Tomato: పేరులో పండు ఉన్నా టమోటాను కూరగాయ అనే ఎందుకంటారు..
ABN , Publish Date - May 23 , 2025 | 07:55 PM
Is Tomato Fruit or Vegetable: టమోటా పండా? కూరగాయా? లేక రెండూనా? ఇది ఎప్పుడూ సమాధానం లేని ప్రశ్న లాగే అనిపిస్తుంది. భారతీయులు ప్రతిరోజూ ఆహారంలో తప్పనిసరిగా వాడే టమోటా పేరులో పండున్నా కూరగాయగానే ఎందుకు పరిగణిస్తున్నారో తెలుసుకుందాం.

Tomato Fruit or Vegetable Debate: భారతదేశంలో రోజూవారీ వంటకాల్లో టమోటా తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కిచెన్‌లో టమోటా లేకపోతే ఇంట్లో కూరగాయలు లేవన్నట్టే భావిస్తారు గృహిణులు. ఇది వేయకుండా వంటకం పూర్తికాదనే అంటారు. పప్పు, కూరలు, పచ్చళ్లు, గ్రేవీ, సలాడ్లు, సాస్, సూప్ ఇలా ఎన్నో రకాల పదార్థాలు టమోటా వేయకపోతే సరైన రుచి రావు. ఇవి రంగు, రుచిని పెంచడానికే కాదు. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ సి, లైకోపీన్, పొటాషియం, ఫోలేట్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ వంటి అనేక పోషకాలూ టమోటాలో పుష్కలంగా ఉన్నాయి. తియ్యగా, పుల్లగా ఉంటే టమోటాను కూరగాయ అనే ఎందుకు అంటారో ఇప్పుడు చూద్దాం..
టమోటాను పండు అని ఎందుకు పిలుస్తారు?
ప్రపంచవ్యాప్తంగా సుమారు 9000 రకాల టమోటాలు ఉన్నాయి. అమెరికాలో లవ్ ఆపిల్ అనే పిలిచే టమోటా తొలిసారి 16వ శతాబ్దంలో మన దేశానికి వచ్చింది. రుచిలో పుల్లగా ఉండటం వల్ల రోజూవారీ వంటకాల్లో ప్రధానంగా మారిపోయింది. ఇక ఇందులో విత్తానాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇతర పండ్ల మాదిరిగానే టమోటాలు మొక్కలకు పూచే పువ్వుల నుంచే కాస్తాయి. ఈ కారణం వల్లే దీనిని పండు అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి అనేక నిఘంటువులలో టమోటాను ఒక పండుగా ప్రస్తావించారు.
దీన్ని కూరగాయగానే ఎందుకు పరిగణిస్తారు?
మనం సాధారణంగా పండ్లను డెజర్ట్‌లు లేదా స్వీట్‌లలో ఉపయోగిస్తాము . ఆపిల్, లిచీ, స్ట్రాబెర్రీ, మామిడి వంటి అనేక పండ్ల నుంచి స్వీట్లు తయారు చేస్తారు. కానీ టమోటాల విషయంలో అలా కాదు. ఇది ఎల్లప్పుడూ మెయిన్ కోర్సు కోసం వాడతారు. టమోటాలను ఎల్లప్పుడూ సలాడ్‌గా తింటారు. కూరగాయలలో గ్రేవీ రంగును పెంచడానికి ఉపయోగిస్తారు. కాబట్టి దీనిని కూరగాయ అంటారు. అందుకే సైన్స్ ప్రకారం దీనిని పండుగానే పరిగణిస్తారు.
టమోటాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గుతుంది.
గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది.
బరువు తగ్గడంలో ప్రయోజనకరమైనది.
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
చర్మానికి నిగారింపునిస్తుంది.
ఇవీ చదవండి:
అరటిపండ్లు నల్లగా మారుతున్నాయా.. ఇలా చేస్తే 2 వారాల వరకూ ఫ్రెష్‌గా ఉంటాయి..
రోజూ అలారం పెట్టుకునే అలవాటుందా... దీని వల్ల ఎంత
మరిన్ని హెల్త్, లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి