-
-
Home » Mukhyaamshalu » Andhra pradesh Telangana national and International latest breaking news and live updates on 9th December 2025 vreddy
-
Breaking News: తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
ABN , First Publish Date - Dec 09 , 2025 | 07:03 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 09, 2025 21:02 IST
తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌లో కీలక అంశాలు
సాంస్కృతిక వారసత్వం, కళలు, పర్యాటకం పరిరక్షణ
పాలనలో పౌరుల భాగస్వామ్యం నిర్థారించడం
ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే విధానాల రూపకల్పన
విధానపరమైన నిర్ణయాలు ప్రోత్సహించడమే లక్ష్యం
-
Dec 09, 2025 21:02 IST
తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌లో కీలక అంశాలు
డాక్యుమెంట్‌లో ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యం
పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత
గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం
ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్ట్..
గ్రీన్‌ఫీల్డ్ హైవే, RRR, రింగురైలు, బుల్లెట్ రైలు
ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, ప్రత్యేక నిధి ఏర్పాటు
వాతావరణ మార్పుల వల్ల నష్టాలను తగ్గించడం
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యంపై ప్రత్యేక దృష్టి
-
Dec 09, 2025 21:02 IST
తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
83 పేజీలతో విజన్ డాక్యుమెంట్-2047 రూపకల్పన
తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌లో విజన్ డాక్యుమెంట్
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో విజన్ డాక్యుమెంట్
యువత, మహిళలు, రైతులకు ప్రాధాన్యం
10 కీలక వ్యూహాలతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన
క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా తెలంగాణ
-
Dec 09, 2025 21:02 IST
పేదల్లో నిరుపేదలకు సహాయం చేయడమే మా ప్రాధాన్యం: రేవంత్
సమాజంలో వివక్షత నిర్మూలన మా లక్ష్యం: సీఎం రేవంత్
విద్య కోసం ఖర్చు చేసేది వ్యయం కాదు.. పెట్టబడి: సీఎం రేవంత్
విద్యలో క్వాలిటీ, నైపుణ్యం నెలకొల్పుతాం: సీఎం రేవంత్
-
Dec 09, 2025 21:02 IST
తెలంగాణ మట్టిలోనే గొప్ప చైతన్యం ఉంది: సీఎం రేవంత్
విజన్ డాక్యుమెంట్-2047 రూపకల్పనలో అందరి భాగస్వామ్యం: రేవంత్
నీతి ఆయోగ్, ISB, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు భాగమయ్యారు
స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకే..
తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 రూపొందించాం: సీఎం రేవంత్
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం: సీఎం రేవంత్
-
Dec 09, 2025 21:00 IST
చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు: చిరంజీవి
హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా మార్చాలన్నది సీఎం రేవంత్ ఆకాంక్ష
గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది: చిరంజీవి
ఇది కేవలం చిరంజీవికి మాత్రమే దక్కిన గౌరవం కాదు..
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నాకు వచ్చిన అవకాశం: చిరంజీవి
సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ వంటివారు..
ఇక్కడ స్టూడియోలు పెడతామని చెప్పడం హర్షణీయం: చిరంజీవి
నిర్దేశించుకున్న లక్ష్యాలను సీఎం రేవంత్ సాధిస్తారని నా నమ్మకం: చిరంజీవి
-
Dec 09, 2025 21:00 IST
అమరావతి: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం
మంత్రులు, కార్యదర్శులు, HODలతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్
ఏపీ వృద్ధిరేటు పెంపునకు రానున్న 4 నెలల్లో..
తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చ
-
Dec 09, 2025 18:47 IST
ప్రధాని మోదీతో సత్యనాదెళ్ల భేటీ..
ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల భేటీ
భారత్‌లో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటన
-
Dec 09, 2025 17:41 IST
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం
సీఎం రేవంత్‌తో చిరంజీవి, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్..
నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, దిల్‌రాజు సహా పలువురు భేటీ
సినీ పరిశ్రమకు వసతుల కల్పనకు సిద్ధంగా ఉన్నాం: సీఎం రేవంత్
24 క్రాఫ్ట్స్‌లో సినీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా..
స్థానికులకు శిక్షణ అంశాన్ని పరిశీలించాలని సూచించిన సీఎం రేవంత్
ఫ్యూచర్ సిటీలో స్టూడియోలు ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున..
అన్నిరకాల సహాయ సహకారాలు ఉంటాయన్న సీఎం రేవంత్‌రెడ్డి
స్క్రిప్ట్‌తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా..
సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎం రేవంత్
-
Dec 09, 2025 17:40 IST
హైదరాబాద్: ఈగల్ టీమ్, నార్కోటిక్స్ పోలీసుల ఆపరేషన్
గంజాయి సేవిస్తున్న 11 మందిని అరెస్ట్ చేసిన ఈగల్ టీమ్
పాజిటివ్ వచ్చినవారికి రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలింపు
పేరెంట్స్ సమక్షంలోనే డ్రగ్ డిటెక్షన్ కిట్లతో ఈగల్ టీమ్ పరీక్షలు
తల్లిదండ్రులకు మర్యాదపూర్వకంగా ఈగల్ టీమ్ కౌన్సెలింగ్
అరెస్టయినవారిలో బ్యాంక్ ఉద్యోగి, కార్పొరేట్ సిబ్బంది సహా..
ఫిట్‌నెస్ ట్రైనర్లు, వ్యాపారవేత్తలు ఉన్నట్లు గుర్తింపు
ఇటీవల హైదరాబాద్‌లో డ్రగ్స్‌కి బానిసలై వరుస మరణాలు
చాంద్రాయణగుట్ట దగ్గర ఆటోలో ఇద్దరు యువకులు మృతి
బాలాపూర్‌లో డ్రగ్ ఇంజెక్షన్‌తో 17 ఏళ్ల యువకుడు మృతి
డ్రగ్స్ బారినపడి రాజేంద్రనగర్‌లో యువ టెక్నీషియన్ మృతి
-
Dec 09, 2025 16:25 IST
ఢిల్లీ: ఇండిగో సేవలు సాధారణ స్థితికి వచ్చాయి: సీఈఓ పీటర్ ఎల్బర్స్
ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు: పీటర్ ఎల్బర్స్
ప్రయాణికులకు మరోసారి క్షమాపణలు: ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్
ఇకపై ఇండిగో సేవల్లో ఎలాంటి అసౌకర్యం కలగదు: పీటర్ ఎల్బర్స్
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం: పీటర్ ఎల్బర్స్
ప్రయాణికులే మా తొలి ప్రాధాన్యం: ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్
లక్షలాదిమంది ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చేశాం: పీటర్ ఎల్బర్స్
కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం: పీటర్ ఎల్బర్స్
-
Dec 09, 2025 16:25 IST
లోక్‌సభ: ఎన్నికల సంస్కరణల(SIR)పై చర్చ
SIRపై చర్చ సందర్భంగా RSSపై రాహుల్ గాంధీ విమర్శలు
RSS వాదులకు సమానత్వంపై నమ్మకం లేదు: రాహుల్
అన్ని వ్యవస్థలపైనా RSS ఆధిపత్యం చూపుతోంది: రాహుల్
ఎన్నికల వ్యవస్థను RSS తన గుప్పిట్లో ఉంచుకుంది: రాహుల్
ఇప్పటికే దేశంలో విద్యా వ్యవస్థను మార్చేశారు: రాహుల్
దేశంలో వైవిధ్యాన్ని RSS నాశనం చేస్తోంది: రాహుల్
రాజ్యాంగ వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవడమే RSS ఎజెండా
RSS ఎజెండాను ప్రభుత్వం అమలు చేస్తోంది: రాహుల్
ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ఈసీని వాడుకుంటున్నారు: రాహుల్
క్షేత్రస్థాయిలో ఎన్నికల సంస్కరణలు అమలుకావట్లేదు: రాహుల్
ఈసీ నియామకంలో మోదీ, అమిత్ షాకు ఎందుకంత ఆసక్తి?
ఎన్నికల కమిషనర్లకు మోదీ, అమిత్ షా బహుమతులు ఇస్తున్నారు
సీబీఐ, ఈడీలను ప్రభుత్వం తన గుప్పిట్లో ఉంచుకుంది: రాహుల్
కేంద్రం, ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయి: రాహుల్
నిజాలు మాట్లాడుతుంటే బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది: రాహుల్
నేను ఏదీ తప్పుగా మాట్లాడలేదు: రాహుల్
నేను ఆరోపణలు చేయడం లేదు.. పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా
మెరిట్‌తో సంబంధం లేకుండీ వర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారు
ఎన్నికల సంస్కరణలపై కేంద్రం గొప్పలు చెబుతోంది: రాహుల్
యూపీ, హర్యానా సహా పలుచోట్ల ఓట్ చోరీ జరిగింది: రాహుల్
ఎన్నికల సీసీ ఫుటేజ్‌ను ధ్వంసం చేశారు: రాహుల్
ఫేక్ ఓట్లపై ఈసీ క్లారిటీ ఇవ్వలేదు: రాహుల్
నా ప్రశ్నలకు ఇప్పటివరకు ఈసీ సమాధానం చెప్పలేదు: రాహుల్
సీబీఐ చీఫ్‌ను సీజేఐ ఎందుకు ప్రతిపాదించడం లేదు: రాహల్
RSS వ్యతిరేకులను ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది: రాహుల్
-
Dec 09, 2025 16:25 IST
BRS దీక్షా దివస్, విజయ్ దివస్‌లపై MLC కవిత ట్వీట్
అధికారం కోల్పోయాక దీక్షా దివస్, విజయ్ దివస్‌లు: కవిత
ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు: కవిత
-
Dec 09, 2025 14:52 IST
ఏపీలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ బ్యాంకు బృందం పర్యటన
వరుసగా ఐదోరోజు అమరావతిలో కొనసాగుతోన్న పర్యటన
APCRDA ఆఫీసులో గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం(GRM),...
రైతుల నుంచి నమోదవుతున్న అర్జీల పరిష్కారంపై చర్చ
అమరావతి నిర్మాణ పనుల సైట్లలో కార్మికుల భద్రతకు...
చేపడుతున్న చర్యలు WB, ADB బృందానికి వివరించిన APCRDA
-
Dec 09, 2025 14:51 IST
అమరావతి: పరకామణి చోరీ కేసులో హైకోర్టుకు CID అదనపు నివేదిక
లోక్ అదాలత్ వద్ద రాజీ వ్యవహారంపై హైకోర్టుకు CID అదనపు నివేదిక
అదనపు నివేదిక మరో 2 సెట్లను రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు ఇవ్వాలని ఆదేశం
సీల్డ్‌కవర్‌లో రిజిస్ట్రార్ జ్యడీషియల్‌కు సమర్పించాలని CIDకి హైకోర్టు ఆదేశం
పరిశీలన నిమిత్తం నివేదికలు వారి ముందు ఉంచాలని రిజిస్ట్రీకి స్పష్టీకరణ
లోక్‌అదాలత్ అవార్డు చట్టబద్ధత తేల్చేందుకు సీజే ధర్మాసనం విచారణ
అదనపు నివేదిక పరిశీలించి ఉత్తర్వుల జారీకి విచారణ బుధవారానికి వాయిదా
-
Dec 09, 2025 13:07 IST
ఢిల్లీ: సోనియాగాంధీకి కోర్టు నోటీసులు
సోనియాకు నోటీసులు జారీ చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు
ఓటర్ జాబితాలో సోనియా పేరుపై కోర్టులో పిటిషన్
పౌరసత్వం రాకముందే ఓటర్ జాబితాలో పేరు ఉండడంపై అభ్యంతరం
వివరణ ఇవ్వాలని సోనియాకు నోటీసులు జారీ చేసిన కోర్టు
-
Dec 09, 2025 12:52 IST
ఢిల్లీ: DGCA ఎదుట హాజరైన ఇండిగో ప్రతినిధులు
ఇండిగో విమానాలను 5 శాతం తగ్గించండి: DGCA
శీతాకాలంలో కొత్త నిబంధనలను పాటించండి: DGCA
రోజుకు 2,200 విమాన సర్వీసులు నడుపుతున్న ఇండిగో
రోజుకు 110 సర్వీసులను తగ్గించాలన్న DGCA
విమాన సర్వీసుల కుదింపుపై ఇండిగో కసరత్తు
-
Dec 09, 2025 12:44 IST
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
విజయన్ డాక్యుమెంట్ రూపకల్పనకు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు
ఆన్‌లైన్ ద్వారా 4 లక్షల మంది నుంచి అభిప్రాయాలు సేకరణ
-
Dec 09, 2025 12:20 IST
ఢిల్లీ: DGCA ఎదుట హాజరైన ఇండిగో ప్రతినిధులు
ఇండిగో విమానాలను 5 శాతం తగ్గించండి: DGCA
శీతాకాలంలో కొత్త నిబంధనలను పాటించండి: DGCA
-
Dec 09, 2025 11:02 IST
2009లో ఇదేరోజు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది: రేవంత్
అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించాం: రేవంత్
ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది
అడ్డంకులు అధిగమించి మరీ సోనియా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు
సోనియా, మన్మోహన్ స్ఫూర్తితోనే మా ప్రభుత్వ పథకాలు: రేవంత్
-
Dec 09, 2025 11:01 IST
హైదరాబాద్: HCA అండర్ 14 క్రికెట్ సెలక్షన్స్‌లో ఉద్రిక్తత
జింఖానా గ్రౌండ్‌లో సెలక్షన్స్‌కు హాజరైన పలువురు ప్లేయర్లు
HCA నిర్వాహకుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం
ఏర్పాట్లు సరిగా చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
-
Dec 09, 2025 11:01 IST
భూమి వివాదంలో BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి
మేడ్చల్ సుచిత్ర సెంటర్‌లో కొన్నేళ్లుగా భూ వివాదం
సర్వే నెంబర్ 82, 83లో 1.29 ఎకరాల్లో 33 గుంటల స్థలాన్ని..
మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడి ఆరోపణ
మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే కబ్జా చేశారని శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన
భూ వివాదం నేపథ్యంలో ల్యాండ్ సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారులు
తమ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆరోపణ
పోలీసు బందోబస్తు మధ్య కొనసాగుతున్న భూసర్వే
-
Dec 09, 2025 09:47 IST
హైదరాబాద్‌కు రావాల్సిన 14 ఇండిగో విమానాలు రద్దు
హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 44 ఇండిగో విమానాలు రద్దు
విశాఖ నుంచి వెళ్లాల్సిన 6 ఇండిగో విమానాలు రద్దు
-
Dec 09, 2025 09:13 IST
ఏజెన్సీ ప్రాంతాల్లో పెరిగిన చలి తీవ్రత
పలు చోట్ల సింగిల్ డిజిట్‌కు పడిపోయిన టెంపరేచర్
ఏజెన్సీల్లో దట్టంగా పొగమంచు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
వినుములూరులో 5, అరకు, చింతపల్లిలో 3, పాడేరులో 4 డిగ్రీలు
-
Dec 09, 2025 08:40 IST
తెలంగాణలో 2026 ఏడాదికి సెలవులు ఖరారు
2026లో మొత్తంగా 27 సాధారణ సెలవులు
మరో 26 ఆప్షనల్ సెలవులను కేటాయించిన ప్రభుత్వం
-
Dec 09, 2025 08:39 IST
జీహెచ్‌ఎంసీ వార్డులను 300కు పెంచుతూ ఉత్తర్వులు
జీహెచ్‌ఎంసీలో వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెంపు
ఇటీవల GHMCలో 27మున్సిపాలిటీలను విలీనంచేసిన సర్కార్
-
Dec 09, 2025 07:27 IST
మహారాష్ట్ర సామాజిక, కార్మిక ఉద్యమ కారుడు డా. బాబా ఆడావ్ (95) కన్నుమూత
దీర్ఖకాలిక అనారోగ్యంతో పుణెలో బాబా ఆడావ్ తుదిశ్వాస
ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, కార్మికుల హక్కుల కోసం పోరాడిన బాబా ఆడావ్
బాబా ఆడావ్ మృతిపట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
-
Dec 09, 2025 07:07 IST
ఇండిగో సమస్యపై లోక్‌సభలో మంత్రి రామ్మోహన్ ప్రకటన చేసే అవకాశం
నేడు DGCA ఎదుట హాజరుకానున్న ఇండిగో ప్రతినిధులు
-
Dec 09, 2025 07:07 IST
ఏడో రోజు పార్లమెంట్ సమావేశాలు
నేడు లోక్‌సభలో 'SIR'పై ప్రత్యేక చర్చ
-
Dec 09, 2025 07:07 IST
నేడు సోనియా గాంధీ పుట్టిన రోజు
ఢిల్లీ, హైదరాబాద్‌లో సోనియా గాంధీ బర్త్‌డే వేడుకలు
-
Dec 09, 2025 07:06 IST
ఏపీలో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేయండి: మంత్రి లోకేష్
వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్‌తో లోకేష్ భేటీ
ఐటీ, డేటా హబ్‌గా విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది
ఏపీలో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేయండి: లోకేష్
సెమీకండక్టర్, AI, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి
పలు కంపెనీలకు ఏపీ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్త ప్రోత్సాహకాలను అందిస్తోంది
పరిశ్రమలకు నేరుగా ప్రోత్సాహకాలను అందించేందుకు..
దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో అకౌంట్ విధానాన్ని ప్రారంభించాం: మంత్రి లోకేష్
-
Dec 09, 2025 07:06 IST
నేటినుంచి భారత్‌లో అమెరికా వాణిజ్య బృందం పర్యటన
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చ
-
Dec 09, 2025 07:06 IST
నేటినుంచి భారత్ Vs సౌతాఫ్రికా 5 టీ20ల సిరీస్
కటక్‌లో రాత్రి 7 గంటలకు భారత్ Vs సౌతాఫ్రికా తొలి టీ20
-
Dec 09, 2025 07:05 IST
నేడు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
సా.6 గంటలకు ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
రాత్రి గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా డ్రోన్ల ప్రదర్శన
-
Dec 09, 2025 07:03 IST
నేటినుంచి కల్తీ నెయ్యి కేసులో ఇద్దరు నిందితులకు 4 రోజుల కస్టడీ
సిట్ కస్టడీకి A-16 సుగందీ, A-29 సుబ్రహ్మణ్యం