-
-
Home » Mukhyaamshalu » ABN Andhrajyothy Telangana Andhra pradesh and national latest breaking news and live updates on 6th Dec 2025 VREDDY
-
BREAKING: భారత్ ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి
ABN , First Publish Date - Dec 06 , 2025 | 08:34 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 06, 2025 19:31 IST
హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు పరిశీలించిన సీఎం రేవంత్
గ్లోబల్ సమ్మిట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం
-
Dec 06, 2025 19:31 IST
అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం.. ఎందుకంటే..
ఇండిగో సంక్షోభంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక విమానాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
Dec 06, 2025 19:31 IST
ఇండిగో ప్రతినిధులతో కేంద్రమంత్రి..
ఢిల్లీ: ఇండిగో ప్రతినిధులతో కేంద్రమంత్రి రామ్మోహన్ భేటీ
హాజరైన ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్
-
Dec 06, 2025 17:14 IST
దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు వెనక్కి కట్టాడు కదా: సీఎం చంద్రబాబు
తప్పేముందని జగన్ అనైతికంగా వాదిస్తున్నారు: చంద్రబాబు
సున్నిత అంశాలను సెటిల్‌చేశామని తేలిగ్గా మాట్లాడుతున్నారు: సీఎం చంద్రబాబు
కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగతో సెటిల్‌మెంట్ ఏంటి?: చంద్రబాబు
లా అండ్ ఆర్డర్ విషయంలో మొహమాటాలు లేవు: చంద్రబాబు
వైసీపీ హయాంలో నేరస్తులను పెంచి పోషించారు: చంద్రబాబు
వైసీపీ పాలనలోనే ఏపీలో నేరస్తులు తయారయ్యారు: సీఎం చంద్రబాబు
లేడీ డాన్లు, రౌడీషీటర్ల తోకలు కట్ చేస్తాం: సీఎం చంద్రబాబు
ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారు.. కొందరికే కడుపుమండుతోంది
రాజధాని నిర్మాణ పనుల వేగం పెరిగింది: సీఎం చంద్రబాబు
-
Dec 06, 2025 17:14 IST
మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు చిట్‌చాట్
జగన్‌కు వివేకా కేసు చిన్నదైనప్పుడు.. తిరుమల పరకామణి కేసు పెద్దదవుతుందా?: సీఎం చంద్రబాబు
భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు: చంద్రబాబు
జగన్‌కు దేవుడు, ఆలయాల పవిత్రత అంటే లెక్క లేదు
బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన జగన్..
పరకామణి చోరీ కేసునూ సెటిల్ చేయాలని చూశారు: చంద్రబాబు
చోరీని కూడా తప్పు కాదనేవారిని ఏమనాలి?: చంద్రబాబు
సెంటిమెంట్ విషయాల్లోనూ సెటిల్‌మెంట్ వ్యాఖ్యలా?: చంద్రబాబు
-
Dec 06, 2025 17:13 IST
నకిలీ మద్యం కేసు నిందితులపై ఎక్సైజ్ కోర్టులో సిట్ చార్జ్‌షీట్
జోగి రమేష్ అండతోనే అద్దేపల్లి నకిలీ మద్యం తయారుచేశారు: సిట్
మంత్రిగా ఉన్నప్పుడే జోగి బ్రదర్స్‌కు లంచాలు ఇచ్చారు: సిట్
జోగి బ్రదర్స్‌కు అద్దేపల్లి బ్రదర్స్ నెలకు రూ.5 లక్షల వరకు ముట్టజెప్పేవారు
విడతల వారీగా అద్దేపల్లి జనార్ధన్‌రావు ఖాతా నుంచి..
జోగి రాము ఖాతాకు నగదు బదిలీ చేశారు: చార్జ్‌షీట్‌లో సిట్
కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకే..
ములకలచెరువులో నకిలీ మద్యం కేంద్రం ఏర్పాటు: సిట్
-
Dec 06, 2025 16:17 IST
కేసీఆర్ పాలనలో పేదలకు దొడ్డుబియ్యం ఇచ్చారు: సీఎం రేవంత్
దేశంలో ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం ఇవ్వట్లేదు: సీఎం రేవంత్
మా హయాంలో సన్నబియ్యం సరఫరా చేస్తున్నాం: సీఎం రేవంత్
పేదల ఆకలి తీర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్
డబుల్ బెడ్‌రూం ఇళ్లు మాటఇచ్చి కేసీఆర్ మోసం చేశారు: రేవంత్
యూపీఏ హయాంలో తెలంగాణలో 25 లక్షల ఇళ్లు మంజూరు చేశారు: రేవంత్
ఇప్పుడు తెలంగాణలో 4 లక్షలకు పైగా ఇళ్లు కడుతున్నాం: రేవంత్
పదేళ్ల BRS పాలనలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో చెప్పాలి: సీఎం రేవంత్
కాంగ్రెస్ పాలనలో పేదలకు న్యాయం జరుగుతుంది: సీఎం రేవంత్
-
Dec 06, 2025 16:17 IST
నల్గొండ: దేవరకొండలో ప్రజాపాలన విజయోత్సవ సభ
ప్రజాపాలన రెండేళ్లు పూర్తిచేసుకుంటున్నాం: సీఎం రేవంత్
నిజాంలు, రజాకార్లను తరిమికొట్టిన ప్రాంతం నల్గొండ: రేవంత్
గడీల పాలనను ప్రజలు తరిమికొట్టారు: సీఎం రేవంత్‌రెడ్డి
సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా పాలన సాగుతోంది: రేవంత్
గతంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచనే చేయలేదు
పేదలందరికీ మేం రేషన్ కార్డులు ఇచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం: రేవంత్
-
Dec 06, 2025 15:42 IST
ఇండిగో సీఈవోకు ఉద్వాసన?
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు ఉద్వాసన?
ఇండిగోపై చర్యలు తీసుకునే దిశగా కేంద్రం?
ఇండిగోపై భారీ పెనాల్టీలు?
-
Dec 06, 2025 15:42 IST
నల్లగొండ పర్యటనలో రేవంత్..
నల్లగొండ: దేవరకొండలో సీఎం రేవంత్‌రెడ్డి
పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపనలు
-
Dec 06, 2025 15:28 IST
ఆ దమ్ము ఏ దేశానికీ లేదు: జైశంకర్..
భారత్ బంధాలను వీటో చేసే అధికారం ఏ దేశానికీ లేదు: కేంద్రమంత్రి జైశంకర్
అన్ని దేశాలతో సహకారాన్ని కొనసాగించడం భారత్‌కు కీలకం: జైశంకర్
వాణిజ్యంపై త్వరలో అమెరికాతో ఒప్పందం: కేంద్రమంత్రి జైశంకర్
-
Dec 06, 2025 15:27 IST
ఆస్ట్రేలియా ఆలౌట్
యాషెస్ రెండో టెస్ట్: తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 511 ఆలౌట్
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 334 ఆలౌట్
ఇంగ్లండ్‌పై 177 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా
-
Dec 06, 2025 14:07 IST
భార్య పుట్టింటికి వెళ్లిందని.. టవర్ ఎక్కిన భర్త..
కామారెడ్డి: ఎల్లారెడ్డి మండల కేంద్రంలో సెల్ టవర్ ఎక్కిన యువకుడు..
తన భార్య పుట్టింటికి వెళ్లి నాలుగు నెలలుగా రాకపోవడంతో టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన పవన్..
తన భార్య తిరిగి రావాలని యువకుడి డిమాండ్..
యువకుడికి నచ్చజెప్పి టవర్ నుండి కిందకు దింపిన పోలీసులు.
-
Dec 06, 2025 14:03 IST
ఛార్జీల పెంపుపై కేంద్ర విమానయానశాఖ ఆగ్రహం
విమాన ఛార్జీల పెంపుపై కేంద్ర విమానయానశాఖ ఆగ్రహం
ఇండిగో సర్వీసులు రద్దయిన మార్గాల్లో ఛార్జీలు క్రమబద్ధీకరణ
అడ్డగోలుగా విమాన ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదు: కేంద్రం
ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలి: కేంద్రం
కొత్తగా నిర్ణయించిన ఛార్జీలు తప్పనిసరిగా పాటించాలి: కేంద్రం
-
Dec 06, 2025 13:58 IST
ఐబొమ్మ రవి కస్టడీపై పిటిషన్..
ఐబొమ్మ రవి కస్టడీపై అప్పీల్‌కు వెళ్లిన సైబర్‌క్రైమ్ పోలీసులు
3కేసుల్లో 3రోజుల కస్టడీ సరిపోదని పోలీసుల పిటిషన్..
రవిని కస్టడీకి తీసుకోకుండా అప్పీల్‌కు వెళ్లిన పోలీసులు..
అప్పీల్ పిటిషన్‌పై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ.
-
Dec 06, 2025 13:30 IST
74 ఇండిగో విమానాలు రద్దు..
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన 70 ఇండిగో విమానాలు రద్దు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 74 ఇండిగో విమానాలు రద్దు చేసిన ఎయిర్ లైన్స్ అధికారులు..
మొత్తం 144 విమానాలను రద్దు చేసినట్టు ప్రకటించిన ఎయిర్‌లైన్స్ అధికారులు..
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఇండిగో కౌంటర్ వద్ద ఇంకా కొనసాగుతున్న ప్రయాణికుల పడిగాపులు..
టికెట్ క్యాన్సిల్ అయిన ప్రయాణికులకు అమౌంట్ రీఫండ్ చేస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్..
మరికొంతమంది ప్రయాణికులను ఇతర విమానాల్లో సర్దుబాటు చేస్తున్న సిబ్బంది.
-
Dec 06, 2025 13:22 IST
కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం..
ఢిల్లీ: 5 వరోజు కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం..
పూణే విమానాశ్రయంలో 42 ఇండిగో విమానాల రద్దు..
గంటల తరబడి ఎయిర్ పోర్ట్‌లో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు..
పూణే విమానాశ్రయంలో దేశీయ ఇండిగో సేవలకు గణనీయమైన అంతరాయం..
-
Dec 06, 2025 12:26 IST
ఇండిగో విమానాల రద్దుతో ద.మ.రైల్వే ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్-చెన్నై, చర్లపల్లి-కోల్‌కతా, హైదరాబాద్-ముంబైకి ప్రత్యేక రైళ్లు
ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్.. భారీగా వెయిటింగ్ లిస్ట్
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచుతాం: ద.మ.రైల్వే
-
Dec 06, 2025 10:56 IST
కరీంనగర్: బండి సంజయ్‌ని కలిసిన మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్
గ్లోబల్ సమ్మిట్‌కు బండి సంజయ్‌ని ఆహ్వానించిన మంత్రి పొన్నం
గ్లోబల్ సమ్మిట్‌ను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నాం: పొన్నం
తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడులే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
గత ప్రభుత్వం కేంద్ర సహకారం తీసుకోలేదు.. మేం అలా కాదు: పొన్నం
BRS ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు.. అందుకే అప్పుల పాలయ్యాం
తెలంగాణపై పక్షపాతం చూపొద్దని కేంద్రాన్ని కోరుతున్నాం: మంత్రి పొన్నం
-
Dec 06, 2025 10:43 IST
కొనసాగుతోన్న ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం
దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ఇండిగో విమానాలు రద్దు
హైదరాబాద్‌కు రావాల్సిన 26, వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలు రద్దు
బెంగళూరు 124, ముంబై 109, ఢిల్లీ 106, పుణె 42 విమానాలు రద్దు
విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి 9 ఇండిగో విమానాలు రద్దు
ఇండిగో సర్వీసుల రద్దుతో పెరిగిన విమాన చార్జీలు
ఇండిగో సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశం
ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన ఇండిగో సీఈవో
-
Dec 06, 2025 09:12 IST
ఢిల్లీలో మహాపరినిర్వాణ దినోత్సవం
అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మహాపరినిర్వాణ దినోత్సవం
అంబేద్కర్‌కు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, రాహుల్ నివాళులు
-
Dec 06, 2025 08:56 IST
హైదరాబాద్: సా.5గంటలకు ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి
మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించనున్న సీఎం
-
Dec 06, 2025 08:34 IST
లోక్ సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిన ఏలూరు యంపీ పుట్టా మహేష్ కుమార్
దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రతీ ఏటా ఎనిమిది లక్షల మంది తప్పిపోతున్నారని బిల్లులో పేర్కొన్న యంపీ
వారిలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉంటున్నారని వెల్లడి
వారిని వెతికి పట్టుకోవడానికి ప్రత్యేక బ్యూరో ఏర్పాటుచేయాలని కోరిన యంపీ పుట్టా మహేష్ కుమార్
-
Dec 06, 2025 08:34 IST
నేషనల్ హెరాల్డ్ కేసులో డీకే శివకుమార్‌కు EOW నోటీసులు
ఆర్థిక విషయాలు, లావాదేవీలపై శివకుమార్ వివరణ కోరుతూ నోటీసులు
డీకే శివకుమార్‌కు నోటీసులు పంపిన ఆర్థిక నేరాల విభాగం పోలీసులు