-
-
Home » Mukhyaamshalu » abn telugu brings you the latest breaking news in your hands of august 2nd v reddy
-

BREAKING: తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం
ABN , First Publish Date - Aug 03 , 2025 | 06:11 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Aug 03, 2025 19:13 IST
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ముగిసిన సమావేశం
బాధ్యులపై క్రిమినల్ చర్యలకు కమిషన్ సూచన
కేసీఆర్, హరీష్‌రావు, ఈటల పాత్రలపై నివేదిక
కేసీఆర్, హరీష్‌రావు ఆదేశాలతోనే నిర్మాణాలు
ఆర్థిక శాఖ, అధికారుల లోపాలపైనా కమిషన్ దృష్టి
-
Aug 03, 2025 19:12 IST
హైదరాబాద్: తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం
రేపటి నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్
తమ వేతనాలు 30 శాతం పెంచాలని ఫెడరేషన్ నాయకులు డిమాండ్
వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌లో పాల్గొంటాం: ఫిలిం ఫెడరేషన్
వేతనాలు పెండింగ్ లేకుండా రోజు వారీగా చెల్లించాలి: ఫిలిం ఫెడరేషన్
-
Aug 03, 2025 19:07 IST
నేను కేసీఆర్ బిడ్డను అక్కడే జరుగుతుందో నాకు బాగా తెలుసు: MLC కవిత
నా మీద దిగజారుడు వ్యాఖ్యలు చేయించిన ఆ పెద్ద నేత తన స్థాయిని దిగజార్చుకున్నాడు: MLC కవిత
తెలంగాణ ఆడబిడ్డను నేను.. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా: MLC కవిత
కవిత ఎవరు అంటూ మాట్లాడుతున్న ఓ లిల్లీపుట్ నాయకుడు..
నల్లగొండ జిల్లాలో BRSను నాశనం చేశాడు: MLC కవిత
కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ నాయకుడు ఎవరు?: MLC కవిత
ఆ లిల్లీపుట్ నాయకుడి వెనుక ఎవరున్నారో నాకు తెలుసు: MLC కవిత
నల్లగొండ జిల్లాలో అన్ని సీట్లు ఓడిపోవడానికి ఆయనే కారణం: MLC కవిత
నా గురించి ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి: MLC కవిత
నన్ను ఒంటరిని చేసి సంబరపడుతూ శునకానందం పొందుతున్నారు : MLC కవిత
అది తప్పకుండా మీకు రివర్స్ కొడుతుంది: MLC కవిత
-
Aug 03, 2025 19:07 IST
BRS నేతలపై MLC కవిత ఆగ్రహం
నాపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక BRS పెద్దనేత హస్తం ఉంది: MLC కవిత
అందుకే నాకు మద్దతుగా BRS నేతలు స్పందించలేదు: MLC కవిత
BRSలో కుట్రలకు పాల్పడే ఆ పెద్ద నాయకుడు..
నా విషయంలో చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడు: MLC కవిత
నా దగ్గర కొందరు కోవర్టులను పెట్టి..
నా విషయాలు తెలుసుకుంటున్నానని సంబరపడుతున్నాడు: MLC కవిత
-
Aug 03, 2025 17:32 IST
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక సమావేశం
తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన భేటీ
సమావేశానికి హాజరైన ముగ్గురు అధికారుల కమిటీ
టీజీ కేబినెట్‌కు ఇవ్వాల్సిన కాళేశ్వరం నివేదికపై చర్చ
రేపు TG కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిటీ నివేదిక
-
Aug 03, 2025 17:30 IST
MLC కవితకు మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్
నా ఉద్యమ ప్రస్థానంపై కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు: జగదీష్‌రెడ్డి
BRSను ఖతం చేయాలని కేసీఆర్ శత్రువులు ఏం మాట్లాడుతున్నారో ఆ వ్యాఖ్యలనే కవిత వల్లె వేస్తున్నారు: జగదీష్‌రెడ్డి
నల్లగొండ జిల్లాలో గెలుపోటములకు నాదే బాధ్యత: జగదీష్‌రెడ్డి
-
Aug 03, 2025 13:42 IST
సినీ పరిశ్రమలో మరో కొరియోగ్రాఫర్‌పై పోక్సో కేసు, రిమాండ్‌కు తరలింపు
'ఢీ' కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌పై గచ్చిబౌలి సీఎస్‌లో పోక్సో కేసు నమోదు
కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌పై జులైలో గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదు
అనుచితంగా వ్యవహరించడంతో బాలిక కుటుంబసభ్యులు ఫిర్యాదు
కేసు నమోదు తర్వాత అజ్ఞాతంలోకి కృష్ణ మాస్టర్
బెంగుళూరులో కృష్ణ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
అనంతరం కంది జైలుకు తరలించిన గచ్చిబౌలి పోలీసులు
ఇటీవలే కృష్ణ మాస్టర్‌కు మహిళతో వివాహం.
భార్య సంబంధించిన 9.50 లక్షలు నగదు తీసుకువెళ్లిన కృష్ణ మాస్టర్
గతంలో కూడా కృష్ణ మాస్టర్‌పై పలు ఆరోపణలు
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలువురు యువతులను మోసం చేసినట్లు కృష్ణపై అభియోగాలు
-
Aug 03, 2025 12:27 IST
మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు
కొడాని నానిపై ఐటీ యాక్టు నమోదు
సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు,..
కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై ఫిర్యాదు
2024లో విశాఖ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విశాఖవాసి అంజనాప్రియ
కొడాలి నానిపై U/S353(2), 352, 351(4), 196(1) BNS 467, IT యాక్టు నమోదు
గుడివాడలో కొడాలి నానికి నోటీసులు ఇచ్చిన విశాఖ త్రీటౌన్ పోలీసులు
-
Aug 03, 2025 11:22 IST
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్, ముగ్గురు ఉగ్రవాదుల హతం
కుల్గాం అఖల్‌దేవ్‌సర్‌లో మూడు రోజులుగా ఆపరేషన్
మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల గాలింపు
-
Aug 03, 2025 11:21 IST
పోలీసు కస్టడీకి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం తహసీల్దార్ ఆఫీసులో రికార్డుల తారుమారు కేసులో కస్టడీ
ఇవాళ, రేపు కాకాణిని ప్రశ్నించనున్న గుంటూరు సీఐడీ పోలీసులు
నెల్లూరు పోలీసు శిక్షణ కేంద్రంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి విచారణ
కాకాణిని న్యాయవాది సమక్షంలో ప్రశ్నించనున్న పోలీసులు
భూ రికార్డుల తారుమారు కేసులో 14వ నిందితుడిగా కాకాణి
-
Aug 03, 2025 11:15 IST
మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు అయ్యన్నపాత్రుడు లేఖ
విశాఖ భూఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని లేఖ
మాజీ సైనికుల భూముల ఎన్‌వోసీల జారీలో అక్రమాలపై మూర్తియాదవ్ ఆరోపణలు
అక్రమాలపై ఆరోపిస్తూ అయ్యన్నపాత్రుడు పేరు ప్రస్తావించిన మూర్తియాదవ్
విచారణకు ఆదేశించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
మూర్తి ఆరోపణలపై ఎండాడ-2లో భూములకు ఎన్‌వోసీ పక్రియపై విచారణ
-
Aug 03, 2025 09:29 IST
రాజమండ్రి: సరోగసి ముసుగులో మోసం
యూఎస్ ఉమెన్ కేర్ అండ్ ఫెర్టిలిటీపై ఫిర్యాదులు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి, ప్రకాశ్‌నగర్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు
వైజాగ్‌లో సృష్టి కేంద్రానికి రిఫర్ చేశారని బాధితుల ఆరోపణ
యూఎస్ ఉమెన్ కేర్, ఫెర్టిలిటీ సెంటర్‌కు నోటీసులు
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ కమిటీ నియామకం
-
Aug 03, 2025 09:24 IST
తిరుమల శ్రీవారి దర్శనంలో AI వినియోగంపై మాజీ సీఎస్ కీలక వ్యాఖ్యలు
గంటలో శ్రీవారి దర్శనం అనేది అసంభవం: ఎల్వీ సుబ్రహ్మణ్యం
ప్రస్తుత విధానాన్ని మించి దర్శనంలో మార్పు చేసే అవకాశం లేదు
AI పేరుతో టీటీడీ ధనాన్ని వృథా చేయడం మంచిది కాదు : ఎల్వీ సుబ్రహ్మణ్యం
-
Aug 03, 2025 09:23 IST
ఫెర్టిలిటీ సెంటర్లపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఫోకస్
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో తనిఖీలు
ఫెర్టిలిటీ సెంటర్ల లైసెన్స్, ట్రీట్‌మెంట్ ప్రాసెస్..
రికార్డ్స్‌ను పరిశీలించిన వైద్యారోగ్యశాఖ బృందాలు
ఇవాళ, రేపు తనిఖీలు పూర్తి చేసి నివేదిక అందజేత
మరోవైపు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
నిర్వహణ లోపాలు గుర్తించేందుకు కమిటీ నియామకం
10 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశం
-
Aug 03, 2025 08:01 IST
సృష్టి కేసులో నేడు మూడోరోజు డాక్టర్ నమ్రత విచారణ
నిన్న 6 గంటల పాటు విచారించిన గోపాలపురం పోలీసులు
పిల్లల విక్రయాలపై కొనసాగిన పోలీసుల విచారణ
ఫ్రీ క్యాంపుల వివరాలను అడిగి తెలుసుకున్న పోలీసులు
సృష్టి కేసులో ఇప్పటివరకు 11 మంది అరెస్ట్
సృష్టి కేసులో మరిన్ని అరెస్ట్‌లు ఉండే అవకాశం
-
Aug 03, 2025 06:39 IST
నేడు ఖానాపూర్‌లో మీనాక్షి నటరాజన్ పర్యటన
జనహిత పాదయాత్రలో పాల్గొననున్న నటరాజన్
బాధనకుర్తి నుంచి ఖానాపూర్ వరకు పాదయాత్ర
రెండు రోజుల పాటు నిర్మల్ జిల్లాలో పర్యటన
-
Aug 03, 2025 06:28 IST
ఓవల్ టెస్ట్: భారత్ 396 ఆలౌట్
ఇంగ్లండ్ టార్గెట్ 374 పరుగులు
తొలి ఇన్నింగ్స్ స్కోర్లు: భారత్ 224, ఇంగ్లండ్ 247
-
Aug 03, 2025 06:11 IST
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనున్న కేబినెట్