-
-
Home » Mukhyaamshalu » abn telugu brings you the latest news in your hands of july 30 vr
-

BREAKING: మాదాపూర్ ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్..
ABN , First Publish Date - Jul 30 , 2025 | 06:06 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 30, 2025 20:33 IST
మాదాపూర్ ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్ జామ్..
సాయంత్రం కురిసిన వర్షానికి మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం లింగంపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్.
ఐకియా నుంచి మైండ్ స్పేస్ మార్గంలో హైటెక్ సిటీ KPHB మార్గంలో బారులు తీరిన వాహనాలు.
ఐకియా ఫ్లైఓవర్ పై నుంచి కేబుల్ బ్రిడ్జి మార్గంలో, గచ్చిబౌలి కోండాపుర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్.
-
Jul 30, 2025 18:04 IST
హమ్మయ్య.. ఆ రెండు ప్రాంతాలు సునామీ నుంచి సేఫ్..
రష్యాలో భారీ భూకంపం సంభవించిన తరువాత సునామీ హెచ్చరికలు జారీ అయిన విషయం తెలిసిందే. తాజాగా రష్యా కీలక ప్రకటన చేసింది. కమ్చట్కా ద్వీపకల్పం, కిరిల్ ఐలాండ్‌కు సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రష్యా అధికారులు సునామీ వార్నింగ్ క్యాన్సి్ల్ ఆర్డర్‌ను జారీ చేశారు.
-
Jul 30, 2025 17:53 IST
నింగిలోకి దూసుకెళ్లిన GSLV F - 16 రాకెట్..
నెల్లూరు: శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం సెకెండ్ లాచ్ ప్యాడ్ నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లిన GSLV F - 16 రాకెట్.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నిసార్ శాటిలైట్‌ని నింగిలోకి మోసుకెళ్లిన GSLV F - 16.
18ని 35 సెకండ్లలో పూర్తికానున్న ప్రయోగం.
భూమికి 747 కిలోమీటర్ల ఎత్తులో నిసార్ శాటిలైట్‌ని నిర్దేశిత అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టనున్న GSLV F - 16 రాకెట్.
-
Jul 30, 2025 17:25 IST
బీసీ రిజర్వేషన్లు.. రంగంలోకి కేసీఆర్
బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పోరుబాట.
ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్ నిర్ణయం.
బీఆర్ఎస్ బీసీ నేతలతో కలసి ఢిల్లీలో రాష్ట్రపతిని కలవనున్న కేసీఆర్.
ఆగస్ట్ 8న కరీంనగర్‌లో బీఆర్ఎస్ సభ.
కరీంనగర్ సభకు హాజరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
-
Jul 30, 2025 17:12 IST
రాజ్ కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
విజయవాడ: శంషాబాద్ కాచారంలో సిట్ సోదాల్లో పట్టుబడ్డ 11 కోట్ల వ్యవహారంలో ట్విస్ట్.
సిట్ సీజ్ చేసిన 11 కోట్లకు తనకు సంబంధం లేదన్న లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డి.
ఈమేరకు ఎసిబి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రాజ్ కేసిరెడ్డి.
తనకు బెయిల్ రాకుండా అడ్డుకోవడం కోసమే సిట్ ప్రయత్నం చేస్తుందని పేర్కొన్న రాజ్ కేసిరెడ్డి.
-
Jul 30, 2025 13:43 IST
పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సం
రష్యా, జపాన్ తీరాలను తాకిన సునామీ
జపాన్ తీరంలో 3 మీటర్ల వరకు ఎగసిపడ్డ అలలు
అత్యవసర సేవలకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన జపాన్
30 దేశాలపై రష్యా సునామీ ఎఫెక్ట్
అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలు
అమెరికాలోని పలు తీరప్రాంతాలకూ సునామీ హెచ్చరికలు
అలస్కా, ఓరెగాన్, వాషింగ్టన్, హవాయి, చిలీ ప్రాంతాలకు హెచ్చరికలు
శాన్‌ఫ్రాన్సిస్కో, సౌత్‌కాలిఫోర్నియాను తాకనున్న సునామీ
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోనూ సునామీ హెచ్చరికలు
-
Jul 30, 2025 13:27 IST
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లా CRPF క్యాంప్‌లో కాల్పుల కలకలం
సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని CRPF జవాన్ ఆత్మహత్య
మృతుడు బిహార్ చల్‌పోఖారీ జిల్లాకు చెందిన పప్పు యాదవ్
నైమేడ్ పీఎస్ పరిధిలోని మింగాచల్ CRPF 22వ బెటాలియన్‌లో ఘటన
-
Jul 30, 2025 13:16 IST
గుంటూరు: మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్‌కు బెయిల్
గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తురకా కిషోర్
మరో కేసులో కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న రెంటచింతల పోలీసులు
కిషోర్‌ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ కుటుంబసభ్యుల ఆందోళన
కిషోర్‌ను అరెస్ట్ చేయకుండా చుట్టుముట్టిన కుటుంబసభ్యులు
తురకా కిషోర్‌ను రెంటచింతల పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు
కిషోర్ పై ఇప్పటికే పలు కేసులు నమోదు
గత స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా మాచర్లకు వచ్చిన...
టీడీపీ నేతల వాహనంపై దాడిచేసిన కిషోర్
పలు హత్యాయత్నం కేసుల్లోనూ నిందితుడిగా ఉన్న తురకా కిషోర్
-
Jul 30, 2025 13:02 IST
లిక్కర్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతోంది: మంత్రి పార్థసారధి
కక్ష సాధింపు చర్యలు ఉండవని సీఎం చంద్రబాబు ముందే చెప్పారు: పార్థసారధి
ఏపీ, ప్రజలకు నష్టం కలిగించిన ఎవరైనా జైలుకు వెళ్ళకు తప్పదు: పార్థసారధి
లిక్కర్ కేసులో ఎంతటి పెద్ద నాయకులు ఉన్నా చర్యలు తప్పవు: పార్థసారధి
-
Jul 30, 2025 12:51 IST
ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓబులాపురం మైనింగ్ కేసు విచారణ
ఏపీ, కర్ణాటక మధ్య అంతరరాష్ట్ర సరిహద్దు గుర్తింపుపై వాదనలు
ఏపీ, కర్ణాటక మధ్య మైనింగ్ లీజుల భౌగోళిక పరిధి గుర్తింపుపై వాదనలు
మైనింగ్‌ల సరిహద్దుల గుర్తింపునకు కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ వినతి
కమిటీలో ఎవరు ఉండాలనే అభిప్రాయం తెలిపేందుకు సమయం కోరిన ఏపీ
కేసు తదుపరి విచారణ ఆగస్టు 12కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
-
Jul 30, 2025 12:29 IST
2026 పద్మ అవార్డుల కోసం దరఖాస్తు గడువు పెంచిన కేంద్రం
జులై 31 వరకు ఉన్న గడువును ఆగస్టు 15 వరకు పెంచుతూ నిర్ణయం
స్వయం దరఖాస్తుల గడువు ఆగస్టు 15 వరకు పెంపు
-
Jul 30, 2025 11:59 IST
విజయవాడ: లిక్కర్ స్కామ్ కేసు
వరుణ్‌ను సిట్ ఆఫీస్‌కు తీసుకొచ్చిన అధికారులు
ఫామ్‌హౌస్‌లో సీజ్ చేసిన రూ.11కోట్లు విజయవాడకు చేర్చిన సిట్
మరింత సమాచారం కోసం వరుణ్‌ను ప్రశ్నించనున్న సిట్
-
Jul 30, 2025 11:54 IST
తిరుమల: శ్రీవాణి టిక్కెట్ల కోటాను భారీగా పెంచిన టీటీడీ
శ్రీవాణి టికెట్ల కోసం కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్
ఇక నుంచి ప్రతిరోజు కరెంటు బుకింగ్ కోటా కింద తిరుమల్లో 2 వేల టిక్కెట్లు,...
రేణిగుంట విమానాశ్రయంలో 400 టిక్కెట్లు జారీ చేయాలని నిర్ణయం
-
Jul 30, 2025 11:23 IST
ఏపీ సీబీసీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
సంజయ్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ గైర్హాజరుపై ధర్మాసనం ఆగ్రహం
విచారణ వాయిదా వేసేందుకు మొదట నిరాకరించిన సుప్రీంకోర్టు
విచారణలో జాప్యం కోసం ప్రయత్నిస్తున్నారన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాది
న్యాయవాది కపిల్ సిబాల్ రేపు విచారణకు హాజరుకాకుంటే..
ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించిన ధర్మాసనం
తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
-
Jul 30, 2025 10:54 IST
సీఎం రేవంత్‌రెడ్డితో మీనాక్షి నటరాజన్, మహేష్‌గౌడ్ భేటీ
నామినేట్ పోస్టుల భర్తీ, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిపై చర్చ
అజారుద్దీన్ వైపే మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ అధిష్టానం
-
Jul 30, 2025 10:53 IST
హైదరాబాద్: సృష్టి కేసులో అనాధగా మారిన శిశువు
శిశువును ఉంచుకునేందుకు ఇష్టపడని రాజస్థాన్ దంపతులు
ఇప్పటికే జైలులో ఉన్న బిడ్డకు జన్మనిచ్చిన అసోం దంపతులు
శిశువును అమీర్‌పేట్‌లోని శిశువిహార్‌కు తరలింపు
-
Jul 30, 2025 10:20 IST
జమ్మూకశ్మీర్: పూంచ్‌లో ఎన్‌కౌంటర్
భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Jul 30, 2025 10:20 IST
జమ్మూకశ్మీర్: భారీ వర్షాలతో అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
-
Jul 30, 2025 10:15 IST
సునామీ హెచ్చరికలతో భారత్ కాన్సులేట్ అప్రమత్తం
ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు
హెల్ప్‌లైన్ నెంబర్ 1-415-483-6629 ఏర్పాటు
-
Jul 30, 2025 09:54 IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు
కీలక నిందితుడు వరుణ్‌ను అదుపులోకి తీసుకున్న సిట్
నిన్న దుబాయ్ నుంచి వచ్చిన వరుణ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న ఏపీ సిట్
A1గా ఉన్న కసిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్‌లో కీలక వ్యక్తిగా వరుణ్
లిక్కర్ కేసు నమోదైన వెంటనే వరుణ్‌ను దేశం దాటించిన కీలక వ్యక్తులు
ఇప్పటికే వరుణ్‌పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
వరుణ్ నుంచి కీలక సమాచారం రాబట్టిన సిట్ అధికారులు
ఇవాళ, రేపు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించే అవకాశం
-
Jul 30, 2025 09:46 IST
రేపు నెల్లూరులో జగన్ పర్యటన
జైలులో కాకాణితో పాటు ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికెళ్లనున్న జగన్
-
Jul 30, 2025 09:33 IST
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై ఉత్కంఠ
రేపటితో ముగియనున్న జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు
ఇప్పటికే పూర్తయిన కాళేశ్వరం కమిషన్ విచారణ
రేపు ఫైనల్ రిపోర్టుపై సంతకం చేయనున్న పీసీ ఘోష్
ఆగస్టు 1 లేదా 2న ప్రభుత్వానికి కాళేశ్వరం రిపోర్ట్
-
Jul 30, 2025 09:27 IST
తెలంగాణ వ్యాప్తంగా ఈడీ దాడులు
గొర్రెల పంపిణీ కేసులో ఈడీ తనిఖీలు
10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు
BRS హయాంలో గొర్రెల స్కీమ్ పేరుతో స్కామ్ చేశారని ఈడీ కేసు
గొర్రెల స్కీమ్‌లో రూ.700కోట్ల అవినీతి జరిగిందని గతంలో ACB కేసు
ACB ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ
పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారడం,..
ఇతర రాష్ట్రాలకూ లింకు ఉండటంతో రంగంలోకి ఈడీ
-
Jul 30, 2025 08:21 IST
హైదరాబాద్: జీఎస్టీ ఎగవేతలకు అడ్డుకట్ట వేయాలి: రేవంత్‌రెడ్డి
జీఎస్టీ పరిధిలోని సంస్థలు సక్రమంగా పన్ను చెల్లించేలా చూడాలి
జీఎస్టీపై సందేహాల నివృత్తికి కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాలి: రేవంత్
పొరుగు రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేసి..
మేలైన విధానాలను అమలు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
-
Jul 30, 2025 08:14 IST
నేడు విద్యుత్‌శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
విద్యుదుత్పత్తి, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం పురోగతిపై చర్చ
హాజరుకానున్న డిప్యూటీ సీఎం భట్టి, అధికారులు
-
Jul 30, 2025 07:43 IST
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ దాడులు
ఏకకాలంలో 10 చోట్ల ఈడీ సోదాలు
-
Jul 30, 2025 07:43 IST
శ్రీహరికోట: సాయంత్రం GSLV-F16 ప్రయోగం
సా.5:40కి నింగిలోకి దూసుకెళ్లనున్న GSLV-F16 రాకెట్
నైసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనున్న GSLV-F16
-
Jul 30, 2025 07:39 IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు
12 పెట్టెల్లో దాచిన రూ.11 కోట్లు సీజ్ చేసిన సిట్
A40 వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో సిట్ తనిఖీలు
A1 కసిరెడ్డి ఆదేశాలతో డబ్బు దాచినట్టు అంగీకరించిన వరుణ్, చాణక్య
2024 జూన్‌లో డబ్బు దాచినట్టు గుర్తించిన సిట్ అధికారులు
శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్‌హౌస్‌లో డబ్బు స్వాధీనం
సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ బాల్‌రెడ్డి పేర్లపై ఫామ్‌హౌస్ ఉన్నట్టు గుర్తింపు
-
Jul 30, 2025 07:38 IST
నేడు జస్టిస్ వర్మ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
కమిటీ నివేదిక చెల్లదని జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్
పిటిషన్ దాఖలు చేసిన తీరుపై ధర్మాసనం అసంతృప్తి
పిటిషన్‌ను సవరించుకుని రావాలన్న సుప్రీంకోర్టు
-
Jul 30, 2025 07:28 IST
నేడు ఏపీ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు
ఫలితాలు విడుదల చేయనున్న హోంమంత్రి అనిత
-
Jul 30, 2025 07:28 IST
భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరలేదు: ట్రంప్
ఆగస్టు 1లోపు వాణిజ్య ఒప్పందం కొలిక్కిరాకపోతే..
20 నుంచి 25శాతం సుంకాలు విధిస్తాం: ట్రంప్
ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మాపై భారీ సుంకాలు విధించింది
త్వరలో 200 దేశాలకు కొత్త సుంకాల రేటు ఖరారు చేస్తాం: ట్రంప్
-
Jul 30, 2025 07:28 IST
articleText
-
Jul 30, 2025 07:08 IST
బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ద్రోణి
నేడు తెలంగాణలో మోస్తరు వర్షాలు
ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన
ఉత్తరాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వర్షాలు
-
Jul 30, 2025 06:17 IST
వైద్య పరికరాల ఉత్పత్తిలో దూసుకెళ్తున్న భారత్
గణనీయంగా పెరుగుతున్న ఉత్పత్తి, ఎగుమతులు
తగ్గిన స్టెంట్లు, మోకీలు మార్పిడి కిట్ల ధరలు
-
Jul 30, 2025 06:09 IST
నేడు 4వ రోజు సింగపూర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
ఇవాళ కూడా పలు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం
సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతోనూ చర్చలు
క్యాపిటాలాండ్ ఇన్వెస్ట్‌మెంట్, మండాయ్ వైల్డ్‌లైఫ్,..
SMBC బ్యాంక్, టెమసెక్ కంపెనీ ప్రతినిధులతో భేటీ
అలాగే సింగపూర్ విదేశాంగ మంత్రితో సీఎం చంద్రబాబు సమావేశం
తర్వాత నేషనల్ సెక్యూరిటీ అండ్ హోంఅఫైర్స్ మంత్రితో విందు సమావేశం
మధ్యాహ్నం సెంబ్‌క్రాప్ సీఓఓతో ముఖ్యమంత్రి సమావేశం
-
Jul 30, 2025 06:08 IST
రష్యాలో భారీ భూకంపం
రష్యాతీరంలో సునామీ హెచ్చరికలు జారీ చేసిన జపాన్
-
Jul 30, 2025 06:06 IST
నేడు నైసార్ ఉపగ్రహ ప్రయోగం
సా.5:40కి నింగిలోకి దూసుకెళ్లనున్న GSLV-F16 రాకెట్
రూ.11,200 కోట్లతో నాసా, ఇస్రో ఉమ్మడి ప్రయోగం
అత్యంత ఖరీదైన భూపరిశీలన ఉపగ్రహంగా నైసార్ రికార్డు