనేని ఇంటి గేటుకు నోటీసు అంటించిన అధికారులు
చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని గతంలో హైకోర్టు తీర్పు
రమేష్ పేరును ఓటరు జాబితా నుంచి తొలగించాలని కోరిన ఆది శ్రీనివాస్
ఓటరు జాబితాలో పేరు తొలగింపుపై గతంలో నోటీసులు ఇచ్చిన అధికారులు
అధికారుల నోటీసుకు సమాధానం ఇవ్వని చెన్నమనేని రమేష్
వివరణ ఇవ్వకపోవడంతో రమేష్ పేరును ఓటరు జాబితా నుంచి తొలగింపు
-
Jul 05, 2025 17:38 IST
హైదరాబాద్: బాచుపల్లిలో భర్తను హత్య చేసిన భార్య
భర్త అంజిలప్పను గొంతునులిమి చంపిన భార్య
గత నెల 22న భర్త మృతదేహాన్ని సొంతూరు తీసుకెళ్లిన భార్య
భర్త మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం
అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన అంజిలప్ప కుటుంబం
భర్తను భార్యే చంపిందని దర్యాప్తులో తేల్చిన పోలీసులు
-
Jul 05, 2025 17:37 IST
కేటీఆర్, హరీష్‌రావు సెకండ్ బెంచ్ లీడర్లు: జగ్గారెడ్డి..
బనకచర్లపై చర్చిద్దాం అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ని సీఎం కోరుతున్నారు: జగ్గారెడ్డి
అసెంబ్లీ సమావేశపరచాలని ప్రతిపక్ష నాయకుడు కోరతారు: జగ్గారెడ్డి
కానీ తెలంగాణలో పరిస్థితి రివర్స్‌లో ఉంది: జగ్గారెడ్డి
కేటీఆర్, హరీష్‌రావు సెకండ్ బెంచ్ లీడర్లు: జగ్గారెడ్డి
కేసీఆర్ మాట్లాడకుండా సెకండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారు?: జగ్గారెడ్డి
-
Jul 05, 2025 16:11 IST
రైతులకు అందుబాటులో ఏఐ టెక్నాలజీ: మంత్రి తుమ్మల
మొబైల్ ఫోన్ ద్వారా శాటిలైట్‌తో ఏఐ టెక్నాలజీ
పంట రోగ ముందస్తుగా నిర్ధారణ: మంత్రి తుమ్మల
తక్కువ కూలీ ఖర్చుతో అధిక దిగుబడి: మంత్రి తుమ్మల
-
Jul 05, 2025 16:11 IST
హైదరాబాద్: బాచుపల్లిలో భర్తను హత్య చేసిన భార్య
భర్త అంజిలప్పను గొంతునులిమి చంపిన భార్య
గత నెల 22న భర్త మృతదేహాన్ని సొంతూరు తీసుకెళ్లిన భార్య
భర్త మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం
అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన అంజిలప్ప కుటుంబం
భర్తను భార్యే చంపిందని దర్యాప్తులో తేల్చిన పోలీసులు
-
Jul 05, 2025 14:19 IST
అమెరికాపై భారత్ ప్రతీకార సుంకాలు
డబ్ల్యూటీవో నిబంధనల కింద ప్రతీకార సుంకాలు ప్రతిపాదించిన భారత్
డబ్ల్యూటీఓకు చెందిన కౌన్సిల్ ఫర్ ట్రేడ్ ఇన్ గూడ్స్‌ను కోరిన భారత్
భారత్ వాహన ఉత్పత్తులపై అమెరికా అమలు చేసిన టారిఫ్‌లే కారణం
భద్రతా చర్యల పేరిట అమెరికా టారిఫ్‌లు నిబంధనల ఉల్లంఘనే: భారత్
-
Jul 05, 2025 13:44 IST
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం
ముంబైలో ఒకే వేదికపై ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే
రాజకీయంగా విభేదాలతో 20 ఏళ్లుగా దూరంగా థాక్రే సోదరులు
మహారాష్ట్రలో భాషా వివాదం ముదరడంతో..
హిందీకి వ్యతిరేకంగా ఒకే వేదికపై థాక్రే సోదరులు
త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ఉమ్మడి నిరసన
-
Jul 05, 2025 12:56 IST
సిగాచి ఘటనలో 40కి చేరిన మృతుల సంఖ్య.
సిగాచి ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది.
సిగాచి పరిశ్రమలో తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మున్మున్ చౌదరి అనే మరో కార్మికుడు మృతి.
-
Jul 05, 2025 12:54 IST
హైదరాబాద్: పోక్సో చట్టం అమలుపై రాష్ట్రస్థాయి సదస్సు.
పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, అధికారులు.
పోక్సో చట్టం అమలుపై అధికారులతో చర్చ.
చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం: సీఎం రేవంత్‌రెడ్డి
భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉన్నాం
చిన్నారులపై లైంగిక హింస కేసుల్లో కఠినంగా శిక్షలు: రేవంత్‌రెడ్డి
సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి
న్యాయమంటే శిక్షలు విధించడం మాత్రమే కాదు.. బాధితుల జీవితానికి భరోసా కూడా కల్పించాలి: సీఎం రేవంత్
-
Jul 05, 2025 12:51 IST
ఢిల్లీ: RSS అఖిలభారత ప్రాంత ప్రచారక్‌ల సమావేశం
కేశవ్‌కుంజ్‌లో రెండోరోజు కొనసాగుతున్న సమావేశం
వందేళ్లు పూర్తయిన సందర్భంగా RSS శతాబ్ధివర్ష్
పంచపరివర్తన్ పేరుతో సమాజంలో మార్పుల కోసం కార్యక్రమం
-
Jul 05, 2025 12:01 IST
ఢిల్లీ: Xవేదికగా మోదీపై రాహుల్ విమర్శలు
ట్రంప్ సుంకాలకు మోదీ తలొగ్గుతారు..రాసి పెట్టుకోండి: రాహుల్
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్..
గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదు: రాహుల్
3 నెలల క్రితం భారత్‌పై 26 శాతం సుంకాలు విధించిన ట్రంప్
90 రోజుల విరామం తర్వాత అది అమల్లోకి రాకుండా..
అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి భారత్ చర్చలు
మోదీ తీరును విమర్శిస్తూ ట్వీట్ చేసిన రాహుల్