-
-
Home » Mukhyaamshalu » abn telugu brings you the latest breaking news in your hands of july 27 vr
-
BREAKING: సింగపూర్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్
ABN , First Publish Date - Jul 27 , 2025 | 06:19 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Jul 27, 2025 17:36 IST
సింగపూర్ తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్
NRIలే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లు.
భారత్ FDIలలో సింహభాగం సింగపూర్ నుంచే.
ఏపీలో సింగపూర్ FDIలకు సహకరించండి.
20 లక్షల ఉద్యోగాలు మా నినాదం... మా విధానం.
P-4 ద్వారా పేదరిక నిర్మూలనలో భాగస్వాములు కావాలి.
-
Jul 27, 2025 16:22 IST
కాంగోలో తిరుగుబాటుదారుల దాడి, 21 మంది మృతి.
కాంగోలో చర్చి ప్రాంగణంలో దాడి.
పలు ఇళ్లు, షాపులు తగలబెట్టిన తిరుగుబాటుదారులు.
-
Jul 27, 2025 15:46 IST
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు..
అమరావతి: కడప జిల్లా సున్నపురాల్లెలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు జెఎస్‌డబ్ల్యూ ఎపీ స్టీల్ లిమిటెడ్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం.
రూ. 4,500 కోట్ల పెట్టుబడితో మొదటి దశ, రూ. 16,350 కోట్లతో రెండో దశల పనులు చేపట్టే ప్రతిపాదనలకు ఆమోదం.
JSW రాయలసీమ స్టీల్ ప్లాంట్ లిమిటెడ్‌కు ప్రోత్సాహకాలిస్తూ ప్యాకేజీ విస్తరిస్తూ ప్రభుత్వం ఆదేశాలు.
విద్యుత్, నీటి కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన చర్యలు ఆమోదిస్తూ ఆదేశాలు.
సున్నపురాళ్ల పల్లె పరిధిలో ఎకరా రూ. 5 లక్షల చొప్పున 1100 ఎకరాల భూములు కేటాయిస్తూ ఆదేశాలు.
జనవరి 2026 నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు ప్రారంభించాలని నిర్దేశించిన ప్రభుత్వం.
ఏప్రిల్ 2029 నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని తెలిపిన ప్రభుత్వం.
జనవరి 2031 నాటికి స్టీల్ ప్లాంట్ రెండో దశ పనులు ప్రారంభిస్తామని ప్రతిపాదనల్లో తెలిపిన సంస్థ.
ఏప్రిల్ 2034 నాటికి స్టీల్ ప్లాంట్ రెండో దశ పనులు పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రతిపాదించిన సంస్థ.
ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఇచ్చిన ప్రతిపాదలనలను ఆమోదిస్తూ ఆదేశాలిచ్చిన రాష్ట్రప్రభుత్వం.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న సంస్థకు ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు.
తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్, జలవనరులు, పరిశ్రమలు, రెవెన్యూ, ఆర్ధిక శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశం.
తగు చర్యలు ఎపీఐఐసీ వీసీ అండ్ ఛైర్మన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌కు ఆదేశాలు.
ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి వై.యువరాజ్.
-
Jul 27, 2025 13:14 IST
హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో నిందితులకు రిమాండ్
నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన మారేడుపల్లి కోర్టు
నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
ఏ1 నమ్రత పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు
దేశంలో అనేక చోట్ల సృష్టి ఆస్పత్రికి సంబంధించి బ్రాంచ్‌లు
సరోగసి, IVF, IUI విధానాల ద్వారా పిల్లలు కలిగిస్తామని..
భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న నమ్రత ముఠా
-
Jul 27, 2025 12:34 IST
కరీంనగర్: కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఎంపీ సి.ఎం.రమేష్ చెప్పింది వాస్తవం: బండి సంజయ్
కేసీఆర్ మొదట కేటీఆర్‌కు టికెట్ ఇవ్వలేదు: బండి సంజయ్
సిరిసిల్లలో కేటీఆర్‌కు టికెట్ ఇప్పించింది సి.ఎం.రమేష్
-
Jul 27, 2025 11:52 IST
హైదరాబాద్: రేవ్ పార్టీలో వెలుగులోకి సంచలన విషయాలు
రేవ్ పార్టీలో కీలక వ్యక్తిగా అప్పికోట్ల అశోక్‌కుమార్
అశోక్‌కుమార్ దగ్గర డ్రగ్స్‌తో పాటు కండోమ్స్ లభ్యం
డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులకు రేవ్ పార్టీల పేరుతో వల
యువతులు మత్తులో ఉన్నప్పుడు..
లైంగిక వాంచ తీర్చుకుంటున్న అశోక్ అండ్ గ్యాంగ్
డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న రాహుల్
రేవ్ పార్టీలో ముగ్గురు యువతులు సహా 9 మంది అరెస్ట్
నిందితుల్లో ఒకరికి డ్రగ్ పాజిటివ్
-
Jul 27, 2025 11:23 IST
గద్వాల్: మంత్రి తుమ్మలకు టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు సవాల్
యూరియాపై మంత్రి తుమ్మల చర్చకు సిద్ధమా?: రాంచందర్‌రావు
తెలంగాణలో యూరియా దొరకని పరిస్థితి ఏర్పడింది: రాంచందర్‌రావు
తెలంగాణకు 9లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే..
కేంద్రం 12లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చింది: రాంచందర్‌రావు
రైతులకు యూరియా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు?: రాంచందర్‌రావు
కాంగ్రెస్ హయాంలోనే ఎరువుల కొరత, రైతుల ఆత్మహత్యలు: రాంచందర్
కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాన్ని బీజేపీపై నెట్టేస్తోంది: రాంచందర్‌రావు
తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ.. ప్రజలతోనే దోస్తీ: రాంచందర్‌రావు
-
Jul 27, 2025 10:59 IST
గతంలో సింగపూర్‌తో కలిసి అమరావతి ప్రాజెక్ట్‌ను చేపట్టాం: చంద్రబాబు
కొన్ని కారణాలతో అమరావతి ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ బయటకు వెళ్లింది
రాజధాని నిర్మాణ భాగస్వామ్యం విషయంలో అలా జరిగి ఉండకూడదు
ఈ పర్యటనలో కొన్ని రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నిస్తా: చంద్రబాబు
గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం: చంద్రబాబు
గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఏపీలో ఇప్పటికే పట్టాలెక్కాయి: చంద్రబాబు
ఇండియా క్వాంటం మిషన్‌లో క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటు
విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు అవుతుంది: సీఎం చంద్రబాబు
డిఫెన్స్, ఏరో స్పేస్, ఎలక్ట్రానికి, ఆటోమొబైల్ సంస్థలకు..
రాయలసీమ ప్రాంతంలో అనువైన పరిస్థితులు ఉన్నాయి: చంద్రబాబు
భారత్‌కు సింగపూర్ నుంచి పెట్టుబడులు రావాలి..
వాటికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: ఏపీ సీఎం చంద్రబాబు
-
Jul 27, 2025 10:52 IST
హైదరాబాద్: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు
ఏడుగురు నిందితులకు ముగిసిన వైద్య పరీక్షలు
కాసేపట్లో న్యాయాధికారి ఎదుట హాజరుపర్చనున్న పోలీసులు
డాక్టర్ నమ్రతతో పాటు ఆరుగురు అరెస్ట్
-
Jul 27, 2025 10:35 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపటి సిట్ విచారణకు రాలేనన్న బండి సంజయ్
పార్లమెంట్ సమావేశాల కారణంగా విచారణకు రాలేనన్న బండి సంజయ్
విచారణకు హాజరయ్యే తేదీని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపిన సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా బండి సంజయ్‌ని పిలిచిన సిట్
-
Jul 27, 2025 10:29 IST
హైదరాబాద్: కొండాపూర్‌లో రేవ్ పార్టీ భగ్నం
9 మంది అరెస్ట్, 6 కార్లు స్వాధీనం
సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో భారీగా మద్యం, డ్రగ్స్ గుర్తింపు
11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
యువతులను ఏపీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి రేవ్ పార్టీ
యువతులతో అసభ్యకర నృత్యాలు చేయించిన ఏపీ వాసులు
నిర్వాహకులు విజయవాడకు చెందిన నాయుడు, శివం రాయుడు
-
Jul 27, 2025 10:10 IST
ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు జస్టిస్ పీసీ ఘోష్
కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ నివేదికను..
నెలాఖరు లోపు ప్రభుత్వానికి అందించనున్న పీసీ ఘోష్
-
Jul 27, 2025 10:05 IST
ఢిల్లీ ఏపీ భవన్‌లో పవన్ కొత్త చిత్రం ప్రదర్శన
సా.4గంటలకు అంబేద్కర్ ఆడిటోరియంలో షో
ఢిల్లీలో స్థిరపడిన తెలుగువారి కోసం సినిమా ప్రదర్శన
-
Jul 27, 2025 09:11 IST
నాగర్‌కర్నూల్: ఉయ్యాలవాడ గురుకులంలో ఫుడ్‌పాయిజన్
పాఠశాలలో ఆహారం తిని 70 మంది విద్యార్థినులకు అస్వస్థత
విద్యార్థినులకు వాంతులు, ఆస్పత్రికి తరలింపు
-
Jul 27, 2025 09:10 IST
మహబూబ్‌నగర్: అచ్చుతాపూర్‌లో చిరుత కలకలం
ముగ్గురు గొర్రెల కాపురలపై చిరుత దాడి, ఆస్పత్రికి తరలింపు
రాత్రి గొర్రెల మందపై దాడి చేసిన చిరుత
కుక్క అనుకుని ఎదిరించేందుకు యత్నం
-
Jul 27, 2025 08:32 IST
ములుగు: మైతాపురం ఫారెస్ట్‌లో విద్యార్థులు మిస్సింగ్
జలపాతాల సందర్శనకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు
తిరుగు ప్రయాణంలో అడవిలో తప్పిపోయిన విద్యార్థులు
డయల్ 100కు ఫోన్ చేయడంతో వెంటనే స్పందించిన పోలీసులు
ఏడుగురిని సురక్షితంగా కాపాడిన వెంకటాపురం పోలీసులు
-
Jul 27, 2025 08:20 IST
నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి,..
విశాఖ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
Jul 27, 2025 08:08 IST
అన్నమయ్య: కన్యాకుమారి-ముంబై ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
కన్యాకుమారి-ముంబై ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు
వెంటనే గుర్తించి నందలూరు రైల్వేస్టేషన్ దగ్గర రైలును నిలిపిన సిబ్బంది
సకాలంలో మంటలార్పిన అగ్పిమాపక సిబ్బంది
సాంకేతిక లోపంతో మంటలు చెలరేగినట్టు గుర్తించిన రైల్వే అధికారులు
-
Jul 27, 2025 07:27 IST
హైదరాబాద్: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో తనిఖీలు
కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
సిబ్బందిని లోపలే ఉంచి ప్రశ్నించిన పోలీసులు
రా.2:30 తర్వాత సిబ్బందిని పంపించిన పోలీసులు
ఇప్పటికే విజయవాడలో డాక్టర్ నమృత అరెస్ట్
-
Jul 27, 2025 06:41 IST
తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజులు వర్ష సూచన
పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
-
Jul 27, 2025 06:37 IST
రేపటి నుంచి పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ
లోక్‌సభ, రాజ్యసభలో 16గంటల చొప్పన చర్చకు సమయం
సిందూర్‌పై రేపు లోక్‌సభలో, ఎల్లుండి రాజ్యసభలో చర్చ
-
Jul 27, 2025 06:25 IST
ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు జస్టిస్ పీసీ ఘోష్
కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ నివేదికను..
నెలాఖరు లోపు ప్రభుత్వానికి అందించనున్న పీసీ ఘోష్
-
Jul 27, 2025 06:22 IST
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్
నేడు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ మధ్య రెండో గేమ్
నేడు కూడా డ్రా అయితే 28న టై బ్రేక్‌తో విజేత ప్రకటన
-
Jul 27, 2025 06:19 IST
సింగపూర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు బృందం
ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు, పారిశ్రామిక వేత్తలు
కూచిపూడి నాట్యంతో సీఎంకు ఘనస్వాగతం పలికిన చిన్నారులు
5 రోజుల పర్యటనలో 29 సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు
మధ్యాహ్నం తెలుగు డయాస్పోరాలో పాల్గొననున్న చంద్రబాబు
చంద్రబాబు బృందంలో మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, అధికారులు