Hyderabad: వ్యాపారాభివృద్ధికి లోన్ పేరుతో.. రూ.1.55 కోట్ల మోసం
ABN , Publish Date - Jul 26 , 2025 | 07:30 AM
వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన రుణం ఇప్పిస్తానని చెప్పి వ్యాపారి నుంచి రూ.1.55 కోట్లు కాజేసిన సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం అధికారులు అరెస్ట్ చేశారు. డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి తెల్లాపూర్ రోడ్‌లోని హానర్ వివాన్టిస్లో నాగరాజు దేవు (44) నివాసముంటున్నాడు.

- నకిలీ వెబ్‌సైట్‌తో సైబర్ నేరగాడి బురిడీ
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీ: వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన రుణం ఇప్పిస్తానని చెప్పి వ్యాపారి నుంచి రూ.1.55 కోట్లు కాజేసిన సైబర్ నేరగాడిని హైదరాబాద్ సైబర్ క్రైం(Hyderabad Cyber Crime) అధికారులు అరెస్ట్ చేశారు. డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి తెల్లాపూర్ రోడ్‌లోని హానర్ వివాన్టిస్లో నాగరాజు దేవు (44) నివాసముంటున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇతడు ‘‘ఫిన్‌పెయిర్‌డాట్‌ఇన్’’ పేరుతో నకిలీ వెబ్‌సైట్ రూపొందించాడు.
వ్యాపారాభివృద్ధికి రుణాలు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. బేగంబజార్‌కు చెందిన వ్యాపారి రుణం కోసం ఆన్‌లైన్‌లో వెదుకుతూ జూన్ 2023లో పిన్‌పెయిర్ ప్రకటన చూసి, ఆసక్తిని కనబరిచాడు. అతడికి ఫోన్ చేసిన నాగరాజు తాను ఫిన్ పెయిర్ సొల్యూషన్ ఎండీగా పరిచయం చేసుకున్నాడు. ‘మీ వ్యాపారాభివృద్ధికి అవసరమైన రుణాన్ని మంజూరు చేస్తా’ అని నమ్మబలికాడు. దాని కోసం పలు ఫీజుల పేరుతో పలు దఫాలుగా నవంబర్ 2023 వరకు రూ.1.55 కోట్లు వసూలు చేశాడు.
కొద్ది రోజుల్లో రుణం బ్యాంకు ఖాతాలో పడుతుందని నాగరాజు(Nagaraju) చెప్పి ఏడాది గడిచినా ఫలితం లేదు. ఫోన్ కాల్స్‌కు నాగరాజు స్పందించడం లేదు. దీంతో బాధితుడు 2025 ఫిబ్రవరిలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం సాంకేతిక ఆధారాలతో నిందితుడు నాగరాజును గుర్తించి అరెస్ట్ చేసింది. అతడి నుంచి 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్ ధర పెంపు
Read Latest Telangana News and National News