Happiness of Wrongdoers: ఇతరులకు చెడు చేసేవాళ్లు ఎందుకు సంతోషంగా కనిపిస్తారు.. షాకింగ్ రీజన్స్ ఇవే..
ABN , Publish Date - Jul 26 , 2025 | 08:55 AM
చెడు పనులు చేసే వ్యక్తి ఎప్పుడూ ఎందుకు హ్యాపీగా ఉంటారనే ప్రశ్న ప్రజల మనసుల్లో తరచూ తలెత్తుతుంది. అలాంటివాళ్లు నిజంగా సంతోషంగా ఉంటారా? కేవలం నటనా? దీని వెనక కారణాలు తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఇతరులకు చెడు చేసేవారు, అబద్ధాలు చెప్పేవారు లేదా మోసం చేసేవారు తరచుగా నవ్వుతూ, సరదాగా గడుపుతూ ఉంటారని మీరు ఎప్పుడైనా గమనించారా? అలాంటి వారిని చూస్తే వారు దేనికీ చింతించనట్లు అనిపిస్తుంది. మరోవైపు నిజాయితీగా కష్టపడి జీవించే వ్యక్తులు నిత్యం ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తారు. అలాంటి పరిస్థితి తరచుగా మన మనస్సులోకి వచ్చే ప్రశ్న ఒకటే. చెడ్డ పనులు చేసే వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఎందుకు ఉంటాడు. వారి జీవితం నిజంగా అంత బాగుంటుందా లేదా అది కేవలం నటనా? ఈ 5 కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
తక్షణ ప్రయోజనాలను పొందడంలో ఆనందం
చెడు పనులు చేసే వ్యక్తులు తరచుగా దురాశతో అలా చేస్తారు. వారు సాధారణంగా డబ్బు, సుఖం లేదా ఆనందం వెంటనే ఇచ్చే మార్గాలను అవలంబిస్తారు. ఒకరిని మోసం చేయడం ద్వారా లేదా కష్టపడకుండా డబ్బు సంపాదించడం వంటి పనులు చేసేందుకు ఇష్టం చూపుతారు. తక్షణ ప్రయోజనం కలిగించే వంకర పనులు చేయడం వారి ఆనందాన్ని పెంచుతుంది. కానీ ఈ ఆనందం మనస్సు లోపలి నుంచి మాత్రం రాదు. అంతా పై పై సంతోషమే. అదీ తెలీక చెడు పనులు చేసిన తర్వాత కూడా ఎంత సంతోషంగా ఉన్నారో అని ప్రజలు అనుకుంటారు.
ప్రచారం కోసం నటన
చెడు పనులు చేసేవారు, అబద్ధాలు చెప్పేవారు లేదా నిజాయితీ లేనివారు తరచుగా తమ జీవితాలను చాలా బాగుండేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు సోషల్ మీడియాలో ఖరీదైన హోటళ్ళు, కార్లు, సంతోషకరమైన జీవితం గడుపుతున్నట్లుగా పది మందికి చూపించుకోవాలనుకుంటారు. కానీ ఇది కేవలం నటన. వాస్తవానికి వారు అంత సంతోషంగా ఉండరు. ప్రజలు తమ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుండా భ్రమింపచేయాలని చూస్తారు. లోపల ఎంత బాధపడినా బయటికి మాత్రం సంతోషంగా కనిపిస్తారు.
వాస్తవికకతు దూరం
చెడు పనులు చేసే వ్యక్తులు తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడం నేర్చుకుంటారు. తమ పని ఎవరికైనా హాని కలిగిస్తుందో లేదో అని వారు చింతించరు. అలాంటి వారు పట్టుబడినా ఏదో ఒక విధంగా తప్పించుకుంటామని బలంగా నమ్ముతారు. ఈ ఆలోచన వారిని భయం నుంచి దూరంగా ఉంచుతుంది. దాని కారణంగా వారు ఎల్లప్పుడూ చింత లేకుండా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తారు.
అశాంతిని దాచిపెడతారు
చెడు పనులు చేసేవారిలో భయం, సిగ్గు, విచారం కూడా ఉంటాయి. కానీ వారు వాటిని బయటకు చూపించరు. తాము బాధతో, భయంతో ఉన్నట్లు బయటికి కనిపిస్తే ప్రజలు వారిని బలహీనులుగా పరిగణించడం ప్రారంభిస్తారని వారికి తెలుసు. అందుకే ఇలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉండేందుకు ప్రయత్నిస్తారు. తమలో అంతర్గతంగా చెలరేగుతున్న అశాంతి బహిర్గతం కాకుండా నవ్వుతో కప్పిపుచ్చుకుంటారు.
సామాజిక ఆలోచనల ప్రభావం
నేటి సమాజం తరచుగా విజయాన్ని డబ్బు, సౌకర్యాల పరంగా మాత్రమే కొలుస్తుంది. ఒక వ్యక్తి ధనవంతుడై ఖరీదైన వస్తువులను ఉపయోగిస్తే చాలు. వాటిని ఎలా పొందాడనే దానితో సంబంధం లేకుండా ఆయా వ్యక్తులను విజయవంతమైన వ్యక్తిగా కీర్తిస్తారు. సమాజంలో ఈ తరహా మనస్తత్వం వేళ్లూనుకుపోవడం వల్లే చెడు పనులు చేసే వ్యక్తులు ఎక్కువ గౌరవం పొందుతారు. అందువల్ల తాము చాలా గొప్పవాళ్లని ఫీలైపోయి సంతోషంలో తేలిపోతారు. ఇది వారిలో దురాశను పెంచి మరిన్ని మోసాలు చేసేలా పురిగొల్పుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
వానాకాలంలో కారులో దుర్వాస పోవాలంటే ఈ టిప్స్‌ను పాటించాలి
నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్