-
-
Home » Mukhyaamshalu » Andhra pradesh Telangana national and International latest breaking news and live updates on 10th December 2025 vreddy
-
BREAKING: వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు పిటిషన్‌పై కోర్టు తీర్పు
ABN , First Publish Date - Dec 10 , 2025 | 07:31 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 10, 2025 21:28 IST
వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరగలేదని సునీత పిటిషన్
పలు అంశాలపై సీబీఐ దర్యాప్తు అసమగ్రంగా ఉందని..
నిందితులే అంటున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు
అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో..
దర్యాప్తు పూర్తయినట్లు సీబీఐ చెప్పలేదు: పిటిషన్‌లో వైఎస్ సునీత
దర్యాప్తులో కొన్ని అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని CBI చెప్పింది: సునీత
దర్యాప్తు కొనసాగింపునకు చట్టపరంగా నిషేధం లేదు: వైఎస్ సునీత
దర్యాప్తులో లోపాలతో పాటు, అసంపూర్తిగా ఉన్నప్పుడు..
తదుపరి దర్యాప్తునకు ఆదేశించాలని కోర్టును కోరిన వైఎస్ సునీత
లోపభూయిష్టమైన సీబీఐ దర్యాప్తు..
నిందితులకు అనుకూలంగా ఉందని కోర్టుకు తెలిపిన వైఎస్ సునీత
-
Dec 10, 2025 21:22 IST
రేపు ఏపీ కేబినెట్ సమావేశం
అమరావతి నిర్మాణానికి నాబార్డు నుంచి రూ.7,380 కోట్ల..
రుణం తీసుకునేందుకు CRDAకి అనుమతి ఇవ్వనున్న కేబినెట్
సీడ్ యాక్సెస్ రోడ్‌ను 16వ NHకు అనుసంధానం పనులకు..
రూ.532 కోట్లకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్
పలు సంస్థలకు భూకేటాయింపులకు అనుమతి ఇవ్వనున్న కేబినెట్
రూ.169 కోట్లతో లోక్ భవన్ నిర్మాణం కోసం..
టెండర్లు పిలిచేందుకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్
రూ.163 కోట్లతో జ్యుడిషియల్ అకాడమీకి..
పరిపాలన అనుమతులకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్
రూ.20 వేలకోట్ల పెట్టుబడులతో పాటు..
56 వేల ఉద్యోగాలక కల్పనకు ఆమోదం తెలపనున్న కేబినెట్
-
Dec 10, 2025 20:08 IST
విశాఖ: గాజువాక మిందిలో వైసీపీ నేతల ఘర్షణ
వైసీపీ కార్పొరేటర్ లావణ్య, ఆమె తండ్రి కృష్ణపై..
మరో వర్గం నేతలు శ్రీను, సత్యనారాయణరెడ్డి దాడి
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో గొడవ
కార్పొరేటర్ లావణ్య, ఆమె తండ్రి కృష్ణకు గాయాలు
-
Dec 10, 2025 20:08 IST
అమరావతి: కాంట్రాక్టర్ల బకాయిలు వెంటనే చెల్లించాలి: SABCA
గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.4 వేలకోట్ల బిల్లుల బకాయిలు..
వెంటనే చెల్లించాలని ఏపీ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్
ఏపీ మున్సిపాలిటీల్లో ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు
-
Dec 10, 2025 20:07 IST
అఖండ-2 టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 పెంపునకు అవకాశం
ఈనెల 12 నుంచి 14 వరకు అమల్లో పెంచిన ధరలు
రేపు రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600
-
Dec 10, 2025 17:42 IST
పల్నాడు: రేపు మాచర్ల కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు
వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంటహత్యల కేసులో..
A6 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి
రెండు వారాల్లోగా లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు..
గడువు ముగియడంతో రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్
-
Dec 10, 2025 17:09 IST
వివేకా హత్య కేసు.. మరికాసేపట్లో తీర్పు..
వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు చేయాలన్న పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు
హైదరాబాద్: సీబీఐ కోర్టుకు చేరుకున్న వివేకా కుమార్తె సునీత
లోతైన దర్యాప్తు జరపాలని సీబీఐ ఆదేశాలు ఇవ్వాలంటూ సునీత పిటిషన్
దర్యాప్తు కోసం కోర్టు ఆదేశిస్తే తమకు అభ్యంతరం లేదన్న సీబీఐ
-
Dec 10, 2025 17:08 IST
CMRF చెక్కుల పంపిణీలో సీఎం రేవంత్ ప్రభుత్వం రికార్డ్
CMRF కింద ఏడాదికి సగటున రూ.850 కోట్ల సహాయం
గత రెండేళ్లలో రూ.1,685.79 కోట్ల CMRF చెక్కులు పంపిణీ
గత BRS హయాంలో ఏడాదికి రూ.450 కోట్ల సాయం
-
Dec 10, 2025 17:08 IST
బీరంగూడలో పరువుహత్య
సంగారెడ్డి: అమీన్‌పూర్ పరిధి బీరంగూడలో పరువుహత్య
కుమార్తెను ప్రేమిస్తున్నాడనే నెపంతో యువకుడు శ్రావణ్ సాయిని హత్యచేసిన యువతి తల్లిదండ్రులు
పెళ్లి విషయం మాట్లాడటానికి రావాలంటూ ఇంటికి పిలిపించి ఘాతుకం
యువకుడు శ్రావణ్ సాయిని కొట్టిచంపిన యువతి తల్లిదండ్రులు
-
Dec 10, 2025 15:56 IST
విరాట్.. నెం.2
ICC వన్డే ర్యాంకుల్లో 4 నుంచి రెండో స్థానానికి విరాట్ కోహ్లీ(773 పాయింట్లు)
అగ్రస్థానంలో కొనసాగుతున్న రోహిత్‌శర్మ(781 పాయింట్లు)
ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో..
రెండు సెంచరీలు, హాఫ్ సెంచరీతో అత్యధిక పరుగుల(302) బ్యాటర్‌గా కోహ్లీ
ఐదో స్థానంలో శుభ్‌మన్ గిల్, పదో స్థానంలో శ్రేయస్ అయ్యర్
బౌలింగ్ విభాగంలో 6 నుంచి మూడో స్థానానికి ఎగబాకిన కుల్దీప్ యాదవ్
-
Dec 10, 2025 15:16 IST
అమరావతి: తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
FIR నమోదు చేసి చర్యలు చేపట్టేందుకు CID, ఏసీబీ డీజీలకు వెసులుబాటు
లోక్‌అదాలత్ రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు ఆదేశం
CID, డీజీ నివేదికలు పరిశీలించిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
కేసు తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా
-
Dec 10, 2025 15:16 IST
అమరావతి: శ్రీవారి భక్తుల మనోభావాలను జగన్ దెబ్బతీశారు: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
హిందువులపై జగన్‌కు ఎంత ద్వేషం ఉందో ఆయన తీరు చూస్తే అర్థం అవుతుంది
రూ.వేల కోట్లు దోచుకున్న జగన్‌కు పరకామణి చోరీ చిన్నదిగా అనిపించడం సహజమే
పరకామణి కేసులో జగన్, వైవీ సుబ్బారెడ్డి, భూమన పాత్ర ఉంది: జ్యోతుల నెహ్రూ
-
Dec 10, 2025 15:15 IST
చిన్న ప్రయత్నం విద్యార్ధుల్లో మార్పు తెచ్చింది: సీఎం చంద్రబాబు
పార్వతీపురం జిల్లా కలెక్టర్ గిరిజన పాఠశాలల్లో ముస్తాబు అనే ఓ కార్యక్రమం చేపట్టి విద్యార్ధుల్లో మార్పుతెచ్చారు: సీఎం చంద్రబాబు
పాఠశాలలో అద్దం, దువ్వెన ఏర్పాటు చేసి పరిశుభ్రత నేర్పే ప్రయత్నం చేశారు: సీఎం చంద్రబాబు
ఓ చిరు ప్రయత్నం విద్యార్ధుల్లో మంచి మార్పు తెచ్చింది: సీఎం చంద్రబాబు
10 సూత్రాల ఆధారంగా స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించుకుందాం: చంద్రబాబు
సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వ శాఖలు సిద్ధమవ్వాలి: సీఎం చంద్రబాబు
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రతీ మూడు నెలలకు ఓసారి సమీక్ష: సీఎం
రైతులు, పంటల ధరలు, రహదారులు, ఉద్యోగాల కల్పన,...
తాగునీరు, ధరల పెరుగుదల లాంటి అంశాల్లో మెరుగ్గా స్పందించాలి: సీఎం
వేసవిలో తాగునీరు, నీటి సరఫరాపై ప్రభుత్వ శాఖలు సిద్ధం కావాలి: చంద్రబాబు
-
Dec 10, 2025 13:05 IST
ఇండిగో విమానాల రద్దుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు: హైకోర్టు
ఇండిగో చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోయింది
ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని కేంద్రాన్ని ప్రశ్నించిన కోర్టు
సంక్షోభ సమయంలో విమాన సంస్థలు ఎలా ఛార్జీలు పెంచుతాయి?
ఇండిగో వ్యవహారంలో చట్టపరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్న కేంద్రం
ఇండిగో సంస్థకు ఇప్పటికే షోకాజ్ నోటీసు ఇచ్చామన్న కేంద్రం
విమానాల రద్దుపై ఇండిగో క్షమాపణలు చెప్పిందన్న కేంద్రం
-
Dec 10, 2025 12:03 IST
హైదరాబాద్: సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలను కలిసే అవకాశం
-
Dec 10, 2025 12:02 IST
వైసీపీ PPAలను రద్దు చేసి రూ.9 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసింది
కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్‌లో..
యూనిట్ విద్యుత్‌ను రూ.5.19 చొప్పున కొనుగోలు చేయాల్సి వచ్చేది
ఇప్పుడు దానిని రూ.4.92కు తగ్గించాం: సీఎం చంద్రబాబు
రూ.9 వేల కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకోవడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చింది..
అయినా ప్రజలపై భారం పడకూడదని నిర్ణయించాం: చంద్రబాబు
ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచం.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం: సీఎం
-
Dec 10, 2025 10:05 IST
హైదరాబాద్: కామాటిపుర దేవీబాగ్‌లో ఓ వ్యక్తి హత్య
అరవింద్ అనే వ్యక్తిని హత్య చేసిన అగంతకులు
దూద్‌బౌలి నుంచి కిషన్‌బాగ్ వెళ్తున్న అరవింద్
బైక్‌ను ఆపి అరవింద్‌పై కత్తులతో అగంతకులు దాడి
-
Dec 10, 2025 10:04 IST
రేపు కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక
కార్పొరేషన్ పరిధిలో 144 సెక్షన్
-
Dec 10, 2025 09:20 IST
గుంటూరు: చేబ్రోలు మం. శేకూరులో స్క్రబ్ టైఫస్ కేసు
ర్యాపిట్ టెస్టులో మహిళకు స్క్రబ్ టైఫస్ నిర్ధారణ
తెనాలి ప్రభుత్వాస్పత్రిలో మహిళకు చికిత్స
-
Dec 10, 2025 07:40 IST
ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీకి బెల్జియం సుప్రీంకోర్టులో చుక్కెదురు
మెహుల్ చోక్సీ అప్పీల్‌ను తిరస్కరించిన బెల్జియం సుప్రీంకోర్టు
భారత్ అప్పగింత అభ్యర్ధనను సవాల్ చేస్తూ మెహుల్ చోక్సీ అప్పీల్
చోక్సీ అప్పగింత ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపిన బెల్జియం అధికారులు
-
Dec 10, 2025 07:37 IST
ఏపీలో నేటినుంచి ఈ నెల 21 వరకు టెట్ పరీక్షలు
కంప్యూటర్ ఆధారంగా రెండు సెషన్లలో టెట్ ఎగ్జామ్స్
ఉ.9:30 నుంచి మ.12 గంటలు, మ.2 నుంచి సా.5 గంటల వరకు ఎగ్జామ్
-
Dec 10, 2025 07:37 IST
ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీకి బెల్జియం సుప్రీంకోర్టులో చుక్కెదురు
మెహుల్ చోక్సీ అప్పీల్‌ను తిరస్కరించిన బెల్జియం సుప్రీంకోర్టు
భారత్ అప్పగింత అభ్యర్ధనను సవాల్ చేస్తూ మెహుల్ చోక్సీ అప్పీల్
చోక్సీ అప్పగింత ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపిన బెల్జియం అధికారులు
-
Dec 10, 2025 07:36 IST
అన్నమయ్య: మొలకలచెరువు నకిలీ మద్యం కేసు
నిందితుడు జయ చంద్రారెడ్డి పీఏ రాజేష్ అరెస్టు
మదనపల్లి సబ్ జైలుకు తరలించిన ఎక్సైజ్ పోలీసులు
-
Dec 10, 2025 07:31 IST
హైదరాబాద్: నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి
ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సర్వం సిద్ధం పేరుతో సభ
-
Dec 10, 2025 07:31 IST
ఏజెన్సీ ప్రాంతాల్లో పెరిగిన చలి తీవ్రత
పలు చోట్ల సింగిల్ డిజిట్‌కు పడిపోయిన టెంపరేచర్
ఏజెన్సీల్లో దట్టంగా పొగమంచు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
వినుములూరులో 5, అరకు, చింతపల్లిలో 3, పాడేరులో 4 డిగ్రీలు