-
-
Home » Mukhyaamshalu » abn telugu brings you the latest breaking news in your hands of august 1st vr
-

BREAKING: ABN ఆంధ్రజ్యోతి చేతిలో మద్యం ముడుపుల వీడియో
ABN , First Publish Date - Aug 02 , 2025 | 06:11 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
Aug 02, 2025 20:58 IST
ABN ఆంధ్రజ్యోతి చేతిలో మద్యం ముడుపుల వీడియో
ఏకంగా డబ్బుల డెన్‌లో దొరికిపోయిన నిందితుల వీడియో
మద్యం స్కామ్ కేసులో అడ్డంగా దొరికిన చెవిరెడ్డి గ్యాంగ్
వెలుగులోకి డబ్బుల డెన్‌లో వెంకటేష్ నాయుడు వీడియో
మద్యం ముడుపుల డెన్‌లో నోట్లకట్టలతో అడ్డంగా దొరికిన చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు వీడియో
డెన్‌లో డబ్బులు లెక్కిస్తూ వెంకటేష్‌నాయుడు వీడియో
ఇప్పటివరకు మద్యం వ్యాపారంతో సంబంధం లేదని భూకాయిస్తున్న చెవిరెడ్డి
చెవిరెడ్డికి సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు డెన్‌లో దొరకటంతో అడ్డంగా బుక్ అయినట్లేనని చెబుతున్న న్యాయనిపుణులు
-
Aug 02, 2025 20:58 IST
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం
చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు దగ్గర భారీగా నోట్ల కట్టలు
విచారణలో వెంకటేష్ వాట్సాప్ నుంచి వీడియోలు రిట్రీవ్ చేసిన సిట్
నోట్ల కట్టల వీడియోలను బయటపెట్టిన సిట్
-
Aug 02, 2025 19:17 IST
వ్యాపారవేత్త అనిల్ అంబానీ కేసులో తొలి అరెస్టు
అనిల్ అంబానీకి గ్యారెంటీ ఇచ్చిన వ్యక్తి అరెస్టు
బ్యాంకు రుణాల మోసం కేసులో ఈడీ చర్యలు
ఈనెల 5న హాజరుకావాలని ఇప్పటికే అనిల్ అంబానీకి నోటీసులు
రూ.17 వేల కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసులో ప్రశ్నించనున్న ఈడీ
అనిల్ అంబానీ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు
-
Aug 02, 2025 18:50 IST
యశస్వి జైస్వాల్ సెంచరీ
లండన్ టెస్టు: యశస్వి జైస్వాల్ సెంచరీ
127 బంతుల్లో సెంచరీ చేసిన జైస్వాల్
టెస్టు కెరీర్‌లో 6వ సెంచరీ చేసిన జైస్వాల్
-
Aug 02, 2025 17:36 IST
మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
ఈ నెల 21లోగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం
కేటీఆర్ పరువునష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాలు
నటి సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ
-
Aug 02, 2025 16:48 IST
సృష్టి ఫెర్టిలిటీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
కస్టడీ విచారణలో బయటపడుతున్న డా. నమ్రత అక్రమాలు
నిరుపేద మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ సేవలంటూ గ్రామీణ ప్రాంతాల్లో సృష్టి ఫెర్టిలిటీ మెడికల్ క్యాంప్స్ నిర్వహణ
ఏపీలోని పలు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్స్
పేదల ఆర్థిక అవసరాలు గుర్తించి ట్రాప్‌లో పెడుతున్న ఏజెంట్స్
డాక్టర్ నమ్రత బ్యాచ్ చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడినట్లు గుర్తింపు
సృష్టి కేసులో నమ్రత సహా కీలక నిందితులు కల్యాణి, సంతోషి
-
Aug 02, 2025 16:26 IST
JDS మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు
అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధించిన కర్ణాటక కోర్టు
బాధితురాలికి రూ.7 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం
-
Aug 02, 2025 14:45 IST
కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
కాళేశ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు వృథా చేశారని కమిషన్ తేల్చింది
ఇంజినీర్లు చెప్పింది వినకుండా కేసీఆర్ తన సొంత లాభం చూసుకున్నారు
తనకు ఇష్టమున్నచోట ప్రాజెక్టు కట్టాలని కేసీఆర్ ఆదేశించారు: మహేష్‌గౌడ్
రెండు పిల్లర్లు మాత్రమే కూలాయంటున్నారు.. ఇది సామాన్య విషయమా?
ఫార్ములా ఈ-రేస్‌లో కేటీఆర్ అవినీతికి పాల్పడలేదా?: మహేష్‌గౌడ్
ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లు తిరిగి కక్కక తప్పదు: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
-
Aug 02, 2025 13:13 IST
పాక్‌పై యుద్ధం చేసి తూర్పు పాకిస్తాన్ విడదీసింది కాంగ్రెస్: రేవంత్‌రెడ్డి
పాకిస్తాన్‌ను ముక్కలు చేశారు ఇందిరాగాంధీ
దేశం కోసం తన ప్రాణాన్ని కూడా ఇందిరా త్యాగం చేశారు
ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత సోనియాది
రాహుల్ ప్రధాని కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేవారు: రేవంత్‌రెడ్డి
-
Aug 02, 2025 13:08 IST
ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన
ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి
-
Aug 02, 2025 12:52 IST
'అన్నదాత సుఖీభవ' పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
లబ్ధిదారులకు 'అన్నదాత సుఖీభవ' చెక్కులు అందజేసిన సీఎం
'అన్నదాత సుఖీభవ' తో ఏపీలో 46 లక్షల మంది రైతులకు లబ్ధి
దర్శి మం. తూర్పు వీరాయపాలెంలో రైతులతో సీఎం ముఖాముఖి
-
Aug 02, 2025 12:48 IST
హైదరాబాద్: గ్రేటర్‌లో కొనసాగుతోన్న GHMC ఫుడ్ సేఫ్టీ దాడులు
ఈ-కామర్స్ డెలివరీ పాయింట్స్‌పై GHMC ఫోకస్
స్విగ్గి, జిట్టో, బ్లికింట్ డెలివరీ పాయింట్స్‌పై అధికారుల దాడులు
నగరంలో 10 బృందాలతో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ ల స్టోర్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తింపు
ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే నాసిరకం వస్తువులు డెలివరీ చేస్తున్నారని జీహెచ్ఎంసీ కి ఫిర్యాదులు.
నగరవ్యాప్తంగా 30 స్టోర్స్ లో తనిఖీలు చేసి 40 శాంపిల్స్ సేకరించి ఫుడ్ సేఫ్టీ అధికారులు
టెస్ట్ కోసం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ కి పంపిన అధికారులు
-
Aug 02, 2025 12:42 IST
మోదీ తన కుర్చీ వదులుకోవడానికి సిద్ధంగా లేరు: రేవంత్‌రెడ్డి
75 ఏళ్ల తర్వాత పదవి వదులుకోవాలని మోహన్ భగవత్ అన్నారు
మోదీ మాత్రం తన కుర్చీ వదులుకోవడం లేదు: సీఎం రేవంత్
అద్వానీ, మురళీ మనోహర్‌జోషికి వర్తించిన వయసు మోదీకి ఉండదా?
కాంగ్రెస్ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి
మోదీని ఓడిస్తాం, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతాం: రేవంత్‌రెడ్డి
-
Aug 02, 2025 12:36 IST
అర్హులైన ప్రతి రైతుకు 'అన్నదాత సుఖీభవ' అమలు: మంత్రి నిమ్మల రామానాయుడు
వైసీపీ పాలనలో రైతు భరోసా పేరుతో రైతాంగాన్ని మోసం చేసిన జగన్
రైతుల పక్షపాతిగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం: మంత్రి నిమ్మల రామానాయుడు
తన పాలనలో వ్యవసాయాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు జగన్ మొసలి కన్నీరు
రైతులకు ఆక్సిజన్ లాంటి బీమాను చెల్లించని జగన్: నిమ్మల రామానాయుడు
-
Aug 02, 2025 12:29 IST
తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి: ప్రధాని మోదీ
రైతుల సంక్షేమ పథకాలను రద్దు చేస్తానని కాంగ్రెస్, ఎస్పీ దుష్ర్రచారం
పేదల హక్కులను ఎవరూ కాలరాయలేరు: ప్రధాని మోదీ
'డ్రోన్ దీదీ' పథకంతో ఎంతో మంది జీవితాలు మారిపోయాయి: మోదీ
దేశవ్యాప్తంగా వేల గోడౌన్లు నిర్మించాం: ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది లక్‌పతి దీదీలను తయారుచేస్తున్నాం: ప్రధాని
ఇప్పటికే కోటిన్నర మంది లక్‌పతీ దీదీలుగా మారారు: ప్రధాని మోదీ
-
Aug 02, 2025 12:29 IST
ఢిల్లీ: మరోసారి ఈసీపై రాహుల్‌గాంధీ మండిపాటు
2014 నుంచి ఎన్నికల కమిషన్‌పై మాకు అనుమానాలు: రాహుల్‌గాంధీ
కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాకపోవడం ఏంటి?: రాహుల్
దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది: రాహుల్‌గాంధీ
లోక్‌సభ ఎన్నికలు చోరీకి గురయ్యాయి: రాహుల్‌గాంధీ
ఈసీ ఓటరు జాబితాపై
ఈసీ ఇచ్చిన ఓటరు లిస్టును స్కాన్ చేయలేం, కాపీ చేయలేం: రాహుల్‌గాంధీ
-
Aug 02, 2025 12:15 IST
జార్ఖండ్ మంత్రి రాందాస్‌కు తీవ్ర అస్వస్థత
బాత్రూమ్‌లో జారిపడి తలకు తీవ్ర గాయాలు
మెదడులో రక్తం గడ్డ కట్టిందన్న వైద్యులు
మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలింపు
-
Aug 02, 2025 10:55 IST
కర్ణాటక: ధర్మస్థలలో ఐదో రోజు కొనసాగుతున్న తవ్వకాలు
9వ నెంబర్ పాయింట్ దగ్గర మానవ అవశేషాల కోసం తవ్వకాలు
ఇంకా నాలుగు పాయింట్లలో తవ్వకాలు జరపనున్న STI, ఫోరెన్సిక్
భారీ భద్రత మధ్య కొనసాగుతున్న తవ్వకాలు
-
Aug 02, 2025 10:41 IST
సింగపూర్‌లో ముగిసిన మంత్రి నారాయణ బృందం పర్యటన
మలేషియాకు చేరుకున్న మంత్రి నారాయణ బృందం
అమరావతి నిర్మాణానికి సంబంధించి..
మలేషియాలో ఉన్న ఉత్తమ పద్దతులపై అధ్యయనం
పుత్రజయ నిర్మాణంపై అధ్యయనం చేయనున్న బృందం
పాలనా భవన నిర్మాణాలు, మౌలిక వసతులు..
టెక్నాలజీ పార్కులను అధ్యయనం చేయనున్న బృందం
-
Aug 02, 2025 10:07 IST
హైదరాబాద్: ఈరోజు దోస్త్ రిజిస్ట్రేషన్లకు తుది గడువు
రేపటి వరకు వెబ్ ఆప్షన్లు, 6న సీట్ల కేటాయింపు
-
Aug 02, 2025 10:06 IST
తెలంగాణలో కొనసాగుతున్న కాంగ్రెస్ జనహిత పాదయాత్ర
నేడు జోగిపేట డిగ్రీ కాలేజీలో శ్రమదాన కార్యక్రమం
శ్రమదానంలో పాల్గొననున్న మీనాక్షి నటరాజన్
నిజామాబాద్ జిల్లాలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర
ఆలూరు నుంచి ఆర్మూర్ పాత బస్టాండ్ వరకు యాత్ర
రాత్రికి ఆర్మూర్‌లో బస చేయనున్న కాంగ్రెస్ నేతలు
-
Aug 02, 2025 10:06 IST
అమరావతి: మెగా DSC ఫైనల్ కీ విడుదల
విద్యాశాఖ వెబ్‌సైట్‌లో మెగా DSC ఫైనల్ కీ
16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
-
Aug 02, 2025 09:30 IST
ప్రకాశం: సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పు
దర్శిలో మధ్యాహ్నం జరగాల్సిన కార్యకర్తల సమావేశం రద్దు
దర్శి మం. తూర్పు వీరాయపాలెంలో..
'అన్నదాత సుఖీభవ' నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
ఆ తర్వాత రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి
-
Aug 02, 2025 09:29 IST
మా దగ్గర తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయి: రష్యా
అమెరికా హెచ్చరికలపై రష్యా స్పందన
మహాసముద్రాల్లో US జలాంతర్గాములు కంటే మావే ఎక్కువ: రష్యా
ట్రంప్ ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు: రష్యా
-
Aug 02, 2025 09:01 IST
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కమిటీ ఏర్పాటు
ఈ నెల 4 వరకు అధ్యయనం చేయనున్న కమిటీ
అనంతరం కేబినెట్‌కు నివేదిక ఇవ్వనున్న కమిటీ
4న జరిగే కేబినెట్ బేటీలో నివేదికలపై చర్చ
-
Aug 02, 2025 08:26 IST
జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్
కుల్గాంలో ఇద్దరు ఉగ్రవాదులను చుట్టుముట్టిన బలగాలు
భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాది హతం, కొనసాగుతోన్న కూంబింగ్
-
Aug 02, 2025 07:41 IST
లాహోర్‌లో పట్టాలు తప్పిన ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్
30 మంది ప్రయాణికులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
లాహోర్ నుంచి రావల్పిండి వెళ్తుండగా ఘటన
-
Aug 02, 2025 07:32 IST
జమ్ముకశ్మీర్‌లో విరిగిపడిన కొండచరియలు
కారుపై కొండచరియలు పడి ఇద్దరు మృతి
మరో ముగ్గురి పరిస్థితి విషమం
మృతులు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాణా, కుమారుడు
రియాసి జిల్లా సలుఖ్ ఇఖ్తేర్ నల్లా ప్రాంతంలో ఘటన
-
Aug 02, 2025 06:50 IST
నేడు అమరావతికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
29 జాతీయరహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
సా.5 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో కార్యక్రమం
హాజరుకానున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పెమ్మసాని
-
Aug 02, 2025 06:29 IST
నేడు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన
వారణాసిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
రూ.2,200 కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
-
Aug 02, 2025 06:29 IST
ఢిల్లీ: నేడు AICC ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్
'రాజ్యాంగ సవాళ్లు - మార్గాలు, దృక్పథాలు'పై AICC కార్యక్రమం
హాజరుకానున్న ఖర్గే, రాహుల్, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు
-
Aug 02, 2025 06:11 IST
నేడు పీఎం కిసాన్ 20వ విడత నిధులు విడుదల
పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న మోదీ
9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ
రూ.20,500 కోట్లు జమ చేయనున్న కేంద్ర ప్రభుత్వం