Kedarnath Yatra 2025: గంటల్లోనే కేదార్‌నాథ్ దర్శించుకునే ఛాన్స్.. అందుకోసం భక్తులు ఏం చేయాలంటే..
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:17 PM
Kedarnath Heli Yatra 2025: ప్రతి సంవత్సరం ఎందరో భక్తులు కేదార్‌నాథ్‌ను సందర్శిస్తారు. కానీ, ఈ యాత్ర కోసం ఎవరైనా కఠిన ప్రయాణం చేయాల్సిందే. ఎక్కువ రోజులు టూర్ కోసం వెచ్చించాల్సిందే. ఈ సదుపాయం వాడుకున్నారంటే ఏ సమస్యలు లేకుండా ఎవరైనా గంటల్లోనే కేదార్‌నాథ్ చేరుకునే ఛాన్స్ పొందవచ్చు.

Kedarnath Helicopter Booking 2025: హిమాలయాల్లోని అందమైన లోయల్లో కొలువున్న అత్యంత పవిత్రమైన ప్రసిద్ధ శివాలయాల్లో 'కేదార్‌నాథ్' ఒకటి. ఏడాదిలో కేవలం ఆరు నెలలే తెరిచి ఉండే ఈ ఆలయం ఈ సారి మే 2, 2025న భక్తులకు అందుబాటులోకి రాబోతుంది. ఛార్‌ధామ్ యాత్రలో భాగంగా ప్రతి సంవత్సరం భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు సాహసమే చేస్తారు. గడగడ వణికించే చలి, జారుతూ ఉండే సన్నని రహదారులు, ఎత్తైన లోయల మధ్య రోజుల తరబడి ప్రయాణించి ఇక్కడకు చేరుకుంటారు. కానీ, కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటే భక్తులు ఇకపై అంత శ్రమించాల్సిన పనిలేదు. కొద్ది గంటల్లోనే శివుణ్ని దర్శనం పొందవచ్చు. ఇప్పటికే బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మీకూ ఆసక్తి ఉన్నట్లయితే వెంటనే టికెట్ ధరలు, బుకింగ్ విధానం గురించి తెలుసుకోండి.
సముద్ర మట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించడానికి కొందరు కాలినడకన వెళతారు, మరికొందరు పిట్టు సహాయంతో వెళతారు. చాలా మంది హెలికాప్టర్ బుక్ చేసుకోవడం ద్వారా కూడా వెళతారు. మీరు కూడా హెలికాప్టర్ ద్వారా కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నారా.. ఎలాంటి సమస్యలు రాకుండా యాత్ర సవ్యంగా పూర్తవ్వాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే హెలికాప్టర్ బుకింగ్ ప్రక్రియ గురించి తెలుసుకోండి.
హెలికాప్టర్ బుకింగ్ తేదీలు
కేదార్‌నాథ్ హెలికాప్టర్ టికెట్ బుకింగ్ ఏప్రిల్ 8 నుంచే IRCTC వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది. మీరు శ్రీ హేమకుండ్ సాహిబ్ కోసం హెలికాప్టర్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ హెలీ ప్రయాణం మే 2 నుంచి మే 31, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
హెలికాప్టర్ బుకింగ్ ప్రక్రియ
కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ బుక్ చేసుకోవాలంటే మీరు ముందుగా కేదార్‌నాథ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంకా చేసుకోకపోతే అధికారిక వెబ్‌సైట్ registrationandtouristcare.uk.gov.in ని సందర్శించి కేదార్‌నాథ్ యాత్రకు నమోదు చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డ్ అవసరం.
తర్వాత కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీస్ బుక్ చేసుకోవడానికి ఇలా చేయండి.
ముందుగా IRCTC హెలీయాత్ర వెబ్‌సైట్ heliyatra.irctc.co.in ని సందర్శించాలి.
తర్వాత లాగిన్ అయి హోలీ యాత్ర అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
హోలీ యాత్ర ఆప్షన్ ఎంచుకున్న వెంటనే చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నంబర్ అడుగుతారు.
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత తేదీలు, టైం స్లాట్‌లను ఎంచుకుని సబ్మిట్ చేయాలి.
సమాచారాన్ని నమోదు చేసి పేమెంట్ చేసిన వెంటనే మీ మొబైల్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేశాక మీ టికెట్ బుక్ అవుతుంది.
టికెట్ బుక్ చేసుకున్న తర్వాత దాని ప్రింటవుట్ తీసుకోండి. ప్రయాణ సమయంలో టికెట్ హార్డ్ కాపీ కచ్చితంగా అడుగుతారు.
టికెట్ ధరలు
సిర్సి నుంచి కేదార్‌నాథ్ వరకు టికెట్ ధర దాదాపు రూ.6,061 రూపాయలు. ఫాటా నుంచి కేదార్‌నాథ్ వరకు ఇది దాదాపు రూ.6,063 రూపాయలు. గుప్త్కాషి నుంచి కేదార్‌నాథ్ వరకు రూ.8,533 రూపాయలు. ప్రయాణీకుండి పూర్తి ట్రిప్ కోసం ఈ ఛార్జీ వసూలు చేస్తారని గమనించండి.
Read Also: IRCTC North East Tour Package: 7 సిస్టర్స్ అందాలను వీక్షించేందుకు ...
IRCTC: తిరుపతికి చౌక టూర్ ప్యాకేజీ..పిల్లలతో సహా ఇలా ఈజీగా ...
Gir National Park : గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది.. ఎలా చేరుకోవాలి.. జంగిల్ ...