-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy latest viral trending and Breaking news across GLOBE 2nd oct 2025 kjr
-
BREAKING: సూపర్ సిక్స్ హామీలు అమలు చేశాం: సీఎం చంద్రబాబు
ABN , First Publish Date - Oct 02 , 2025 | 05:57 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 02, 2025 21:26 IST
సూపర్ సిక్స్ హామీలు అమలు చేశాం: సీఎం చంద్రబాబు
వైసీపీ హయాంలో ఏ వర్గానికీ సంతోషం లేదు: సీఎం చంద్రబాబు
గత వైసీపీ పాలనలో విధ్వంసం తప్ప ఏమీలేదు: సీఎం చంద్రబాబు
కూటమి విజయంతో ఏపీలో ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చింది
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల..
ఎక్కువమంది విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు
అమరావతిని ట్రాక్‌లో పెట్టాం: సీఎం చంద్రబాబు
రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి: చంద్రబాబు
ఉపాధి కోసం విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు..
మూడేళ్లలో రాజధానికి తిరిగొస్తారు: సీఎం చంద్రబాబు
-
Oct 02, 2025 19:52 IST
మావోయిస్టుల లొంగుబాటు..
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు
పోలీసుల ఎదుట లొంగిపోయిన 103 మంది మావోయిస్టులు
-
Oct 02, 2025 19:52 IST
అమరావతికి మణిహారంలా విజయవాడ ఉత్సవ్ ఉంటుంది: ఎంపీ కేశినేని
మైసూరులో దసరా ఉత్సవాల తరహాలో ఏటా విజయవాడ ఉత్సవ్
సాంస్కృతిక రాజధానిగా విజయవాడకు పూర్వవైభవం: కేశినేని శివనాథ్
విజయవాడ ఉత్సవ్‌కు కర్త, కర్మ, క్రియ చంద్రబాబే: ఎంపీ కేశినేని శివనాథ్
-
Oct 02, 2025 19:52 IST
విజయవాడ ఉత్సవ్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిన కార్నివాల్
సంస్కృతిని ప్రతిబింబించేలా 3 వేల మంది కళాకారుల ప్రదర్శనలు
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ
విజయవాడ ఉత్సవ్ జెండా ఊపి కార్నివాల్ ప్రారంభించిన చంద్రబాబు
ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ హాజరు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అమ్మవారి ఊరేగింపు రథం
కార్నివాల్‌కు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం
విజయవాడ మహాత్మాగాంధీ రోడ్‌లో ప్రారంభమైన కార్నివాల్
-
Oct 02, 2025 19:52 IST
అమరావతి: కాసేపట్లో విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు
విజయవాడ ఉత్సవ్ వేడుకల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
రాత్రి 8 గంటలకు గొల్లపూడిలోని విజయవాడ ఎగ్జిబిషన్‌కు హాజరు
-
Oct 02, 2025 19:26 IST
ఫ్రాన్స్‌లో ఏపీ మంత్రి గొట్టిపాటి పర్యటన..
పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూలం: మంత్రి గొట్టిపాటి
విశాఖ CII సమ్మిట్‌కు ఆహ్వానిస్తూ ఫ్రాన్స్‌లో రోడ్ షో
ఫాన్స్ పునరుత్పాదక విద్యుత్ సంస్థ ఈడీఎఫ్‌తో గొట్టిపాటి భేటీ
ఫ్రాన్స్ ఇన్వెస్టర్లను CII సమ్మిట్‌కు ఆహ్వానించిన మంత్రి గొట్టిపాటి
-
Oct 02, 2025 19:26 IST
అమరావతి: పన్నుల రాబడిలో ఏపీ పరుగులు
సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో SGST వసూళ్లు
నికర SGST వసూళ్లలో 7.45% వృద్ధి
సెప్టెంబర్‌లో రూ.2,789 కోట్లకు నికర SGST వసూళ్లు
-
Oct 02, 2025 17:59 IST
అహ్మదాబాద్ టెస్టు: ముగిసిన తొలిరోజు ఆట
ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ 121/2
క్రీజులో కేఎల్ రాహుల్ 53, శుభ్‌మన్ గిల్ 18 పరుగులు
వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్ 41 పరుగుల వెనుకంజలో భారత్
తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 162 ఆలౌట్
సిరాజ్ 4, బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ 2, సుందర్‌కు ఒక వికెట్
-
Oct 02, 2025 17:58 IST
విజయవాడ: SS కన్వెన్షన్‌లో ఖాదీ సంత కార్యక్రమం, పాల్గొన్న సీఎం చంద్రబాబు
ఖాదీ సంతలో స్టాళ్లు, స్వదేశీ వస్తువులను పరిశీలించిన సీఎం చంద్రబాబు
స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల ఫొటోలతో ఎగ్జిబిషన్
స్టాళ్ల దగ్గర చేతివృత్తుల కళాకారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
గాంధీజీ మనకు స్వదేశీ, సత్యం, అహింస గురించి నేర్పించారు: సీఎం చంద్రబాబు
ఖాదీ రాట్నంతో భారత్‌కు గాంధీజీ స్వాతంత్ర్యం తీసుకొచ్చారు: సీఎం చంద్రబాబు
జై జవాన్, జైకిసాన్ నినాదాన్ని లాల్‌బహదూర్ శాస్త్రి తీసుకొచ్చారు: చంద్రబాబు
మార్కెటింగ్‌లో ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు
స్పేస్ టెక్నాలజీలో భారత్ దూసుకుపోతోంది: సీఎం చంద్రబాబు
ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహనీయుడు పీవీ నరసింహారావు: చంద్రబాబు
-
Oct 02, 2025 15:42 IST
వర్షం కారణంగా అంతరాయం
అహ్మదాబాద్ టెస్టు: భారత్-వెస్టిండీస్ టెస్ట్‌కు వర్షం అంతరాయం
ఆట నిలిచే సమయానికి భారత్ 23/0, వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 162 ఆలౌట్
-
Oct 02, 2025 15:42 IST
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు
రాజరాజేశ్వరిదేవి ఆలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం
మ.3 గంటల వరకు అమ్మవారిని దర్శించుకున్న 94,723 మంది భక్తులు
-
Oct 02, 2025 15:42 IST
పాకిస్థాన్‌పై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆగ్రహం
సర్‌క్రీక్ ప్రాంతంలో పాక్ సైనిక కార్యకలాపాల రాజ్‌నాథ్ ఆగ్రహం
పాక్ వక్రబుద్ధి చూపిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక
-
Oct 02, 2025 15:42 IST
విజయవాడ: ఈనెల 6న స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం
21 కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం చంద్రబాబు
రాష్ట్ర స్థాయిలో 69, జిల్లాల్లో 1,257 అవార్డులు
-
Oct 02, 2025 15:34 IST
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
రాత్రికి గోపాల్‌పూర్-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం
ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన: వాతావరణ శాఖ
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
వంశధార, నాగావళి నదులకు వరద ముప్పు
ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల మండలాల్లో 11 గ్రామాలకు వరద ముప్పు
శ్రీకాకుళం కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08942 240557
విశాఖలో ఈదురుగాలులకు పలుచోట్ల కూలిన చెట్లు, నేలకొరిగిన హోర్డింగ్స్
GVMC కార్యాలయం, చినవాల్తేరు, ఈస్ట్‌పాయింట్ కాలనీలో కూలిన చెట్లు
విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 0891 2590 100, 0891 2590 102
-
Oct 02, 2025 13:17 IST
కొబ్బరి బొండాల మాటున.. గంజాయి..
కొబ్బరి బొండాల మాటున తరలిస్తున్న గంజాయిని ఈగల్ బృందం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం నుంచి రాజస్థాన్‌కు డీసీఎంలో కొబ్బరి బోండాలను తరలిస్తున్న ముఠా.
ముందు కారులో ఎస్కార్ట్ చేస్తూ పోలీసులను గమనిస్తూ రవాణా చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట వద్ద డీసీఎంను తనిఖీ చేసిన ఈగల్ టీమ్.. 401 కేజీల గంజాయిను సీజ్ చేసింది.
ముగ్గురు నిందితులు, 5 ఫోన్లు, కారు, డీసీఎం వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు.
-
Oct 02, 2025 11:56 IST
AICC అధ్యక్షుడు ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్
మల్లికార్జున ఖర్గే ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా
-
Oct 02, 2025 11:56 IST
విశాఖ: అగనంపూడి టోల్‌గేట్ దగ్గర RTA దాడులు
పండుగతో RTA అధికారులు ప్రత్యేక తనిఖీలు
ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్టు గుర్తింపు
కొన్ని బస్సుల్లో పరిమితి నుంచి రవాణా చేస్తున్నారని గుర్తింపు
44 బస్సులపై కేసు నమోదు చేసిన RTA అధికారులు
ఒడిశా, తమిళనాడు బస్సులు సీజ్ చేసిన అధికారులు
-
Oct 02, 2025 11:05 IST
ఈ నెల 9న విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం
అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం చంద్రబాబు
మొత్తం 21 కేటగిరీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డుల ప్రకటన
రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు, జిల్లా స్థాయిలో 1,257 అవార్డుల ప్రదానం
రాష్ట్ర స్థాయిలో 6 మున్సిపాలిటీలు, 6 గ్రామ పంచాయతీలు ఎంపిక
అవార్డులకు ఎంపికైన మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్,..
కుప్పం, పలమనేరు, తాడిపత్రి, ఆత్మకూరు (నెల్లూరు) బొబ్బిలి మున్సిపాలిటీలు
-
Oct 02, 2025 09:35 IST
తమిళనాడు విల్లుపురం దగ్గర రోడ్డు ప్రమాదం
డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు సజీవ దహనం
ఇద్దరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
-
Oct 02, 2025 08:34 IST
గాంధీ జయంతి సందర్భంగా నేడు బాపుఘాట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
లంగర్‌హౌస్ బాపుఘాట్ దగ్గర గాంధీ జయంతి వేడుకలు
బాపూజీకి నివాళులర్పించనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్
మధ్యాహ్నం నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లెకు వెళ్లనున్న సీఎం రేవంత్
కొండారెడ్డిపల్లెలో పలు కార్యక్రమాలు ప్రారంభించనున్న సీఎం రేవంత్
కొండారెడ్డిపల్లె నుంచి కొడంగల్ వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Oct 02, 2025 08:33 IST
గాజా నగరంపై దాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్
పాలస్తీనియన్లు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఆదేశం
గాజా నగరాన్ని వీడనివారిని హమాస్ మద్దతుదారులుగా గుర్తిస్తామన్న ఇజ్రాయెల్
మా సైనికులు జరిపే దాడులను గాజా ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుంది: ఇజ్రాయెల్
ఇప్పటికే గాజాను వీడి దక్షిణ ప్రాంతానికి వెళ్లిన 4లక్షల మంది
-
Oct 02, 2025 08:32 IST
తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
నేడు, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
-
Oct 02, 2025 07:30 IST
బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం
రేపు గోపాల్‌పూర్-పారాదీప్ మధ్య తీరందాటే అవకాశం
వారం రోజులు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ..
తూర్పు, పశ్చిమగోదావరి, యానంకు అరెంజ్ అలర్ట్
తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
ప్రధాన ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
-
Oct 02, 2025 07:30 IST
అక్టోబర్ 2 స్వచ్ఛ దివస్, స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా..
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మారథాన్ రన్
స్వచ్చదాన్" పేరుతో 21k,10k,5k మారథాన్ రన్
వివిధ రాష్ట్రాల నుంచి 10 వేల మంది రన్నర్స్ తో "మారథాన్ రన్"
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి మారథాన్ రన్
-
Oct 02, 2025 06:33 IST
తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఉ.6 నుంచి 9 గంటల మధ్య వరాహ పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం
చక్రతాళ్వార్‌కు అవభృధ స్నానం చేయించనున్న అర్చకులు
రా.7:30 గంటలకు ధ్వజ అవరోహణ కార్యక్రమంతో..
పరిసమాప్తం కానున్న బ్రహ్మోత్సవాలు
-
Oct 02, 2025 06:33 IST
మెగా కార్నివాల్‌తో నేడు విజయవాడ ఉత్సవ్ ముగింపు
MG రోడ్డులో రెండు కిలోమీటర్ల మెగా కార్నివాల్
3000 మంది కళాకారులతో అతిపెద్ద కార్నివాల్
కార్నివాల్‌లో ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి రథోత్సవం ఊరేగింపు
కార్నివాల్‌ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కోసం ప్రయత్నం
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారి యంత్రాంగం
కార్నివాల్ నేపథ్యంలో బెంజ్ సర్కిల్ నుంచి..
కంట్రోల్ రూమ్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు
-
Oct 02, 2025 06:30 IST
విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా నేడు కార్నివాల్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు
3వేల మంది కళాకారులతో భారీ ర్యాలీ
-
Oct 02, 2025 06:21 IST
నేడు దుర్గగుడిలో VIP దర్శనాలు రద్దు
కృష్ణానది వరదతో అమ్మవారి జలవిహారం రద్దు